breaking news
Croatia team
-
పోర్చు‘గోల్’ ఇంకా ఉంది
టొరంటో: చివరి ప్రయత్నంలోనైనా ప్రపంచకప్ ట్రోఫీని అందుకోవాలనే లక్ష్యంతో బరిలోకి పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఈ మెగా ఈవెంట్లో నిలిచాడు. తాడో పేడో తేల్చుకునే నాకౌట్ దశ మ్యాచ్‌లో క్లిష్టమైన ప్రత్యర్థి క్రొయేషియా జట్టుపై రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ జట్టు 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. ఈ విజయంతో పోర్చుగల్ ప్రపంచకప్‌లో ఆరోసారి ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు చేరుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్‌కు మరింత కఠిన సవాలు ఎదురుకానుంది. 2010 ప్రపంచకప్ విజేత, యువ ఆటగాళ్లతో జోరుమీదున్న స్పెయిన్ జట్టుతో పోర్చుగల్ జట్టు క్వార్టర్ ఫైనల్ బెర్త్ కోసం పోరాడనుంది. 2018 ప్రపంచకప్ రన్నరప్... 2022 ప్రపంచకప్‌లో మూడో స్థానం పొందిన క్రొయేషియా జట్టు ఈసారి నాకౌట్ దశ తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. కెరీర్లో చివరి ప్రపంచకప్ ఆడుతున్న క్రొయేషియా కెప్టెన్, స్టార్ ప్లేయర్ 40 ఏళ్ల లుకా మోడ్రిచ్‌కు ఈసారి మెగా ఈవెంట్ నిరాశ మిగిల్చింది. పోర్చుగల్‌తో ఆద్యంతం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో క్రొయేషియాకు అదృష్టం కలిసి రాలేదు. మరోవైపు పోర్చుగల్ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందంజ వేసింది. తొలి అర్ధభాగంలో రెండు జట్లు ఖాతా తెరువలేదు. రెండో అర్ధభాగంలోని 53వ నిమిషంలో ఇవాన్ పెరిసిచ్ గోల్‌తో క్రొయేషియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాసేపటికి రొనాల్డో గోల్ చేసినా రిఫరీ దానిని ఆఫ్‌సైడ్‌గా ప్రకటించి గోల్ ఇవ్వలేదు. అయితే 68వ నిమిషంలో తమకు లభించిన పెనాల్టీ కిక్‌ను రొనాల్డో గోల్‌గా మలిచి స్కోరును 1–1తో సమం చేశాడు. అంతేకాకుండా ప్రపంచకప్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్‌లో గోల్ చేసిన అతిపెద్ద వయసు్కడిగా రొనాల్డో (41 ఏళ్ల 147 రోజులు) రికార్డు సృష్టించాడు. 80వ నిమిషంలో పీటర్ సుచిచ్ గోల్ చేయగా... రిఫరీ దీనిని కూడా ఆఫ్‌సైడ్‌గా ప్రకటించారు. నిర్ణీత 90 నిమిషాలు ముగిశాక స్టాపేజ్ సమయంగా 10 నిమిషాలు జోడించారు. 90+4వ నిమిషంలో రాఫెల్ లియో క్రాస్ పాస్ షాట్‌ను ‘డి’ ఏరియాలో అందుకున్న సబ్‌స్టిట్యూట్ గొన్సాలో రామోస్ లక్ష్యానికి చేర్చడంతో పోర్చుగల్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదనపు సమయంలోని చివరి సెకన్లలో క్రొయేషియా ప్లేయర్ గ్వార్డియోల్ గోల్ చేయడంతో స్కోరు 2–2తో సమమైందని భావించారు. అయితే రిఫరీ ఆఫ్‌సైడ్‌గా ప్రకటించడంతో గోల్ ఇవ్వలేదు. రెండున్నర నిమిషాలపాటు వీడియో రీప్లే పరిశీలించాక... క్రొయేషియా ప్లేయర్ ఇవాన్ పెరిసిచ్ కొట్టిన షాట్... ‘డి’ ఏరియాలో ఇగోర్ మాంటానోవిచ్ తల వెంట్రుకలకు బంతి తగులుతూ వెళ్లిందని.. ఆ సమయానికి అక్కడే పోర్చుగల్ డిఫెండర్కంటే క్రొయేషియా మరో ప్లేయర్ పాలాసిచ్ ముందున్నట్లు కనిపించింది. దాంతో రిఫరీ దీనిని ఆఫ్‌సైడ్‌గా ప్రకటించారు. ఈ సంఘటన తర్వాత మరో ఆరు నిమిషాలు క్రొయేషియాను నిలువరించి పోర్చుగల్ జట్టు విజయాన్ని ఖరారు చేసుకుంది. రిఫరీ నిర్ణయంపై క్రొయేషియా అభిమానులు వాటర్ బాటిళ్లను మైదానంలోకి విసిరేసి తమ నిరసన వ్యక్తం చేశారు. 88 ఏళ్ల తర్వాత.. వాంకూవర్: అల్జీరియాతో జరిగిన మరో నాకౌట్ తొలి రౌండ్ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ 2–0తో గెలిచింది. 88 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో నాకౌట్ దశ మ్యాచ్‌లో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. స్విట్జర్లాండ్ తరఫున బ్రీల్ ఎంబోలో (10వ నిమిషంలో), డాన్ ఎండోయో (46వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. కొలంబియా, ఘనా మ్యాచ్ విజేతతో ప్రిక్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్ తలపడుతుంది. స్పెయిన్ జోరు... లాస్ ఏంజెలిస్‌లో జరిగిన మరో నాకౌట్ మ్యాచ్‌లో స్పెయిన్ 3–0తో ఆ్రస్టియాపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. స్పెయిన్ తరఫున మికెల్ ఒయర్జబాల్ (36వ, 89వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా.. పెడ్రో పోర్పో (66వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. -
కొలంబియా ముందుకు...
గ్వాడలహారా (మెక్సికో): ప్రత్యర్థి జట్టును తక్కువ అంచనా వేయకుండా ఆడిన కొలంబియా జట్టు ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో వరుసగా రెండో విజయం సాధించింది. గ్రూప్ ‘కె’లో భాగంగా కాంగో జట్టుతో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో కొలంబియా 1–0 గోల్ తేడాతో గెలిచింది. 76వ నిమిషంలో డేనియల్ మునోజ్ ఏకైక గోల్ చేసి కొలంబియా జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో కొలంబియా నాకౌట్ దశకు అర్హత సాధించింది. క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పటిష్టమైన పోర్చుగల్ జట్టును తొలి మ్యాచ్‌లో 1–1తో నిలువరించిన కాంగో జట్టు ఈ మ్యాచ్‌లోనూ కొలంబియాకు గట్టిపోటీ ఇచ్చింది. తొలి 20 నిమిషాల్లో కొలంబియా ఐదుసార్లు గోల్ చేసేందుకు అవకాశాలు సృష్టించుకున్నా కాంగో గోల్‌కీపర్ లియోనెల్ ఎంపాసి అడ్డుగోడలా నిలబడ్డాడు. ఎట్టకేలకు 76వ నిమిషంలో కొలంబియా ఖాతా తెరిచింది. యువాన్ క్వింటెరో అందించిన పాస్‌ను ‘డి’ ఏరియాలో అడ్డుకోవడంలో కాంగో డిఫెండర్లు విఫలమయ్యారు. అక్కడే ఉన్న మునోజ్ కాంగో గోల్‌కీపర్‌కు అవకాశం ఇవ్వకుండా బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. 52 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో మళ్లీ ఆడుతున్న కాంగో జట్టుకు ఈ ఓటమితో నాకౌట్ దశ చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఘనా 0–0 ఇంగ్లండ్ బోస్టన్: గత నాలుగు ప్రపంచకప్‌లలో ఘనా జట్టు తమ రెండో లీగ్ మ్యాచ్‌లో ఓడిపోలేదు. అదే రికార్డును ఐదో ప్రపంచకప్‌లోనూ కొనసాగించింది. గ్రూప్ ‘ఎల్’లో భాగంగా మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌ను ఘనా 0–0తో ‘డ్రా’గా ముగించింది. ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్‌తో సహా ఇతర ఆటగాళ్లు 19 సార్లు ఘనా గోల్‌పోస్ట్ లక్ష్యంగా షాట్లు సంధించినా గోల్ మాత్రం చేయలేకపోయారు. మరోవైపు ఘనా జట్టు రక్షణాత్మక ఆటతీరుకే ప్రాధాన్యం ఇచ్చింది. ఆ జట్టు రెండుసార్లు మాత్రమే ఇంగ్లండ్ గోల్‌పోస్ట్‌పై దాడులు చేసింది. తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4–2తో క్రొయేషియాపై, ఘనా 1–0తో పనామాపై గెలిచాయి. ప్రస్తుతం ఇంగ్లండ్, ఘనా జట్లు నాలుగు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి.గెలిచి నిలిచిన క్రొయేషియాటొరంటో: గత రెండు ప్రపంచకప్‌లలో సెమీఫైనల్ చేరిన క్రొయేషియా జట్టు ఖాతాలో తొలి విజయం చేరింది. గ్రూప్ ‘ఎల్’లో భాగంగా పనామా జట్టుతో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో క్రొయేషియా 1–0 గోల్ తేడాతో గెలిచింది. ఆట 54వ నిమిషంలో కుడి వైపు నుంచి జోసిప్ స్టానిసిక్ అందించిన క్రాస్ పాస్‌ను ‘డి’ ఏరియా లోపల యాంటె బుడిమిర్ లక్ష్యానికి చేర్చాడు. ఈ విజయంతో క్రొయేషియా మూడు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. నాకౌట్ చేరే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. -
అంతర్జాతీయ టీ20లలో సరికొత్త ప్రపంచ రికార్డు
అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. క్రొయేషియా ఆల్‌రౌండర్ కనోర్ కరోల్ పేరు పొట్టి క్రికెట్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఆడిన తొలి మూడు అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా 23 ఏళ్ల కరోల్ నిలిచాడు.అరంగేట్రంలోనే మెరుపులు..టీ20 ప్రపంచకప్-2028 రీజినల్ యూరోప్ క్వాలిఫయర్-‘ఎ’లో భాగంగా కనోర్ కరోల్ (Connor Carroll).. ఫ్రాన్స్‌తో మ్యాచ్ సందర్భంగా క్రొయేషియా తరఫున అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 34 బంతుల్లో 71 పరుగులతో దుమ్ములేపాడు. అయితే, ఈ మ్యాచ్‌లో క్రొయేషియా ఓడిపోయింది.విధ్వంసకర భారీ శతకంఇక తన రెండో మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌పై కరోల్ ఆకాశమే హద్దుగా చెలరేగి... భారీ శతకం సాధించాడు. కేవలం 72 బంతుల్లోనే 150 పరుగులు రాబట్టాడు. ఇందులో 10 సిక్సర్లు, 13 ఫోర్లు ఉన్నాయి. కరోల్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా క్రొయేషియా 199 పరుగులు చేయగలిగింది.లక్ష్య ఛేదనకు దిగిన స్విట్జర్లాండ్ క్రొయేషియా చేతిలో 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆఫ్ స్పిన్నర్ అయిన కరోల్ ఈ మ్యాచ్ సందర్భంగా తన తొలి అంతర్జాతీయ వికెట్ కూడా తీశాడు. తాజాగా తన మూడో మ్యాచ్‌లో భాగంగా జెర్సీ జట్టుపై 31 బంతుల్లో 74 పరుగులు సాధించాడు.ప్రపంచ రికార్డుకానీ జెర్సీ (ఐలాండ్) విధించిన 280 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో క్రొయేషియా విఫలమైంది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా కరోల్ మాత్రం ప్రపంచ రికార్డు సాధించాడు. ఆడిన తొలి మూడు అంతర్జాతీయ టీ20లలో కలిపి అత్యధికంగా 295 పరుగులు (సగటు 147.50, స్ట్రైక్‌రేటు 215.32) రాబట్టిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.అంతకు ముందు ఈ రికార్డు ఫ్రాన్స్‌కు చెందిన గుస్తవ్ మెకాన్ పేరిట ఉండేది. అతడు తన దేశం తరఫున తొలి మూడు టీ20లలో కలిపి 286 పరుగులు సాధించాడు. తాజాగా కనోర్ కరోల్ గుస్తవ్ను అధిగమించాడు. చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు -
ఐదో ప్రపంచకప్ ఆడనున్న మోడ్రిచ్
జాగ్రెబ్: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో పాల్గొనే క్రొయేషియా జట్టును ప్రకటించారు. 40 ఏళ్ల లుకా మోడ్రిచ్ ఐదోసారి ప్రపంచకప్‌లో ఆడనున్నాడు. 2006లో అరంగేట్రం చేసిన మోడ్రిచ్ ఆ తర్వాత 2014, 2018, 2022 ప్రపంచకప్ టోర్నిల్లో క్రొయేషియా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2018లో మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలను వెనక్కి నెట్టి ప్రతిష్టాత్మక ‘బాలన్ డోర్’ అవార్డు అందుకున్న మోడ్రిచ్ 196 మ్యాచ్‌ల్లో క్రొయేషియా తరఫున ఆడాడు. వచ్చే నెలలో అమెరికా, మెక్సికో, కెనడా ఆతిథ్యమివ్వనున్న ప్రపంచకప్‌లో మిడ్‌ఫీల్డర్ మోడ్రిచ్ 200 మైలురాయిని దాటే అవకాశముంది. అంటోనియో కర్బాజాల్ (మెక్సికో), ఆండ్రెస్ గార్డాడో (మెక్సికో), లోథర్ మథియాస్ (జర్మనీ), రాఫెల్ మార్కెజ్ (మెక్సికో), గియాన్లుగి బఫన్ (ఇటలీ), యుటో నాగటోమో (జపాన్), గిలెర్మో ఒచావా (మెక్సికో), మెస్సీ (అర్జెంటీనా), క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్) ఇప్పటికే ఐదు ప్రపంచకప్ టోర్నీలు ఆడారు. మెస్సీ, రొనాల్డో తాజాగా ఆరోసారి ప్రపంచకప్‌లో పోటీపడనున్నారు. 2018 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా, 2022 ప్రపంచకప్‌లో మూడో స్థానాన్ని సంపాదించింది. క్రొయేషియా ఫుట్‌బాల్ జట్టు: లివాకోవిచ్, కొటార్స్కీ, ఇవోర్ పాండుర్ (గోల్‌కీపర్లు), గ్వార్డియోల్, కాలెటకార్, సుటాలో, స్టానిసిక్, పొన్గ్రాసిక్, ఎర్లిక్, వుస్కోవిచ్ (డిఫెండర్లు), లుకా మోడ్రిచ్, కొవాసిచ్, పాసాలిచ్, వ్లాసిక్, లుకా సుసిక్, బటురినా, జాకిక్, పీటర్ సుసిక్, నికోలా మోరో, టోనీ ఫ్రుక్ (మిడ్‌ఫీల్డర్లు), పెరిసిచ్, క్రామారిచ్, బుడిమిర్, పాసాలిచ్, పీటర్ మూసా, మటానోవిచ్ (ఫార్వర్డ్స్). -
క్రొయేషియా ఏడోసారి...
రిజెకా: పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ ఆరో విజయం సాధించిన క్రొయేషియా జట్టు... వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు అర్హత పొందింది. యూరోపియన్ క్వాలిఫయింగ్‌లో భాగంగా గ్రూప్ ‘ఎల్’లో ఫారో ఐలాండ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో క్రొయేషియా 3–1 గోల్స్ తేడాతో గెలిచింది. క్రొయేషియా తరఫున గ్వార్డియోల్ (23వ నిమిషంలో), మూసా (57వ నిమిషంలో), వ్లాసిక్ (70వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... ఫారో ఐలాండ్స్ జట్టుకు టూరి (16వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. ఐదు జట్లన్న గ్రూప్ ‘ఎల్’లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న క్రొయేషియా ఆరు విజయాలు నమోదు చేసి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది. 19 పాయింట్లతో గ్రూప్ విజేతగా అవతరించింది. 13 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న చెక్ రిపబ్లిక్ జట్టు ప్లే ఆఫ్ మ్యాచ్‌కు అర్హత సాధించింది. 1998లో తొలిసారి ప్రపంచకప్ టోషిర్నీలో ఆడిన క్రొయేషియా మూడో స్థానం సాధించి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 2002, 2006 ప్రపంచకప్‌లలో గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టింది. 2010 ప్రపంచకప్ టోషిర్నీకి అర్హత పొందడంలో విఫలమైన క్రొయేషియా 2014లో గ్రూప్ దశలో ని్రష్కమించింది. 2018 ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా, 2022 ప్రపంచకప్‌లో మూడో స్థానాన్ని సంపాదించింది. ఇప్పటికి 30 జట్లు... అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు ఉమ్మడిగా నిర్వహించే 2026 ప్రపంచకప్ టోర్నీలో తొలిసారి 48 దేశాలు పోటీపడతాయి. ఆతిథ్య దేశాల హోదాలో అమెరికా, మెక్సికో, కెనడా జట్లు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడకుండానే నేరుగా అర్హత పొందాయి. ఇప్పటి వరకు మొత్తం 30 జట్లు ప్రపంచకప్ టోర్నీ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. ఆఫ్రికా నుంచి అల్జీరియా, కెపె వెర్డె, ఈజిప్‌్ట, ఘనా, ఐవరీ కోస్ట్, మొరాకో సెనెగల్, దక్షిణాఫ్రికా, ట్యూనిషియా... ఆసియా నుంచి ఆ్రస్టేలియా, ఇరాన్, జపాన్, జోర్డాన్, ఖతర్, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, ఉజ్బెకిస్తాన్... యూరోప్ నుంచి ఇంగ్లండ్, ఫ్రాన్స్, క్రొయేషియా... ఓసియానియా నుంచి న్యూజిలాండ్... దక్షిణ అమెరికా నుంచి అర్జెంటీనా, బ్రెజిల్, కొలంబియా, ఈక్వెడార్, పరాగ్వే, ఉరుగ్వే దేశాలు అర్హత సాధించాయి. -
FIFA WC: బ్రెజిల్ గుండె పగిలింది
పెనాల్టీ షూటౌట్... అప్పటికే బ్రెజిల్ 2–4తో వెనుకబడి ఉంది. నాలుగు ప్రయత్నాల్లోనూ క్రొయేషియా స్కోరు చేయగా, బ్రెజిల్ రెండు సార్లే సఫలమైంది. ఇలాంటి సమయంలో మార్కినోస్ పెనాల్టీ తీసుకున్నాడు. స్టేడియం మొత్తం ఉత్కంఠ, ఈ షాట్ సరిగా పడకపోతే... ఏం జరుగుతుందో అతనికి బాగా తెలుసు... గోల్‌పోస్ట్ కుడి వైపు గురి పెడుతూ మార్కినోస్ కిక్ కొట్టాడు. క్రొయేషియా గోల్ కీపర్ లివకోవిచ్ ఎడమ వైపు దూకాడు... దాంతో బంతి లక్ష్యం చేరినట్లే అనిపించింది. కానీ నేరుగా గోల్ పోస్ట్‌కు తాకి వెనక్కి వచ్చింది ! అంతే...మార్కినోస్ కుప్పకూలిపోగా, బ్రెజిల్ ఆటగాళ్లంతా అచేతనంగా ఉండిపోయారు. మరోసారి హీరోగా మారిన లివకోవిచ్ను చుట్టుముట్టి క్రొయేషియా సంబరాల్లో మునిగిపోగా, స్టేడియంలో బ్రెజిల్ అభిమానుల గుండె పగిలింది. విషాదంతో నిండిపోయిన ‘సాంబా’ బృందం కన్నీళ్లపర్యంతమైంది. ఐదుసార్లు విజేత, టైటిల్ ఫేవరెట్ బ్రెజిల్ ప్రస్థానం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. వరుసగా ఐదో వరల్డ్ కప్‌లో రిక్త హస్తాలకే పరిమితమైన తమ జట్టు పరిస్థితిపై ఫ్యాన్స్ వేదన చూసి సగటు ఫుట్‌బాల్ అభిమానీ అయ్యో అంటూ బాధపడిపోయాడు! దోహా: వరల్డ్‌కప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు బ్రెజిల్ మరోసారి టైటిల్‌కు బహు దూరంలో నిలిచిపోయింది. గెలుపు అవకాశాలు సృష్టించుకున్నా, చివర్లో తడబాటుకు లోనై ఆపై షూటౌట్లో నిష్క్రమించింది. అవును...ఫిఫా వరల్డ్ కప్‌లో బ్రెజిల్ ఆట క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చిన గత ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియా పెనాల్టీలతో బ్రెజిల్‌ను మట్టికరిపించింది. నిర్ణీత సమయంతో పాటు అదనపు సమయం కలిపిన తర్వాత ఇరు జట్టు ఒక్కో గోల్ చేసి 1–1తో సమంగా నిలిచాయి. దాంతో షూటౌట్ అనివార్యమైంది. ఇందులో 4–2 తేడాతో నెగ్గిన క్రొయేషియా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. బ్రెజిల్ తరఫున నెమార్ (105+1వ నిమిషంలో) గోల్ కొట్టగా, క్రొయేషియా ఆటగాడు బ్రూనో పెట్కోవిచ్ (117వ నిమిషం)లో స్కోరు సమం చేశాడు. హోరాహోరీగా... తొలి అర్ధభాగంలో ఇరు జట్లు బంతిపై పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. బ్రెజిల్ కొంత దూకుడు కనబర్చినా, క్రొయేషియా పదునైన డిఫెన్స్‌తో నిలువరించగలిగింది. ముఖ్యంగా బ్రెజిల్ ప్లేయర్లు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ప్రత్యర్థి తలవంచలేదు. మిడ్‌ఫీల్డర్లు బ్రొజోవిచ్, కొవాసిచ్, మోడ్రిచ్ అద్భుత ఆటతో బ్రెజిల్‌కు అవకాశం ఇవ్వకుండా వ్యూహాన్ని సమర్థంగా అమలు చేశారు. కీపర్ లివకోవిచ్ కూడా కీలక పాత్ర పోషించాడు. వినిసియస్ కొట్టిన షాట్‌ను అతను సమర్థంగా ఆపగలిగాడు. నెమార్ కూడా చురుగ్గా కదల్లేకపోవడం బ్రెజిల్‌కు ప్రతికూలంగా మారింది. రెండో అర్ధభాగంలో మాత్రం పరిస్థితి మారింది. నెమార్ కూడా లయ అందుకోగా రిచార్లీసన్ కూడా జత కలిశాడు. అయితే 55వ నిమిషంలో రిచార్లీసన్ చేసిన ప్రయత్నాన్ని, 66వ నిమిషంలో పక్వెటా సృష్టించిన అవకాశంతో పాటు 76వ నిమిషంలో నెమార్ కొట్టిన కిక్‌ను కూడా లివకోవిచ్ నిర్వీర్యం చేయడం విశేషం. 90 నిమిషాల ఆటలో స్కోరు నమోదు కాకపోగా, ఆట అదనపు సమయానికి చేరింది. ఇందులో నెమార్ అద్భుత గోల్ బ్రెజిల్‌ను ముందంజలో నిలిపింది. క్రొయేషియా డిఫెన్స్‌ను ఛేదించి దూసుకుపోయిన అతను గోల్ కీపర్ తప్పించడంలో సఫలం కావడంతో అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకాయి. కెరీర్లో 77వ గోల్‌తో అతను పీలే రికార్డును సమం చేయడం విశేషం. అయితే క్రొయేషియా వెంటనే కోలుకుంది. మరో నాలుగు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా మోర్సిచ్ అందించిన పాస్‌ను సూపర్ కిక్‌తో గోల్‌గా మలచడంలో పెట్కోవిచ్ విజయం సాధించాడు. ఈ ఆసక్తికర సమరం తుది ఫలితం మాత్రం చివరకు షూటౌట్తోనే తేలింది. వరుసగా రెండో వరల్డ్‌కప్‌లోనూ బ్రెజిల్ క్వార్టర్ ఫైనల్లోనే ని్రష్కమించింది. -
ఈనాటికైనా తీరేనా... ఈ నిరీక్షణ?
ఇంగ్లండ్... మంచి జట్టనే ముద్రతో ఎన్నోసార్లు ప్రపంచ కప్ బరిలో దిగింది. కానీ 1966లో చాంపియన్‌గా నిలవడం, 1990లో సెమీస్ చేరడం తప్ప మిగతాదంతా సాదాసీదా ప్రదర్శనే. ఇప్పుడు సైతం భారీ అంచనాల్లేకుండానే వచ్చింది. అయితే, ఒక్కో మ్యాచ్ గట్టెక్కుతూ కప్‌నకు రెండు అడుగుల దూరంలో నిలిచింది. హ్యారీ కేన్లాంటి యువ సారథి ఆధ్వర్యంలో 52 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సువర్ణావకాశం ముందుంది. క్రొయేషియా... పెద్ద విశ్లేషణలు కూడా అవసరం లేని జట్టు. 1998లో అరంగేట్రంలోనే మూడో స్థానంలో నిలిచినా, తర్వాత కనీసం గ్రూప్ దశ దాటలేదు. ఈసారి మాత్రం లూకా మోడ్రిక్ సారథ్యంలో అసాధారణ పోరాటంతో ఆకట్టుకుంటోంది. లీగ్ దశలో అర్జెంటీనా లాంటి జట్టునే 3–0తో చిత్తుగా ఓడించింది. ప్రిక్వార్టర్స్, క్వార్టర్స్‌లో పెనాల్టీ షూటౌట్లను తట్టుకుని మరీ సెమీస్ గడప తొక్కింది. మరో రెండు అడుగులు దిగ్విజయంగా వేస్తే చాలు... పట్టుమని 40 లక్షల జనాభా అయినా లేని తమ చిన్న దేశం కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తుంది. ... బుధవారం అర్ధరాత్రి జరిగే రెండో సెమీఫైనల్లో, చరిత్రకు చేరువలో ఉన్న ఈ రెండు జట్లలో ఏది నెగ్గుతుందో చూద్దాం.! మాస్కో: ప్రస్తుత ప్రపంచకప్‌లో టాప్ గోల్ స్కోరర్, ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్ వయసు 24 ఏళ్లు. తమ జట్టు చివరిసారిగా ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఆడినపుడు అతడు పుట్టనే లేదు. కేన్ ఒక్కడే కాదు జట్టులోని 23 మందిలో 17 మంది ఆటగాళ్లు 1990 తర్వాత జన్మించినవారే. ఇప్పటికే ఇంగ్లండ్‌ను సెమీస్ చేర్చి తమ ప్రత్యేకత చాటుకుందీ నవతరం. సంచలనాల క్రొయేషియాతో బుధవారం జరిగే సెమీఫైనల్లో నెగ్గితే చరిత్ర సృష్టించే అవకాశం ముంగిట నిలుస్తుంది. మరోవైపు ఆఖరి క్షణం వరకు పోరాడుతున్న క్రొయేషియాకూ ఇదో మహదవకాశమే. లీగ్ దశలో అజేయంగా నిలిచి... ‘పెనాల్టీ నాకౌట్’లను తట్టుకుని 20 ఏళ్ల తర్వాత సెమీఫైనల్లో అడుగిడిందీ జట్టు. ఈ నేపథ్యంలో విజయం కోసం ఇరు పక్షాల మధ్య హోరాహోరీ సమరం ఖాయంగా కనిపిస్తోంది. ఆ ‘హరికేన్’ను నిలువరిస్తేనే... ఓ పద్ధతి ప్రకారం ప్రత్యర్థుల శిబిరంలోకి చొచ్చుకెళ్లి గోల్స్ చేస్తూ మ్యాచ్‌లను గెలుస్తోంది ఇంగ్లండ్. చివరి లీగ్ మ్యాచ్‌లో బెల్జియంపై పరాజయం, ప్రిక్వార్టర్స్‌లో కొలంబియాపై పెనాల్టీ షూటౌట్లో నెగ్గినా, క్వార్టర్స్‌లో స్వీడన్‌ను తేలిగ్గా ఓడించింది. దాడులను ముందుండి నడిపిస్తున్న కెప్టెన్ హ్యారీ కేన్ జట్టుకు పెద్ద బలం. ఇతడికి లిన్‌గార్డ్, డెలె అల్లీ తోడైతే ప్రత్యర్థికి ఇబ్బందులు తప్పవు. అయితే, ఇప్పటివరకు ఇంగ్లండ్ ప్రత్యర్థికి కనీసం ఒక గోల్ అయినా ఇస్తూ వస్తోంది. కొలంబియాతో మ్యాచ్‌లో కేన్ ఆధిక్యం సాధించి పెట్టినా, చివరి క్షణాల్లో ఆధిక్యం చేజార్చుకుని ఇబ్బంది పడింది. క్రొయేషియాకు ఇదే విధంగా అవకా శం ఇస్తే కోలుకోవడం కష్టమవుతుంది. కేన్‌ను ప్రత్యర్థులు నిలువరిస్తే... లిన్‌గార్డ్, మగ్యురె, అల్లీ బాధ్య తలు తీసుకోవాల్సి ఉంటుంది. వారిద్దరితోనే ప్రమాదం... సాకర్ సమరంలో క్రొయేషియా ఇక్కడి వరకు వచ్చిందంటే కెప్టెన్ లూకా మోడ్రిక్, ఇవాన్ రాకిటిక్ల అసాధారణ ఆటే కారణం. ముఖ్యంగా మోడ్రిక్ దూకుడుకు అర్జెంటీనానే బెంబేలెత్తింది. ఇతడికి రాకిటిక్ నుంచి చక్కని సహకారం అందుతోంది. అటాకింగ్ మిడ్ ఫీల్డర్లయిన వీరు అద్భుత సమన్వయంతో గోల్స్ చేయడంతో పాటు స్ట్రయికర్ల పనిని సులువు చేస్తున్నారు. దీంతో జట్టుకు అదనపు బలం చేకూరుతోంది. వరుసగా రెండో పెనాల్టీ షూటౌట్లోనూ నెగ్గిన జట్టు తమ పోరాటతత్వం ఏ స్థాయిలో ఉందో చాటింది. అయితే తీవ్ర ఒత్తిడిలో ఆటగాళ్లు మానసికంగా అలసిపోయి సెమీస్‌లో ఇదే ప్రతిబంధకంగా మారే ప్రమాదం కూడా ఉంది. సెమీస్ చేరాయిలా... క్రొయేషియా నైజీరియాపై 2–0తో గెలుపు అర్జెంటీనాపై 3–0తో విజయం ఐస్లాండ్పై 2–1తో గెలుపు ప్రిక్వార్టర్స్‌లో డెన్మార్క్‌పై షూటౌట్లో 3–2తో గెలుపు క్వార్టర్స్‌లో రష్యాపై షూటౌట్లో 4–3తో గెలుపు ఇంగ్లండ్ ట్యునీషియాపై 2–1తో గెలుపు పనామాపై 6–1తో విజయం బెల్జియం చేతిలో 0–1తో పరాజయం ప్రిక్వార్టర్స్‌లో కొలంబియాపై షూటౌట్లో 4–3తో గెలుపు క్వార్టర్స్‌లో 2–0తో స్వీడన్‌పై జయభేరి -
క్రొయేషియా ‘నగ్న’ ప్రదర్శన!
‘ఫిఫా’ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ ఓడిన వేదనలో ఉన్న క్రొయేషియా జట్టుకు మీడియా మరో షాక్ ఇచ్చింది. ఆ జట్టు ఆటగాళ్లు నగ్నంగా ఉన్న ఫొటోలను బహిర్గతపరచింది. వివరాల్లోకెళితే...టీమ్ హోటల్ ఉన్న పూల్‌లో ఆటగాళ్లు సరదాగా స్విమ్మింగ్‌కు దిగారు. అయితే వారంతా పూర్తి నగ్నంగా జలకాలాటలకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో సమీపంలో ఉన్న చిన్న పొదల్లో దాక్కున్న కొంత మంది ఫొటోగ్రాఫర్లు క్లిక్‌మనిపించారు. అంతటితో ఆగకుండా వాటిని లీక్ చేసి ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆ ‘చిత్రాన్ని’ చూపించారు. ఈ ఫోటోల్లో క్రొయేషియా ఫుట్‌బాలర్లు లోవ్రెన్, కార్లుకా స్పష్టంగా కనిపిస్తున్నారు. తాజా పరిణామంపై ఆటగాళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా వైఖరికి నిరసనగా విలేకరుల సమావేశాన్ని బహిష్కరించారు. ఇకపై మీడియాతో మాట్లాడబోమంటూ గట్టిగా చెప్పేశారు. ‘మీ నగ్న చిత్రాలు ఎవరైనా తీస్తే ఎలా ఉంటుంది. నేను నా ఆటగాళ్ల అభిప్రాయాన్ని గౌరవిస్తాను. ఇకపై వారు మీడియాతో మాట్లాడరు’ అని జట్టు కోచ్ నికో కొవాక్ స్పష్టం చేశారు. క్రొయేషియా బుధవారం జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో కామెరూన్‌తో తలపడుతుంది.


