పోర్చు‘గోల్‌’ ఇంకా ఉంది | Ronaldo team advances to the pre quarterfinals | Sakshi
Sakshi News home page

పోర్చు‘గోల్‌’ ఇంకా ఉంది

Jul 4 2026 3:23 AM | Updated on Jul 4 2026 3:24 AM

Ronaldo team advances to the pre quarterfinals

ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి రొనాల్డో బృందం

నాకౌట్‌ మ్యాచ్‌లో క్రొయేషియాపై 2–1తో విజయం

టొరంటో: చివరి ప్రయత్నంలోనైనా ప్రపంచకప్‌ ట్రోఫీని అందుకోవాలనే లక్ష్యంతో బరిలోకి పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఈ మెగా ఈవెంట్‌లో నిలిచాడు. తాడో పేడో తేల్చుకునే నాకౌట్‌ దశ మ్యాచ్‌లో క్లిష్టమైన ప్రత్యర్థి క్రొయేషియా జట్టుపై రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్‌ జట్టు 2–1 గోల్స్‌ తేడాతో గెలిచింది. ఈ విజయంతో పోర్చుగల్‌ ప్రపంచకప్‌లో ఆరోసారి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ దశకు చేరుకుంది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో పోర్చుగల్‌కు మరింత కఠిన సవాలు ఎదురుకానుంది. 2010 ప్రపంచకప్‌ విజేత, యువ ఆటగాళ్లతో జోరుమీదున్న స్పెయిన్‌ జట్టుతో పోర్చుగల్‌ జట్టు క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ కోసం పోరాడనుంది. 

2018 ప్రపంచకప్‌ రన్నరప్‌... 2022 ప్రపంచకప్‌లో మూడో స్థానం పొందిన క్రొయేషియా జట్టు ఈసారి నాకౌట్‌ దశ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. కెరీర్‌లో చివరి ప్రపంచకప్‌ ఆడుతున్న క్రొయేషియా కెప్టెన్, స్టార్‌ ప్లేయర్‌ 40 ఏళ్ల లుకా మోడ్రిచ్‌కు ఈసారి మెగా ఈవెంట్‌ నిరాశ మిగిల్చింది. పోర్చుగల్‌తో ఆద్యంతం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో క్రొయేషియాకు అదృష్టం కలిసి రాలేదు. మరోవైపు పోర్చుగల్‌ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందంజ వేసింది. తొలి అర్ధభాగంలో రెండు జట్లు ఖాతా తెరువలేదు. 

రెండో అర్ధభాగంలోని 53వ నిమిషంలో ఇవాన్‌ పెరిసిచ్‌ గోల్‌తో క్రొయేషియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాసేపటికి రొనాల్డో గోల్‌ చేసినా రిఫరీ దానిని ఆఫ్‌సైడ్‌గా ప్రకటించి గోల్‌ ఇవ్వలేదు. అయితే 68వ నిమిషంలో తమకు లభించిన పెనాల్టీ కిక్‌ను రొనాల్డో గోల్‌గా మలిచి స్కోరును 1–1తో సమం చేశాడు. అంతేకాకుండా ప్రపంచకప్‌ చరిత్రలో నాకౌట్‌ మ్యాచ్‌లో గోల్‌ చేసిన అతిపెద్ద వయసు్కడిగా రొనాల్డో (41 ఏళ్ల 147 రోజులు) రికార్డు సృష్టించాడు. 80వ నిమిషంలో పీటర్‌ సుచిచ్‌ గోల్‌ చేయగా... రిఫరీ దీనిని కూడా ఆఫ్‌సైడ్‌గా ప్రకటించారు. నిర్ణీత 90 నిమిషాలు ముగిశాక స్టాపేజ్‌ సమయంగా 10 నిమిషాలు జోడించారు. 

90+4వ నిమిషంలో రాఫెల్‌ లియో క్రాస్‌ పాస్‌ షాట్‌ను ‘డి’ ఏరియాలో అందుకున్న సబ్‌స్టిట్యూట్‌ గొన్సాలో రామోస్‌ లక్ష్యానికి చేర్చడంతో పోర్చుగల్‌ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదనపు సమయంలోని చివరి సెకన్లలో క్రొయేషియా ప్లేయర్‌ గ్వార్డియోల్‌ గోల్‌ చేయడంతో స్కోరు 2–2తో సమమైందని భావించారు. అయితే రిఫరీ ఆఫ్‌సైడ్‌గా ప్రకటించడంతో గోల్‌ ఇవ్వలేదు. 

రెండున్నర నిమిషాలపాటు వీడియో రీప్లే పరిశీలించాక... క్రొయేషియా ప్లేయర్‌ ఇవాన్‌ పెరిసిచ్‌ కొట్టిన షాట్‌... ‘డి’ ఏరియాలో ఇగోర్‌ మాంటానోవిచ్‌ తల వెంట్రుకలకు బంతి తగులుతూ వెళ్లిందని.. ఆ సమయానికి అక్కడే పోర్చుగల్‌ డిఫెండర్‌కంటే క్రొయేషియా మరో ప్లేయర్‌ పాలాసిచ్‌ ముందున్నట్లు కనిపించింది.  దాంతో రిఫరీ దీనిని ఆఫ్‌సైడ్‌గా ప్రకటించారు. ఈ సంఘటన తర్వాత మరో ఆరు నిమిషాలు క్రొయేషియాను నిలువరించి పోర్చుగల్‌ జట్టు విజయాన్ని ఖరారు చేసుకుంది. రిఫరీ నిర్ణయంపై క్రొయేషియా అభిమానులు వాటర్‌ బాటిళ్లను మైదానంలోకి విసిరేసి తమ నిరసన వ్యక్తం చేశారు. 

88 ఏళ్ల తర్వాత.. 
వాంకూవర్‌: అల్జీరియాతో జరిగిన మరో నాకౌట్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌ 2–0తో  గెలిచింది. 88 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో నాకౌట్‌ దశ మ్యాచ్‌లో గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. స్విట్జర్లాండ్‌ తరఫున బ్రీల్‌ ఎంబోలో (10వ నిమిషంలో), డాన్‌ ఎండోయో (46వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. కొలంబియా, ఘనా మ్యాచ్‌ విజేతతో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో స్విట్జర్లాండ్‌ తలపడుతుంది.  

స్పెయిన్‌ జోరు... 
లాస్‌ ఏంజెలిస్‌లో జరిగిన మరో నాకౌట్‌ మ్యాచ్‌లో స్పెయిన్‌ 3–0తో ఆ్రస్టియాపై నెగ్గి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. స్పెయిన్‌ తరఫున మికెల్‌ ఒయర్‌జబాల్‌ (36వ, 89వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చేయగా.. పెడ్రో పోర్పో (66వ నిమిషంలో) ఒక గోల్‌ సాధించాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement