ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు అర్హత పొందిన మాజీ రన్నరప్ జట్టు
యూరోపియన్ క్వాలిఫయర్స్‌లో గ్రూప్ ‘ఎల్’ విజేత హోదాలో ముందంజ
రిజెకా: పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ ఆరో విజయం సాధించిన క్రొయేషియా జట్టు... వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు అర్హత పొందింది. యూరోపియన్ క్వాలిఫయింగ్‌లో భాగంగా గ్రూప్ ‘ఎల్’లో ఫారో ఐలాండ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో క్రొయేషియా 3–1 గోల్స్ తేడాతో గెలిచింది. క్రొయేషియా తరఫున గ్వార్డియోల్ (23వ నిమిషంలో), మూసా (57వ నిమిషంలో), వ్లాసిక్ (70వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... ఫారో ఐలాండ్స్ జట్టుకు టూరి (16వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు.
ఐదు జట్లన్న గ్రూప్ ‘ఎల్’లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న క్రొయేషియా ఆరు విజయాలు నమోదు చేసి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది. 19 పాయింట్లతో గ్రూప్ విజేతగా అవతరించింది. 13 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న చెక్ రిపబ్లిక్ జట్టు ప్లే ఆఫ్ మ్యాచ్‌కు అర్హత సాధించింది. 1998లో తొలిసారి ప్రపంచకప్ టోషిర్నీలో ఆడిన క్రొయేషియా మూడో స్థానం సాధించి సంచలనం సృష్టించింది.
ఆ తర్వాత 2002, 2006 ప్రపంచకప్‌లలో గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టింది. 2010 ప్రపంచకప్ టోషిర్నీకి అర్హత పొందడంలో విఫలమైన క్రొయేషియా 2014లో గ్రూప్ దశలో ని్రష్కమించింది. 2018 ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా, 2022 ప్రపంచకప్‌లో మూడో స్థానాన్ని సంపాదించింది.
ఇప్పటికి 30 జట్లు...
అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు ఉమ్మడిగా నిర్వహించే 2026 ప్రపంచకప్ టోర్నీలో తొలిసారి 48 దేశాలు పోటీపడతాయి. ఆతిథ్య దేశాల హోదాలో అమెరికా, మెక్సికో, కెనడా జట్లు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడకుండానే నేరుగా అర్హత పొందాయి. ఇప్పటి వరకు మొత్తం 30 జట్లు ప్రపంచకప్ టోర్నీ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి.
ఆఫ్రికా నుంచి అల్జీరియా, కెపె వెర్డె, ఈజిప్‌్ట, ఘనా, ఐవరీ కోస్ట్, మొరాకో సెనెగల్, దక్షిణాఫ్రికా, ట్యూనిషియా... ఆసియా నుంచి ఆ్రస్టేలియా, ఇరాన్, జపాన్, జోర్డాన్, ఖతర్, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, ఉజ్బెకిస్తాన్... యూరోప్ నుంచి ఇంగ్లండ్, ఫ్రాన్స్, క్రొయేషియా... ఓసియానియా నుంచి న్యూజిలాండ్... దక్షిణ అమెరికా నుంచి అర్జెంటీనా, బ్రెజిల్, కొలంబియా, ఈక్వెడార్, పరాగ్వే, ఉరుగ్వే దేశాలు అర్హత సాధించాయి.


