క్రొయేషియా ‘నగ్న’ ప్రదర్శన! | World Cup Team's Naked Protest | Sakshi
Sakshi News home page

క్రొయేషియా ‘నగ్న’ ప్రదర్శన!

Jun 17 2014 1:16 AM | Updated on Oct 22 2018 5:58 PM

క్రొయేషియా ‘నగ్న’ ప్రదర్శన! - Sakshi

క్రొయేషియా ‘నగ్న’ ప్రదర్శన!

‘ఫిఫా’ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ ఓడిన వేదనలో ఉన్న క్రొయేషియా జట్టుకు మీడియా మరో షాక్ ఇచ్చింది.

‘ఫిఫా’ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ ఓడిన వేదనలో ఉన్న క్రొయేషియా జట్టుకు మీడియా మరో షాక్ ఇచ్చింది. ఆ జట్టు ఆటగాళ్లు నగ్నంగా ఉన్న ఫొటోలను బహిర్గతపరచింది. వివరాల్లోకెళితే...టీమ్ హోటల్ ఉన్న పూల్‌లో ఆటగాళ్లు సరదాగా స్విమ్మింగ్‌కు దిగారు. అయితే వారంతా పూర్తి నగ్నంగా జలకాలాటలకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో సమీపంలో ఉన్న చిన్న పొదల్లో దాక్కున్న కొంత మంది ఫొటోగ్రాఫర్లు క్లిక్‌మనిపించారు. అంతటితో ఆగకుండా వాటిని లీక్ చేసి ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆ ‘చిత్రాన్ని’ చూపించారు.

ఈ ఫోటోల్లో క్రొయేషియా ఫుట్‌బాలర్లు లోవ్‌రెన్, కార్లుకా స్పష్టంగా కనిపిస్తున్నారు. తాజా పరిణామంపై ఆటగాళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా వైఖరికి నిరసనగా విలేకరుల సమావేశాన్ని బహిష్కరించారు. ఇకపై మీడియాతో మాట్లాడబోమంటూ గట్టిగా చెప్పేశారు. ‘మీ నగ్న చిత్రాలు ఎవరైనా తీస్తే ఎలా ఉంటుంది. నేను నా ఆటగాళ్ల అభిప్రాయాన్ని గౌరవిస్తాను. ఇకపై వారు మీడియాతో మాట్లాడరు’ అని జట్టు కోచ్ నికో కొవాక్ స్పష్టం చేశారు. క్రొయేషియా బుధవారం జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో కామెరూన్‌తో తలపడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement