హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో 90 పరుగుల తేడాతో భారత్ భారీ విజయాన్ని అందుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కైవసం చేసింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది.
తొలుత బ్యాటింగ్‌లో 219 పరుగుల భారీ స్కోర్ సాధించిన మెన్ ఇన్ బ్లూ.. అనంతరం బౌలింగ్‌లో ప్రత్యర్ధి జట్టును 129 పరుగులకే కట్టడి చేసింది. ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శ్రేయస్ స్పందించాడు. భారత జట్టు కెప్టెన్‌గా తొలి టీ20 సిరీస్ విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉందని అయ్యర్ చెప్పుకొచ్చాడు.
"ఏకపక్ష విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం వల్లే ఈ అద్భుత విజయం సాధ్యమైంది. తొలుత బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ అసాధరణ ప్రదర్శన కనబరిచారు. వారిద్దరూ ఆడిన కొన్ని షాట్లు చూడటానికి ఎంతో ముచ్చటగా ఉన్నాయి.
ఈ పిచ్‌పై మొదట్లో 180 నుండి 200 పరుగులు చేస్తే మంచి స్కోర్ అని భావించాం. కానీ వారిద్దరి అద్భుత ఇన్నింగ్స్ వల్ల మేము ఏకంగా 219 పరుగులు సాధించాం. ఆ తర్వాత మా బౌలర్లు వారి పని వారు చేసుకుపోయారు. సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి ప్రత్యర్ధి జట్టును 129 పరుగులకే కట్టడి చేశారు.
మ్యాచ్ ఆరంభం నుంచే ఆతిథ్య జట్టుపై ఆధిపత్యం చెలాయించాం. టీ20 ఫార్మాట్‌లో ఫియర్ లెస్ క్రికెట్ ఆడడం చాలా ముఖ్యం. గతంలో ఏం జరిగింది అనే దాన్ని పక్కన పెట్టి, ప్రస్తుతం గురుంచి ఆలోచిస్తూ ముందుకు సాగడమే మా సిద్దాంతం.
ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోవాడనికి ప్రయత్నించాలి. ఆదివారం కూడా మాకు మరో మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను విజయంతో ముగించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో శ్రేయస్ పేర్కొన్నాడు.


