జింబాబ్వే పర్యటనకు టీమిండియా.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌.. షెడ్యూల్‌ ఇదే

Zimbabwe Will Host A Five Match T20I Series Against India In July 2024 - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌ 2024 ముగిసిన అనంతరం భారత క్రికెట్‌ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటలో భారత్‌ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి.

ఈ పర్యటన వివరాలను జింబాబ్వే క్రికెట్‌ బోర్డు కొద్ది సేపటి క్రితం వెల్లడించింది. బీసీసీఐతో సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం ఈ సిరీస్‌ ఖరారైనట్లు తెలుస్తుంది. జింబాబ్వే క్రికెట్‌ చైర్మన్‌ తవెంగ్వా ముకుహ్లానీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరిస్తూ ట్వీట్‌ చేశాడు. 

మా దేశంలో ఈ సంవత్సరం జరిగే అతిపెద్ద అంతర్జాతీయ ఈవెంట్‌ ఇదే. టీమిండియాకు ఆతిథ్యమిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మా దేశ పర్యటనకు ఒప్పుకున్నందుకు బీసీసీఐకి ధన్యవాదాలు అంటూ తవెంగ్వా ట్వీట్‌లో పేర్కొన్నాడు. 

కాగా, టీమిండియాకు ఆతిథ్యమివ్వడం వల్ల జింబాబ్వే క్రికెట్‌ బోర్డు ఆర్ధిక స్థితిగతుల్లో పెను మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఆ దేశంలో భారత ద్వితియ శ్రేణి జట్టు పర్యటించినా జింబాబ్వే క్రికెట్‌ బోర్డుపై కాసుల వర్షం కురువడం ఖాయం. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ప్రజాధరణ వల్ల జింబాబ్వే క్రికెట్‌ బోర్డు దశ మారిపోతుంది. తమ క్రికెటర్లకు  జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో జింబాబ్వే బోర్డుకు భారత పర్యటన ద్వారా భారీ లబ్ది చేకూరనుంది.

 

whatsapp channel

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top