
జింబాబ్వేతో వన్డే సిరీస్‌ను టీమిండియా ఆసక్తికరంగా ప్రారంభించింది. గురువారం తొలి వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా జింబాబ్వేను 189 పరుగులకే కట్టడి చేసింది. దీపక్ చహర్ 3 వికెట్లతో ఘనంగా పునరాగమనం చేయగా.. ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్‌లు చెరో 3 వికెట్లు తీశారు. కాగా మ్యాచ్‌లో సంజూ శాంసన్ అందుకున్న క్యాచ్ హైలైట్‌గా నిలిచింది. దీపక్ చహర్ వేసిన స్వింగ్ బంతిని ఆడడంలో ఇన్నోసెంట్ కైయా విఫలమయ్యాడు. దీంతో బంతి బ్యాట్‌కు తాకి కీపర్ సంజూ వైపు వెళ్లింది.
కాగా సంజూ శాంసన్ క్యాచ్ అందుకునే క్రమంలో మొదటిసారి మిస్ అయ్యాడు.. కానీ రెండోసారి మాత్రం అవకాశం వదల్లేదు. ఒకవైపుకు డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సంజూ శాంసన్‌పై టీమిండియా అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు. ''మొదటిసారి విఫలం.. రెండోసారి సఫలం.. దటీజ్ సంజూ శాంసన్'' అంటూ కామెంట్ చేశారు.
చదవండి: ZIM vs IND: టీమిండియాపై జింబాబ్వే టెయిలండర్‌ల కొత్త చరిత్ర !
KL Rahul: కేఎల్ రాహుల్‌తో మజాక్ చేసిన టీమిండియా అభిమాని..
Out!#INDvsZIM @IamSanjuSamson @deepak_chahar9 @BCCI pic.twitter.com/Mp1dRmCiG0
— Nikhil Kalal (@NikhilK85748502) August 18, 2022