ఫిఫా ప్రపంచకప్ 2026లో మాజీ చాంపియన్ జర్మనీ ఆట ముగిసింది. రౌండ్ ఆఫ్ 32లో పరాగ్వేతో జరిగిన పోరులో పెనాల్టీ షూటౌట్‌లో 4-3తో జర్మనీ ఓటమి చవిచూసింది. ఐదోసారి ఫిఫా చాంపియన్‌గా నిలవాలని భావించిన జర్మనీకి పరాగ్వే చెక్ పెట్టింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో నిర్ణీత సమయం ముగిసేలోపు ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి.
జర్మనీ తరఫున ఆట 54వ నిమిషంలో కాయ్ హావెర్ట్జ్ గోల్ చేయగా, పరాగ్వే తరఫున ఆట 42వ నిమిషంలో జులియో ఎన్సియో గోల్ సాధించాడు. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఇంజ్యూరీ టైమ్‌తో పాటు ఎక్స్‌ట్రా టైమ్ (మరో 30 నిమిషాలు) అదనంగా కేటాయించినప్పటికీ జర్మనీ, పరాగ్వే గోల్ కొట్టడంలో విఫలమయ్యాయి. దీంతో విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది.
2018, 2022 ఫిఫా ప్రపంచకప్పుల్లో గ్రూప్ దశలోనే వెనుదిరిగిన జర్మనీ ఈసారి మాత్రం గ్రూప్ దశను దాటినప్పటికీ రౌండ్ ఆఫ్ 16ను దాటడంలో విఫలమయ్యింది. ఇక నాకౌట్ దశను దాటి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టిన పరాగ్వే జట్టు అత్యుత్తమ ప్రదర్శన 2010 ఫిఫాలో వచ్చింది. ఆ ఏడాది ప్రపంచకప్‌లో పరాగ్వే క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది.
THE FOUR-TIME WORLD CUP WINNERS, GERMANY, ARE ELIMINATED IN THE ROUND OF 32 BY PARAGUAY ON PENALTIES.
The first upset of the knockout stage 🤯 pic.twitter.com/axPr7fNdEN— ESPN (@espn) June 29, 2026
🚨🚨💣 QUEL ÉNORME COUP DE TONNERRE : LE PARAGUAY 🇵🇾 ÉLIMINE L'ALLEMAGNE 🇩🇪 DÈS LES SEIZIÈMES DE FINALE DU MONDIAL !!! 🤯⚡️
CONTRE TOUTE ATTENTE, LES PARAGUAYENS S'IMPOSENT AUX TIRS AU BUT CONTRE LES QUADRUPLES CHAMPIONS DU MONDE !!!
C'EST UNE FOLIE, LES ALLEMANDS N'ONT PLUS… pic.twitter.com/pOz2lRnZi9— Actu Foot (@ActuFoot_) June 29, 2026


