పెనాల్టీ షూటౌట్‌లో విజయం.. తొలిసారి ప్రిక్వార్ట‌ర్స్‌కు ఈజిప్ట్‌ | Egypt Wins Penalty Shootout Vs Australia Enters Round-16-1st-Time-FIFA | Sakshi
Sakshi News home page

పెనాల్టీ షూటౌట్‌లో విజయం.. తొలిసారి ప్రిక్వార్ట‌ర్స్‌కు ఈజిప్ట్‌

Jul 4 2026 4:37 AM | Updated on Jul 4 2026 5:30 AM

Egypt Wins Penalty Shootout Vs Australia Enters Round-16-1st-Time-FIFA

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో ఈజిప్ట్ ప్రిక్వార్ట‌ర్స్‌లో అడుగుపెట్టింది. రౌండ్ ఆఫ్ 32లో భాగంగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఈజిప్ట్ పెనాల్టీ షూటౌట్‌లో 4-2తో విజ‌యం సాధించింది. నిర్ణీత స‌మ‌యం ముగిసేలోగా ఇరుజ‌ట్లు 1-1తో స‌మంగా ఉండ‌డంతో మ్యాచ్ డ్రా అయింది. దీంతో మ్యాచ్‌లో విజేత‌ను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్య‌మైంది. ఫ‌లితంగా పెనాల్టీ షూటౌట్ ద్వారా ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. 

మ్యాచ్‌లో ఈజిప్ట్ త‌ర‌ఫున ఇమామ్ అశోర్ (13వ నిమిషం) గోల్ కొట్ట‌గా.. 55వ నిమిషంలో మొహ‌మ్మ‌ద్ హ‌నీ సెల్ఫ్‌ గోల్ కొట్ట‌డంతో అది ఆస్ట్రేలియా ఖాతాలోకి వెళ్లిపోయింది. ఎక్స్‌ట్రా టైమ్‌లోనూ ఇరుజ‌ట్లు మ‌రో గోల్‌కొట్ట‌డంలో విఫ‌ల‌మ‌య్యాయి. అయితే పెనాల్టీ షూటౌట్‌లో తొలి కిక్‌లో ఆస్ట్రేలియా త‌ర‌ఫున హారి సౌట్ట‌ర్ బంతిని కిక్ చేయ‌గా అది క్రాస్‌బార్‌ను తాకుతూ వెళ్లిపోయింది. ఈజిప్ట్ త‌ర‌ఫున మ‌హ్మూద్ సాబెర్ స్కోర్ చేశాడు. ఇక రెండో కిక్‌లో ఆస్ట్రేలియా త‌ర‌ఫున జాక్స‌న్ ఇర్విన్‌, ఈజిప్ట్ త‌ర‌ఫున రామి ర‌బియా స్కోర్ చేశారు. 

మూడో కిక్‌లో ఈజిప్ట్ త‌ర‌ఫున మ‌హ్మ‌ద్ సాలా, ఆసీస్ త‌ర‌ఫున అవ‌ర్ మాబిల్ స్కోర్ చేయ‌డంతో ఆధిక్యం 3-2కు త‌గ్గింది. కీల‌క‌మైన నాలుగో కిక్‌లో ఆస్ట్రేలియా మిస్ చేయ‌గా, ఈజిప్ట్ త‌ర‌ఫున అబ్దెల్‌మిగుడ్ స్కోర్ చేయ‌డంతో 4-2తో ఈజిప్ట్ జ‌య‌కేతనం ఎగురవేసింది. ఆస్ట్రేలియాపై విజ‌యంతో ఫిఫా చ‌రిత్ర‌లో ఈజిప్ట్ తొలిసారి ప్రిక్వార్ట‌ర్స్‌లో అడుగుపెట్టింది. అంతేకాదు ఆఫ్రికా నుంచి ఫిఫాలో రౌండ్‌-16కు అర్హ‌త సాధించిన రెండో దేశంగా ఈజిప్ట్ నిలిచింది. ఇక రౌండ్‌-16లో అర్జెంటీనా, కేప్‌వెర్డె మ‌ధ్య విజేత‌తో  ఈజిప్ట్ త‌ల‌ప‌డ‌నుంది.

సెల్ఫ్ గోల్స్ రికార్డు
ఈసారి ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో సెల్ఫ్ గోల్స్ విష‌యంలో ఒక చెత్త రికార్డు న‌మోద‌య్యింది. ఈ టోర్నీలో ఈజిప్ట్ ఆట‌గాడు మొహ్మ‌ద్ హ‌నీ కొట్టిన సెల్ఫ్ గోల్ 13వది కాగా.. గ‌తంలో ఫిఫా టోర్నీలో న‌మోదైన 12 సెల్ఫ్ గోల్స్ రికార్డు బ‌ద్ద‌ల‌య్యింది. 13 సెల్ఫ్ గోల్స్‌తో ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌ 2026 కొత్త రికార్డు సృష్టించింది. 2018లో ర‌ష్యాలో జ‌రిగిన ఫిఫా టోర్నీలో 12 సెల్ఫ్ గోల్స్ న‌మోద‌వ్వ‌గా, 1998లో ఫ్రాన్స్ వేదిక‌గా జ‌రిగిన ఫిఫాలో ఆరు గోల్స్‌, 2014లో బ్రెజిల్ వేదిక‌గా జ‌రిగిన ఫిఫాలో ఐదు సెల్ఫ్ గోల్స్ న‌మోద‌య్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement