జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న.. కెప్టెన్‌గా శుబ్‌మ‌న్ గిల్‌ | Shubman Gill Named Skipper For IND Vs ZIM Series As BCCI Announces Squad | Sakshi
Sakshi News home page

IND vs ZIM: జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న.. కెప్టెన్‌గా శుబ్‌మ‌న్ గిల్‌

Published Mon, Jun 24 2024 6:20 PM | Last Updated on Mon, Jun 24 2024 7:10 PM

Shubman Gill named skipper for IND vs ZIM series as BCCI announces squad

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 ముగిసిన త‌ర్వాత టీమిండియా జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఐదు టీ20ల సిరీస్‌లో ఆతిథ్య జ‌ట్టుతో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ నేప‌థ్యంలో జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు 15 మంది స‌భ్యుల‌తో కూడిన భార‌త జ‌ట్టును బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ సోమ‌వారం ప్ర‌క‌టించింది. 

ఈ సిరీస్‌కు ప్ర‌స్తుత టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగ‌మైన భార‌త ఆట‌గాళ్లంతా దాదాపుగా దూరమ‌య్యారు. సంజూ శాంస‌న్, య‌శ‌స్వీ జైశ్వాల్ మిన‌హా మిగితా ఆట‌గాళ్లంద‌రికి సెల‌క్ట‌ర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో ఈ ప‌ర్య‌ట‌న‌లో భార‌త జ‌ట్టుకు యువ ఓపెన‌ర్ శుబ్‌మ‌న్ గిల్ సార‌థ్యం వ‌హించ‌నున్నాడు.

 ఇక ఐపీఎల్‌లో అద‌ర‌గొట్టిన యువ ఆట‌గాళ్లు అభిషేక్ శ‌ర్మ‌, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి, రియాన్ ప‌రాగ్‌, తుషార్ దేశ్ పాండేకు తొలిసారి భార‌త జ‌ట్టులో చోటు ద‌క్కింది. జూలై 6న హ‌రారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.

జింబాబ్వే సిరీస్‌కు భారత జ‌ట్టు
శుబ్‌మ‌న్‌ గిల్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్), ధృవ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ , తుషార్ దేశ్‌పాండే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement