Ind Vs Zim: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. సెమీస్‌లో ఇంగ్లండ్‌తో అమితుమీ

T20 WC 2022 Ind Vs Zim: Playing XI Highlights And Updates In Telugu - Sakshi

జింబాబ్వేపై ఘన విజయం.. గ్రూప్‌-2 టాపర్‌గా సెమీస్‌కు టీమిండియా
టి20 ప్రపంచకప్‌లో టీమిండియా గ్రూప్‌-2 టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెట్టింది. జింబాబ్వేతో జరిగిన సూపర్‌-12 మ్యాచ్‌లో టీమిండియా 71 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే టీమిండియా బౌలర్ల దాటికి ఏ దశలోనూ పోరాడలేకపోయింది. 17.2 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌట్‌ అయింది. రియాన్‌ బర్ల్‌ 35, సికందర్‌ రజా 34 పరుగులు చేశారు. అశ్విన్‌ మూడు వికెట్లతో రాణించాడు. ఈ విజయంతో గ్రూప్‌-2 టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెట్టిన టీమిండియా ఇంగ్లండ్‌తో అమితుమీ తేల్చుకోనుంది.

అశ్విన్‌ మాయాజాలం.. తొమ్మిదో వికెట్‌ డౌన్‌
► టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి జింబాబ్వేను దెబ్బతీశాడు. ప్రస్తుతం జింబాబ్వే 9 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది.

రియాన్‌ బర్ల్‌(35) ఔట్‌.. ఆరో వికెట్‌ కోల్పోయిన జింబాబ్వే
► రియాన్‌ బర్ల్‌(35) రూపంలో జింబాబ్వే ఆరో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం జింబాబ్వే 15 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది.

42 పరుగులకే ఐదు వికెట్లు.. కష్టాల్లో పడిన జింబాబ్వే
► టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌లో జింబాబ్వే ఓటమి దిశగా పయనిస్తోంది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 41 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ జింబాబ్వేపై ఒత్తిడి పెంచుతున్నారు. ప్రస్తుతం జింబాబ్వే ఐదు వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. రియాన్‌ బర్ల్‌ 3, సికందర్‌ రజా 3 పరుగులతో ఆడుతున్నారు.

పవర్‌ ప్లేలో జింబాబ్వే స్కోరు- 28/3 (6)
షమీ బౌలింగ్‌లో మూడో వికెట్గా విలియమ్స్‌ వెనుదిరిగాడు.

రెండో వికెట్‌ కోల్పోయిన జింబాబ్వే
అర్ష్‌దీప్‌ బౌలింగ్లో చకబ్వా బౌల్డ్‌ అయ్యాడు. స్కోరు: 2/2 (1.4)

మొదటి వికెట్‌ డౌన్‌
టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ భారత్‌కు శుభారంభం అందించాడు. మొదటి బంతికి జింబాబ్వే ఓపెనర్‌ మాధేవెరేను పెవిలియన్‌కు పంపాడు. మొదటి ఓవర్‌ ముగిసే సరికి జింబాబ్వే స్కోరు:  0-1

భారత్‌ స్కోరెంతంటే
జింబాబ్వేతో మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(51), మిడిలార్డర్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(61) హాఫ్‌ సెంచరీలతో మెరిశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో రోహిత్‌ సేన 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేయగలిగింది. 

వచ్చాడు.. హాఫ్‌ సెంచరీ కొట్టాడు
సూర్యకుమార్‌ యాదవ్‌ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 23 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

ఐదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
హార్దిక్‌ పాండ్యా(18) ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. సూర్య, అక్షర్‌ పటేల్‌ క్రీజులో ఉన్నారు.

18 ఓవర్లలో టీమిండియా స్కోరు- 152/4
సూర్య 37, పాండ్యా 11 పరుగులతో క్రీజులు ఉన్నారు.

నిరాశపరిచిన పంత్‌
ఈ ఎడిషన్‌లో తొలిసారిగా తుది జట్టులో చోటు దక్కించుకున్న రిషభ్‌ పంత్‌ పూర్తిగా నిరాశపరిచాడు. 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు. హార్దిక్‌, సూర్య క్రీజులో ఉన్నారు.

రాహుల్‌ అవుట్‌
సిక్సర్‌తో అర్ధ శతకం పూర్తి చేసుకున్న కేఎల్‌ రాహుల్‌(51) రజా బౌలింగ్‌లో మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. పంత్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 98/3 (13)

రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
కోహ్లి రూపంలో టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. పన్నెండో ఓవర్‌ ఆఖరి బంతికి విలియమ్స్‌ బౌలింగ్‌లో బర్ల్‌కు క్యాచ్‌ ఇచ్చి 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి నిష్క్రమించాడు. 12 ఓవర్లలో స్కోరు: 89-2. కేఎల్‌ రాహుల్‌ (45), సూర్యకుమార్‌ యాదవ్‌ క్రీజులో ఉన్నారు. 

10 ఓవర్లలో టీమిండియా స్కోరు: 79/1
రాహుల్‌ 41, కోహ్లి 22 పరుగులతో క్రీజులో ఉన్నారు.

9 ఓవర్లలో భారత్‌ స్కోరు: 71/1
కోహ్లి 20, రాహుల్‌ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు.

పవర్‌ ప్లేలో టీమిండియా స్కోరు: 46/1 (6)
కోహ్లి 10, రాహుల్‌ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్‌ డౌన్‌
జింబాబ్వేతో నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(15) నాలుగో ఓవర్‌ ఐదో బంతికి అవుటయ్యాడు. ముజరబానీ బౌలింగ్‌లో మసకద్జాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. కోహ్లి, రాహుల్‌ క్రీజులో ఉన్నారు. 4 ఓవర్లలో స్కోరు: 31-1

సెమీస్‌లో భారత్‌తో పాటు ఆ జట్టు
ఇప్పటికే గ్రూప్‌-2 నుంచి సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకున్న టీమిండియా సూపర్‌-12లో తమ ఆఖరి మ్యాచ్‌లో జింబాబ్వేతో తలపడుతోంది. మెల్‌బోర్న్‌ వేదికగా క్రెయిగ్‌ ఎర్విన్‌ బృందంతో నామమాత్రపు మ్యాచ్‌ ఆడనుంది. ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇక జింబాబ్వేతో మ్యాచ్‌తో టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌.. ఈ వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో తొలిసారిగా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.

కాగా అనూహ్య పరిస్థితుల్లో పసికూన నెదర్లాండ్స్‌ చేతిలో ఓడి సౌతాఫ్రికా ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. దీంతో ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా భారత్‌ సెమీస్‌ చేరింది. ఈ క్రమంలో మరో కీలక మ్యాచ్‌లో పాకిస్తాన్‌.. బంగ్లాపై విజయం సాధించి.. దాయాది టీమిండియాతో పాటు సెమీస్‌లో అడుగుపెట్టింది.

ఇండియా వర్సెస్‌ జింబాబ్వే
తుది జట్లు ఇవే:
భారత్:
కేఎల్‌ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్(వికెట్‌ కీపర్‌), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.

జింబాబ్వే
వెస్లీ మాధేవెరే, క్రెయిగ్ ఎర్విన్(కెప్టెన్‌), రెగిస్ చకబ్వా(వికెట్‌ కీపర్‌), సీన్ విలియమ్స్, సికందర్ రజా, టోనీ మునియోంగా, ర్యాన్ బర్ల్, టెండై చటారా, రిచర్డ్ నగరవ, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజరబానీ

చదవండి: Temba Bavuma: ఈ ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం! ప్రధాన కారణం అదే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top