జపాన్‌- స్వీడన్‌ మ్యాచ్‌ డ్రా.. నాకౌట్‌కు ఇరుజట్లు | FIFA World Cup 2026: Japan Sweden advance to knockouts after Draw | Sakshi
Sakshi News home page

జపాన్‌- స్వీడన్‌ మ్యాచ్‌ డ్రా.. నాకౌట్‌కు ఇరుజట్లు

Jun 26 2026 8:59 AM | Updated on Jun 26 2026 11:25 AM

FIFA World Cup 2026: Japan Sweden advance to knockouts after Draw

ఫిఫా వరల్డ్‌కప్‌-2026లో జపాన్‌, స్వీడన్‌ సంయుక్తంగా నాకౌట్‌ దశకు చేరుకున్నాయి. గ్రూప్‌- ‘F’లో భాగంగా ఇరుజట్ల మధ్య డల్లాస్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌ 1-1తో డ్రా అయింది. గేమ్‌ తొలి అర్ధ భాగంలో ఇరుజట్లు ఎక్కువగా డిఫెన్స్‌కే ప్రాధాన్యం ఇచ్చాయి.

సగం మ్యాచ్‌ ముగిసేసరికి ఇరుజట్లు ఒక్క గోల్‌ కూడా చేయలేదు. అయితే, 56వ నిమిషంలో డైజెన్‌ మెయిడా గోల్‌ కొట్టడంతో జపాన్‌ ఖాతా తెరిచింది. ఆ తర్వాత ఆరు నిమిషాలకే స్వీడన్‌ ప్లేయర్‌ ఆంటోని ఎలాంగా గోల్‌ కొట్టి 1-1తో సమం చేశాడు. అనంతరం ఆఖరి వరకు ఇరుజట్లు గోల్‌ చేయలేకపోయాయి. ఫలితంగా మ్యాచ్‌ డ్రా అయింది.

తొలుత నెదర్లాండ్స్‌
కాగా ఈ గ్రూప్‌ నుంచి తొలుత నెదర్లాండ్స్‌ నాకౌట్‌ దశకు అర్హత సాధించగా.. రెండు, మూడు స్థానాల కోసం జపాన్‌- స్వీడన్‌ బరిలో నిలిచాయి. ఈ గ్రూప్‌లో ఇదే ఇదే ఫైనల్‌ మ్యాచ్‌ కాగా.. ఇరుజట్లు 1-1తో మ్యాచ్‌ను సమం చేసుకుని కలిసే నాకౌట్‌లో అడుగుపెట్టాయి. మరోవైపు.. ఈ గ్రూపులో చిట్టచివర నాలుగో స్థానంలో నిలిచిన ట్యునీషియా ఎలిమినేట్‌ అయిపోయింది.

గ్రూప్‌ దశలో నెదర్లాండ్స్‌ మూడింట రెండు గెలిచి ఒక మ్యాచ్‌ డ్రా చేసుకుని ఏడు పాయింట్లు సాధించగా.. జపాన్‌ మూడింట ఒకటి గెలిచి రెండు డ్రా చేసుకుని ఐదు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. 

ఇక స్వీడన్‌ మూడింట ఒకటి గెలిచి.. ఒకటి డ్రా చేసుకుని.. మరొకటి ఓడిపోయింది. దీంతో నాలుగు పాయింట్లు రాగా మూడో స్థానంలో నిలిచి.. నెదర్లాండ్స్‌, జపాన్‌లతో కలిసి నాకౌట్‌కు చేరుకుంది. ఇక ట్యునీషియా ఆడిన మూడింటా ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

చదవండి: కన్నీటి పర్యంతమైన నెయ్‌మార్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement