breaking news
Paraguay
-
వివాదంలో ఎంబాపె.. ‘క్షమాపణ చెప్పకపోతే కోర్టుకీడుస్తా!’
ఫ్రాన్స్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు కైలియన్ ఎంబాపె వివాదంలో చిక్కుకున్నాడు. ప్రస్తుతం ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ తరఫున అదరగొడుతున్న ఎంబాపె.. పరాగ్వేతో మ్యాచ్ అనంతరం ఆ దేశానికి చెందిన మహిళా సెనెటర్ సెలెస్టే అమరిల్లాను ఉద్దేశించి ‘నీచమైన మహిళ’ అని ఉద్దేశిస్తూ ఎంబాపె తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు పెట్టడం అగ్గిని రాజేసింది. ఎంబాపె తనకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని సెలెస్టే డిమాండ్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఎంబాపె చేసిన వ్యాఖ్యలు జాతి వివక్షపూరితంగా ఉన్నాయని, అతడు క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమని హెచ్చరించడం ఇక్కడ కొసమెరుపు.అసలేం జరిగిందంటే?ఫిఫాలో ప్రిక్వార్టర్స్‌లో ఫ్రాన్స్, పరాగ్వే తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 1-0తో పరాగ్వేను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే మ్యాచ్ పూర్తయ్యాక ఎంబాపే ‘ఎక్స్’లో సెలిస్టే అమరిల్లాను నీచమైన మహిళగా పేర్కొంటూ పోస్ట్ పెట్టాడు. ‘మేడం సెలెస్టీ.. మీరు ఒక నీచమైన మహిళ. సెనేటర్ పదవికి మీరు అనర్హులు. మీరు పరాగ్వే ప్రతినిధులు కారు. ఫిఫా వరల్డ్‌కప్‌లో పరాగ్వే జట్టు అద్భుత ప్రదర్శనతో మీ నిర్లక్ష్య ధోరణిని, మీరు చూపిన జాతి వివక్షను అందరూ మరిచిపోయారు. మీరు అశక్తులు. దేశ ప్రతినిధిగా మిమ్మల్ని చూపడానికి అనర్హులు. విద్వేషాన్ని, జాతివివక్షను ప్రపంచమంతా వ్యాపింప జేయాలనుకునే ఆమెలాంటి వాళ్లను నేను అనుమతించను’ అని ఎంబాపె సంచలన పోస్టు పెట్టాడు.ఎంబాపె పెట్టిన పోస్ట్ చూసి సెలెస్టీ కోపంతో ఉగిపోయింది. తనను నీచమైన మహిళ అనేందుకు, సెనెటర్ పదవికి అనర్హురాలు అనడానికి ఎంబాపెకు అర్హత లేదని మండిపడ్డారు. ‘సమస్య నీకు, నాకు మధ్య. ఫ్రాన్స్‌ను ఉద్దేశించి నేను ఏమీ అనలేదు. నేను ఫ్రాన్స్‌లోని స్కూల్లో చదివాను. పదిహేడేళ్లు వచ్చేవరకూ ఇక్కడే చదివా. ఫ్రెంచ్ మాట్లాడుతా. ఫ్రాన్స్ రావడం అంటే నాకు ఇష్టం. నాకు ఫ్రాన్స్‌తో ఏ సమస్యా లేదు. నీతోనే సమస్య. మ్యాచ్ అనంతరం ఎంబాపే తన కోపాన్ని, ధిక్కార స్వభావాన్ని చూపాడు. పరాగ్వే ఆటగాళ్లు, గోల్ కీపర్ పట్ల అతడు ప్రవర్తించిన తీరు నా దేశాన్ని గాయపరిచింది. కాబట్టి ఎంబాపే తన పోస్ట్ పట్ల బహిరంగ క్షమాపణలు చెప్పాలి. లేదంటే అతడిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటా’ అని సెలెస్టీ పేర్కొంది. గోల్డెన్ బూట్ రేసులో ఎంబాపెఇక ఫిఫా ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్లో మొరాకోతో ఫ్రాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. టోర్నీలో ఐదు మ్యాచ్‌లాడిన ఎంబాపె ఏడు గోల్స్, రెండు అసిస్ట్‌లతో గోల్డెన్ బూట్ రేసులో దూసుకుపోతున్నాడు. ఎంబాపెకు పోటీగా అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ కూడా ఉన్నాడు. మెస్సీ 4 మ్యాచ్‌ల్లోనే ఏడు గోల్స్ చేయడం విశేషం. నేడు జరగనున్న ప్రిక్వార్టర్స్‌లో ఈజిప్ట్‌తో అర్జెంటీనా తలపడనున్న నేపథ్యంలో మెస్సీ ఎన్ని గోల్స్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. -
ఫ్రాన్స్‌దే పైచేయి
ఫిలడెల్ఫియా: మూడోసారి ప్రపంచ కప్ టైటిల్ సాధించాలని ఆశిస్తున్న ఫ్రాన్స్ ఫుట్‌బాల్ జట్టు ఆ దిశగా మరో అడుగు వేసింది. పరాగ్వే జట్టుతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 1–0తో గెలిచి ఈ మెగా ఈవెంట్లో పదోసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మ్యాచ్ 70వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను కెప్టెన్ ఎంబాపె గోల్‌గా మలిచి ఫ్రాన్స్ జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఈనెల 10న జరిగే క్వార్టర్ ఫైనల్లో మొరాకో జట్టుతో ఫ్రాన్స్ తలపడుతుంది. 2022 ప్రపంచకప్ సెమీఫైనల్లో మొరాకో జట్టును ఓడించే ఫ్రాన్స్ ఫైనల్‌కు చేరింది. 1998, 2018 ప్రపంచకప్‌లలో టైటిల్ గెలిచిన ఫ్రాన్స్ 2022లో రన్నరప్‌గా నిలిచింది. ప్రపంచకప్‌లో ఐదోసారి ప్రిక్వార్టర్ ఫైనల్ నాకౌట్ మ్యాచ్ ఆడిన పరాగ్వే జట్టు... ఫ్రాన్స్ జట్టును ఓడించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసినా చివరకు ఓటమితో సరిపెట్టుకుంది. నాకౌట్ దశ తొలి రౌండ్ మ్యాచ్‌లో నాలుగుసార్లు చాంపియన్, నాలుగుసార్లు రన్నరప్ జర్మనీ జట్టుపై ‘పెనాల్టీ షూటౌట్’లో సంచలన విజయం నమోదు చేసిన పరాగ్వే జట్టు ప్రిక్వార్టర్ ఫైనల్లో మాత్రం అత్యంత మొరటుగా ఆడింది. ఫ్రాన్స్ జట్టు స్టార్ ప్లేయర్లు ఎంబాపె, డెంబెలె, డిజైర్ డుయి, అడ్రియన్ రబియోట్, మనూ కోన్లను ఎక్కడ పడితే అక్కడ నిలువరించేందుకు పరాగ్వే ఆటగాళ్లు ప్రయత్నించారు. ఫ్రాన్స్ ఆటగాళ్లతో వాగ్వాదం చేయడం... జెర్సీలు పట్టి లాగడం... మోచేతులతో ఢీకొట్టడం... కాళ్లలో కాళ్లు పెట్టి అడ్డగించడం... చేశారు. పరాగ్వే ఆటగాళ్ల మొరటు ఆటతీరుపై రిఫరీ ఇల్గిజ్ తంతాòÙవ్ (ఉజ్బెకిస్తాన్) ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అందర్నీ నివ్వెరపరిచింది. మ్యాచ్ మొత్తంలో పరాగ్వే ఆటగాళ్లను కనీసం ఒక్కయెల్లో కార్డుతో కూడా రిఫరీ హెచ్చరించకపోగా.. ముగ్గురు ఫ్రాన్స్ ఆటగాళ్లకు ఆయన యెల్లో కార్డులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. తొలి అర్ధభాగంలో ఒక్కసారి కూడా పరాగ్వే గోల్‌పోస్ట్‌పై షాట్ కొట్టని ఫ్రాన్స్... రెండో అర్ధభాగంలో జోరు పెంచింది. వారి ప్రయత్నం 70వ నిమిషంలో ఫలించింది. ‘డి’ ఏరియాలో ఫ్రాన్స్ ఫార్వర్డ్ డిజైర్ డుయిని పరాగ్వే డిఫెండర్ గోమెజ్ కింద పడేశాడు. వీడియో రీప్లే పరిశీలించాక రిఫరీ ఫ్రాన్స్ జట్టుకు పెనాల్టీ కిక్‌ను ప్రదానం చేశారు. ఎంబాపె దీనిని గోల్‌గా మలిచాడు. ఈ టోర్నీలో ఎంబాపె కిది ఏడో గోల్కాగా... ఓవరాల్‌గా ప్రపంచకప్‌లో 19వ గోల్ కావడం విశేషం. ఖాతా తెరిచిన తర్వాత ఫ్రాన్స్ ఆటగాళ్లు రెండో గోల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే పరాగ్వే గోల్‌కీపర్ ఒర్లాండో గిల్ అడ్డుగోడలా నిలబడ్డాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఎంబాపెతో కరచాలనం చేసేందుకు పరాగ్వే గోల్‌కీపర్ ఒర్లాండో వెళ్లగా ఫ్రాన్స్ కెప్టెన్ స్పందించలేదు. దాంతో ఒర్లాండో తన చేతిలో ఉన్న బంతిని ఎంబాపె వీపు పైకి విసిరేసి తన అసహనాన్ని ప్రదర్శించాడు. -
ఆటగాళ్ల గుండెల్లో ‘షూటౌట్’
జర్మనీ జట్టులో నలుగురు సీనియర్ ప్లేయర్లు... గొరెట్జా, వాల్డమర్, బ్రౌన్, మెలిక్... పరాగ్వేతో పెనాల్టీ షూటౌట్ ఐదు ప్రయత్నాల్లో 3–3తో సమంగా నిలిచిన తర్వాత ఎవరు పెనాల్టీ తీసుకుంటారంటూ జర్మనీ కెప్టెన్ జోషువా కిమిక్ వీరందరినీ అడిగాడు... గొరెట్జానైతే దాదాపు బతిమాలినంత పని చేశాడు. కానీ ఒక్కరూ ముందుకు రాలేదు. దాంతో జొనాథన్ తాహ్ నేను ప్రయత్నిస్తానంటూ కిక్కు సిద్ధమయ్యాడు. అతని 51 మ్యాచ్‌ల అంతర్జాతీయ కెరీర్లో పెనాల్టీ కిక్ తీసుకోవడం ఇదే మొదటిసారి! తీవ్ర ఒత్తిడిలో అతను కొట్టిన బంతి బార్ మీదుగా వెళ్లిపోయింది. తర్వాత పరాగ్వే గోల్ కొట్టడంతో జర్మనీ ఓటమి ఖాయమైంది. షూటౌట్లో ఆటగాళ్ల పరిస్థితి ఏమిటో, వారిపై ఉండే ఒత్తిడి ఎలాంటి ఇది తాజా ఉదాహరణ. –సాక్షి క్రీడా విభాగం ఫుట్‌బాల్‌లో పెనాల్టీ ‘షూటౌట్’ డ్రామాలను ఒక రకంగా ‘అమానవీయం’గా వ్యవహరిస్తుంటారు. సుదీర్ఘ సమయం పాటు మైదానంలో హోరాహోరీగా పోరాడి అలసిన తర్వాత మళ్లీ కొత్త సవాల్‌కు సిద్ధం కావడం ఆటగాళ్లకు కష్టంగా మారిపోతుంది. తమ దేశం తరఫున అంచనాల భారం మోస్తూ బరిలోకి దిగిన ప్లేయర్లపై షూటౌట్ సమయంలో మరింత తీవ్ర ఒత్తిడి నెలకొంటుంది. షూటౌట్లో ఆట మాత్రమే కాకుండా కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యుత్తమ ప్లేయర్లుగా గుర్తింపు పొందిన వాళ్లు కూడా షూటౌట్లో తడబాటుకు లోనవుతారు. ఇతర ఆటగాళ్లలాగే ఈ సమయంలో గోల్ చేయడంలో వారు కూడా విఫలమయ్యే అవకాశాలు అంతే సమానంగా ఉంటాయి. అప్పటి వరకు అద్భుతంగా ఆడినా సరే... కిక్‌లో విఫలం అయితే వారంతా ఒక్కసారిగా విలన్లుగా మారిపోవడం ఖాయం. తాజా ‘ఫిఫా’ ప్రపంచ కప్ రౌండ్–32లో తొలి రెండు మ్యాచ్‌లలో ఫలితం పెనాల్టీ షూటౌట్ల ద్వారానే వచ్చింది. ఇందులో దిగ్గజ జట్టు జర్మనీ, మరో పటిష్ట యూరోపియన్ టీమ్ నెదర్లాండ్స్... బలహీనులనదగ్గ పరాగ్వే, మొరాకో చేతుల్లోపరాజయం పాలయ్యాయి. గొప్ప ఆటగాళ్లూ విఫలమై... ఫుట్‌బాల్‌లో షూటౌట్లను 1970లో ప్రవేశపెట్టారు. 1994లో తొలిసారి షూటౌట్ ద్వారా ప్రపంచ కప్ విజేతను నిర్ణయించారు. ఈ మ్యాచ్‌లో ఇటలీపై బ్రెజిల్ పైచేయి సాధించింది. ఇటలీ దిగ్గజ ఆటగాడు రాబర్టో బాగియో ఈ షూటౌట్లో గోల్ కొట్టలేకపోవడం సాకర్ చరిత్రలోనే అత్యంత దురదృష్టకర క్షణాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ‘షూటౌట్ సమయంలో ఆటగాళ్లపై అతి తీవ్రంగా ఒత్తిడి ఉంటుంది. ఇది అమానవీయ స్థాయికి చేరిపోతుంది. ముఖ్యంగా కిక్ తీసుకునే ఆటగాళ్లపై అందరి దృష్టీ ఉంటుంది. దీనిని అధిగమించి స్కోర్ చేయడం చాలా కష్టం’ అని నార్వేకు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ సైకాలజిస్ట్ గియర్ జార్డెట్ అభిప్రాయ పడ్డారు. పెనాల్టీ స్పాట్ నుంచి గోల్ లైన్ వరకు ఉండే 11 మీటర్ల దూరంలో ఆటగాళ్ల భవిష్యత్తు నిర్ధారితమవుతుందని ఇంగ్లండ్ ఆటగాడు నోని మడుకె అన్నాడు. 2022 ఖతర్ వరల్డ్ కప్‌లో ఐదు మ్యాచ్‌లు పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లగా... అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఫలితం కూడా దాంతోనే తేలిన విషయాన్ని అతను గుర్తు చేశాడు. ఒత్తిడిని అధిగమిస్తేనే... పెనాల్టీ కిక్‌ను తీసుకోవడంలో ఒక్కో ఆటగాడికి ఒక్కో శైలికి ఉంటుంది. కొందరు ఎక్కువ సమయం తీసుకోకుండా వేగంగా ముందుకు దూసుకొచ్చి కిక్ కొడితే, మరికొందరు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని అప్పుడు కిక్ తీసుకుంటారు. కాస్త ఆగినట్లుగా చేస్తూ కీపర్ బోల్తా కొట్టేలా ఎదురు చూసి తమ పని పూర్తి చేసుకునే శైలి మరికొందరు ఆటగాళ్లది. అయితే ఎలా చేసినా అతను గోల్ కొట్టాలనే తీవ్రమైన ఒత్తిడి మాత్రం కచ్చితంగా ఉంటుంది. ‘రిఫరీ విజిల్ వేయగానే కిక్ కొట్టే వారు ఎక్కువగా విఫలం కావడం కనిపిస్తుంది. ఒత్తిడి తగ్గే వరకు కాస్త ఆపై వెళ్లేవారికి మంచి ఫలితాలు రావడం మేం చూశాం. అయితే పెనాల్టీ కిక్ తీసుకోవాలంటే చాలా గుండె ధైర్యం మాత్రం ఉండాల్సిందే. అది అంత సులువు కాదు. గోల్‌కీపర్లు మాత్రం ఈ విషయంలో అనుభవం కొద్దీ రాటుదేలుతారు’ అని అమెరికా ఫార్వర్డ్ క్రిస్టియాన్ ప్యులిసిక్ విశ్లేషించాడు. 2022 వరల్డ్ కప్ ఫైనల్ సహా అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ గత ఆరు పెనాల్టీ షూటౌట్లోనూ ప్రత్యర్థిని నిలువరించడం విశేషం.ఆటగాళ్ల ఎంపికే కీలకం... షూటౌట్లో ఆటగాళ్లను ఎంపిక చేయడం కూడా కోచ్‌కు పెద్ద సవాల్‌గా మారుతుంది. ఎవరిని ఎంచుకున్నా అది సాహసోపేత నిర్ణయమే అవుతుంది. ఆటగాడిగా పేరు, అనుభవం మాత్రమే కాకుండా ఆ సమయంలో కొట్టగలడనే నమ్మకం కూడా ఉండాలి. మెస్సీ, ఎంబాపెలాంటి ఆటగాళ్లు మరో ఆలోచన లేకుండా షూటౌట్‌కు సిద్ధం కావడం సహజమే కానీ ఇతర ఆటగాళ్ల విషయంలోనే సమస్య వస్తుంది. టెక్నిక్‌తో పాటు పెనాల్టీ కిక్‌ల విషయంలో కూడా రిహార్సల్స్ చేయడం అవసరమనేది నిపుణుల అభిప్రాయం. తాజాగా పరాగ్వేతో జర్మనీ మ్యాచ్ అందుకు సరైన ఉదాహరణ. సీనియర్ ప్లేయర్లు కూడా ముందుకు రాలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. పేరు ప్రతిష్టలతో కాకుండా తాను గోల్ కొడతాననే ఆత్మవిశ్వాసం ప్రదర్శించే ఆటగాళ్లపై నమ్మకం ఉంచవచ్చని... అయితే స్వచ్ఛందంగా రమ్మని అడగకుండా కోచ్‌లు ఎంపిక చేయడమే సరైన పద్ధతి అని ప్యులిసిక్ వ్యాఖ్యానించాడు. ఈ ప్రపంచకప్‌లో మున్ముందు ఎన్ని మ్యాచ్‌లలో ‘షూటౌట్’ రాత మారుస్తుందనేది ఆసక్తికరం. -
జర్మనీ, నెదర్లాండ్స్ ఖేల్ ఖతం
అత్యంత నిలకడగా రాణించే జట్టుగా పేరున్న జర్మనీ... ప్రపంచకప్‌లో మూడుసార్లు రన్నరప్‌గా నిలిచిన నెదర్లాండ్స్... ఈసారి నిరాశపరిచాయి. కీలకదశలో ఒత్తిడికి తలొగ్గిన జర్మనీ, నెదర్లాండ్స్ నాకౌట్ దశ తొలి రౌండ్ మ్యాచ్‌లోనే ఓడిపోయి టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించాయి. భారీ అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పరాగ్వే, మొరాకో సంచలన ఫలితాలతో ప్రపంచకప్‌లో మరో అడుగు ముందుకు వేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాయి. మేటి జట్లకు కూడా చెమటలు పట్టించే ‘పెనాల్టీ షూటౌట్’లో పరాగ్వే 4–3తో జర్మనీపై... మొరాకో ‘పెనాల్టీ షూటౌట్’లో 3–2తో నెదర్లాండ్స్‌పై విజయం సాధించాయి. బోస్టన్: గత మూడు ప్రపంచకప్ టోర్నీలకు అర్హత సాధించలేకపోయిన పరాగ్వే ఆ కసినంతా తాజా ప్రపంచకప్‌లో తీర్చుకుంటోంది. సమష్టి ఆటతీరుతో సత్తా చాటుకుంటోంది. లీగ్ దశలో మూడో స్థానంలో నిలిచిన ఎనిమిది అత్యుత్తమ జట్లలో ఒకటిగా నాకౌట్ దశకు చేరుకున్న పరాగ్వే... చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో నాలుగుసార్లు చాంపియన్, నాలుగుసార్లు రన్నరప్ జర్మనీ జట్టును కంగుతినిపించింది. నిర్ణీత 90 నిమిషాలు ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. 42వ నిమిషంలో జూలియో ఎన్సిసో గోల్‌తో పరాగ్వే 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 54వ నిమిషంలో కాయ్ హావెట్జ్ గోల్‌తో జర్మనీ స్కోరును 1–1తో సమం చేసింది. రెగ్యులర్ సమయం ముగిశాక రెండు జట్లు సమఉజ్జీగా నిలవడంతో... ఫలితం తేల్చేందుకు అదనపు 30 నిమిషాలు ఆడించారు. అదనపు సమయం ముగిశాకా రెండు జట్లు సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయయించేందుకు ‘పెనాల్టీ షూటౌట్’ నిర్వహించారు.‘షూటౌట్’లో జర్మనీ ముగ్గురు ఆటగాళ్లు హావెట్జ్, వోల్టెమేడ్, జొనాథన్... పరాగ్వే ఇద్దరు ఆటగాళ్లు సనబ్రియా, బల్బయేనా గురి తప్పారు. ఆరో షాట్‌ను కెనాలో గోల్‌గా మలచడంతో పరాగ్వే సంబరాలు చేసుకుంది. ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి ‘షూటౌట్’లో ఓడిపోయిన జర్మనీ బృందం నిరాశలో మునిగిపోయింది.‘షూటౌట్’లో మూడో‘సారీ’నెదర్లాండ్స్, మొరాకో మధ్య మ్యాచ్‌లో నిర్ణీత 90 నిమిషాలు పూర్తయ్యాక రెండు జట్లు 1–1తో సమఉజ్జీగా నిలిచాయి. 72వ నిమిషంలో కోడీ గాప్కో గోల్‌తో నెదర్లాండ్స్ 1–0తో ముందంజ వేసింది. 90+1వ నిమిషంలో ఇసా డియోప్ గోల్‌తో మొరాకో స్కోరును 1–1తో సమం చేసింది. అదనపు సమయంలోనూ ఫలితం రాకపోవడంతో విజేతను నిర్ణయించేందుకు ‘పెనాల్టీ షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో నెదర్లాండ్స్ ఆటగాళ్లు ఒత్తిడికి తలొగ్గి ఓటమిని మూటగట్టుకున్నారు. 2014, 2022 ప్రపంచకప్ టోర్నీల్లో ‘షూటౌట్’లోనే తడబడి నిష్క్ర మించిన నెదర్లాండ్స్ మూడోసారి ఈ మెగా ఈవెంట్లో ‘షూటౌట్’లో విఫలమైంది. -
ఫిఫాలో సంచలనం.. పెనాల్టీ షూటౌట్లో జర్మనీ ఓటమి
ఫిఫా ప్రపంచకప్ 2026లో మాజీ చాంపియన్ జర్మనీ ఆట ముగిసింది. రౌండ్ ఆఫ్ 32లో పరాగ్వేతో జరిగిన పోరులో పెనాల్టీ షూటౌట్లో 4-3తో జర్మనీ ఓటమి చవిచూసింది. ఐదోసారి ఫిఫా చాంపియన్‌గా నిలవాలని భావించిన జర్మనీకి పరాగ్వే చెక్ పెట్టింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో నిర్ణీత సమయం ముగిసేలోపు ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. జర్మనీ తరఫున ఆట 54వ నిమిషంలో కాయ్ హావెర్ట్జ్ గోల్ చేయగా, పరాగ్వే తరఫున ఆట 42వ నిమిషంలో జులియో ఎన్సియో గోల్ సాధించాడు. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఇంజ్యూరీ టైమ్‌తో పాటు ఎక్స్ట్రా టైమ్ (మరో 30 నిమిషాలు) అదనంగా కేటాయించినప్పటికీ జర్మనీ, పరాగ్వే గోల్ కొట్టడంలో విఫలమయ్యాయి. దీంతో విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. 2018, 2022 ఫిఫా ప్రపంచకప్పుల్లో గ్రూప్ దశలోనే వెనుదిరిగిన జర్మనీ ఈసారి మాత్రం గ్రూప్ దశను దాటినప్పటికీ రౌండ్ ఆఫ్ 16ను దాటడంలో విఫలమయ్యింది. ఇక నాకౌట్ దశను దాటి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టిన పరాగ్వే జట్టు అత్యుత్తమ ప్రదర్శన 2010 ఫిఫాలో వచ్చింది. ఆ ఏడాది ప్రపంచకప్‌లో పరాగ్వే క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. THE FOUR-TIME WORLD CUP WINNERS, GERMANY, ARE ELIMINATED IN THE ROUND OF 32 BY PARAGUAY ON PENALTIES.The first upset of the knockout stage 🤯 pic.twitter.com/axPr7fNdEN— ESPN (@espn) June 29, 2026🚨🚨💣 QUEL ÉNORME COUP DE TONNERRE : LE PARAGUAY 🇵🇾 ÉLIMINE L'ALLEMAGNE 🇩🇪 DÈS LES SEIZIÈMES DE FINALE DU MONDIAL !!! 🤯⚡️CONTRE TOUTE ATTENTE, LES PARAGUAYENS S'IMPOSENT AUX TIRS AU BUT CONTRE LES QUADRUPLES CHAMPIONS DU MONDE !!!C'EST UNE FOLIE, LES ALLEMANDS N'ONT PLUS… pic.twitter.com/pOz2lRnZi9— Actu Foot (@ActuFoot_) June 29, 2026 -
నోరు మూసుకున్నందుకు రెడ్‌కార్డ్.. ఫిఫా చరిత్రలోనే తొలిసారి!
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తున్న ఫిఫా ప్రపంచకప్ టోర్నీ వివాదాలకు కూడా కేంద్రబిందువుగా మారుతోంది. తాజాగా శనివారం పరాగ్వే, తుర్కియో మ్యాచ్ సందర్భంగా పర్వాగ్వే మిడ్‌ఫీల్డర్ మిగ్యుల్ అల్మిరాన్ చేతితో నోరును మూసుకున్నాడన్న కారణంతో రిఫరీ రెడ్‌కార్డ్ చూపించడం చర్చనీయాంశంగా మారింది.ఫిఫాలో ఈసారే ప్రవేశపెట్టిన ఈ కొత్త రూల్ ఇప్పుడు హైలైట్‌గా నిలిచింది. విషయంలోకి వెళితే.. మ్యాచ్‌లో ఫౌల్ అనంతరం తుర్కియో డిఫెండర్ మెర్ట్ ముల్దర్‌తో పరాగ్వే ఫార్వర్డ్ ఆటగాడు ఇసిడ్కో పిట్టా వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుండగానే ఇరుజట్ల ఆటగాళ్లు గుంపుగా వచ్చేశారు. ఈ సమయంలో జట్టుకు కాస్త దూరంలో ఉన్న అల్మిరాన్ ముల్దర్‌తో మాట్లాడుతూ నోటికి చేతిని అడ్డుపెట్టాడు. అల్మిరాన్ చర్య పట్ల తుర్కియే డిఫెండర్ రిఫరీకి ఫిర్యాదు చేశాడు. వీఏఆర్ (Video Assistant Referee) ద్వారా మ్యాచ్ అధికారులు వీడియోను మరోసారి పరిశీలించారు. రిప్లేలో అల్మిరాన్ తన నోరును మూసుకున్నట్లు తేలడంతో రిఫరీ బార్డన్ వెంటనే అతడికి రెడ్ కార్డ్ చూపించాడు. దీంతో పరాగ్వే జట్టు 10 మందితోనే మిగతా మ్యాచ్ ఆడాల్సి వచ్చింది.ఫిఫా తెచ్చిన కొత్త రూల్ ఏంటంటే?2026 ఫిఫా ప్రపంచకప్‌లో ఫిఫా కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా మైదానంలోనే దుర్భాషకు దిగడం లేదా వివక్షపూరిత వ్యాఖ్యలు చేయడం నిషేధం. ఇదే నిబంధన ప్రకారం ప్రత్యర్థి జట్టుతో ఘర్షణ జరిగిన సమయంలో సదరు ఆటగాడు చేతితో లేదా భుజంతో లేదా చొక్కాతో నోరు మూసుకుంటే అతడికి రెడ్ కార్డ్ చూపించవచ్చు. మ్యాచ్ అధికారులకు తెలియకుండా ఆటగాళ్లు చేసే వ్యాఖ్యలు దాచిపెట్టకుండా నిరోధించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. అయితే ఈ నిబంధన కేవలం ఫిఫాకు మాత్రమే పరిమితమని, క్లబ్ మ్యాచ్‌లు, స్నేహపూర్వక సంభాషణ సమయంలో ఒక ఆటగాడు ఇలాంటి చర్యలకు పాల్పడితే రెడ్‌కార్డ్ చూపడం జరగదని ఫిఫా నిర్వాహకులు తెలిపారు.బోణీ కొట్టిన పరాగ్వే అల్మిరాన్ రెడ్‌కార్డ్‌కు గురవ్వడంతో పదిమందితోనే ఆడిన పరాగ్వే 1-0తో తుర్కియేపై విజయం సాధించి ఫిఫాలో బోణీ కొట్టింది. అల్మిరాన్ రెడ్‌కార్డ్‌కు గురవ్వడంతో అతడు కొట్టిన గోల్ చెల్లదు. మరో గోల్‌ను మటియస్ గాల్జా (ఆట 2వ నిమిషంలో) జట్టుకు అందించాడు. ఈ క్రమంలో గాల్జా ఫిఫా ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ గోల్ నమోదు చేశాడు. 65 సెకన్ల వ్యవధిలోనే గాల్జా బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. ఇవాళ ఉదయం మొరాకో ఆటగాడు ఇస్మాయిల్ సైబారి 72 సెకన్ల వ్యవధిలో కొట్టిన గోల్ రికార్డు గంటల వ్యవధిలోనే బద్దలు కావడం గమనార్హం. 🚨| SHOCKING MOMENT AT THE FIFA WORLD CUP! 🤯🌎Miguel Almirón became the first player ever to be sent off for 𝐂𝐎𝐕𝐄𝐑𝐈𝐍𝐆 his mouth while speaking to an opposition player during a confrontation. 😳🟥 pic.twitter.com/Y8TYL7sISL— FÚTBOL HUB (@futbol_hubX) June 20, 2026 -
అమెరికా సంచలన విజయం.. ఫిఫా చరిత్రలోనే
ఫిఫా ప్రపంచకప్ 2026లో తమ తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య అమెరికా చారిత్రత్మక విజయాన్ని అందుకుంది. లాస్ ఏంజిల్స్ స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్-డి మ్యాచ్‌లో పరాగ్వేను 4-1 తేడాతో అమెరికా చిత్తు చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు యూఎస్ఎ ఆధిపత్యం చెలాయించింది.మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే పరాగ్వే ఆటగాడు డామియన్ బొబాడిల్లా చేసిన పొరపాటు అమెరికాకు కలిసొచ్చింది. బొబాడిల్లా ప్రత్యర్థి పాస్‌ను అడ్డుకునే క్రమంలో బంతిని తానే స్వయంగా నెట్లోకి పంపి 'ఓన్ గోల్' చేశాడు. దీంతో అమెరికా 1-0తో ముందంజ వేసింది.బలోగన్ జోరు..ఆ తర్వాత 28 నిమిషంలో అమెరికా స్ట్రైకర్ ఫోలారిన్ బలోగన్ అద్భుతమైన పాస్‌ను అందుకుని, బంతిని సునాయాసంగా నెట్లోకి పంపాడు. దీంతో అమెరికా సంబరాల్లో మునిగిపోయింది. ఇక్కడే ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. రిఫరీ డానీ మాకెలీ ఆ గోల్‌ను 'అంపైర్ ఆఫ్‌సైడ్'గా ప్రకటించి తిరస్కరించాడు.అయినప్పటికి బాలోగన్ ఏమాత్రం నిరాశ పడలేదు. కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే (31వ నిమిషంలో) బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపి స్కోరును 2-0కు చేర్చాడు. అయితే ఫస్ట్ హాఫ్‌లో ఇంజ్యురీ టైమ్ పేరిట 5 నిమిషాలు అదనంగా కేటాయించారు. ఈ సమయం అమెరికాకు కలిసొచ్చింది. బలోగన్ మరో సూపర్ గోల్‌తో మెరిశాడు. దీంతో ఫస్టాఫ్ ముగిసేసరికి అమెరికా 3-0తో పూర్తి ఆధిక్యంలో నిలిచింది.ఇక సెకెండ్ హాఫ్‌లో పుంజుకునేందుకు పరాగ్వే గట్టిగా ప్రయత్నించింది. ఈ క్రమంలో 73వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ 'మౌరిసియో' పరాగ్వే తరఫున తొలి గోల్ సాధించి ఆశలు రేకెత్తించాడు. అయితే ఆ ఆతర్వాత డిఫెండర్లు అప్రమత్తంగా వ్యవహరించి ఆ తర్వాత పరాగ్వేకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మ్యాచ్ ఆఖరిలో అమెరికాకు చెందిన జియోవన్నీ రేనా అద్భుతమైన గోల్‌ను సాధించి 4-1 ఆధిక్యాన్ని అందించాడు. కాగా ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో యూఎస్ఎ నాలుగు గోల్స్ సాధించడం ఇదే మొదటిసారి. -
భారత్ వరికి ఎంఎస్పీ పెంచితే డబ్ల్యూటీఓలో ప్రశ్నలు!
దేశీయంలో వరి పంటలో స్వావలంబన సాధించేందుకు, ఇథనాల్ ఉత్పత్తికి, రైతులకు ఆర్థిక భరోసాకు, కొన్ని దేశాలకు బియ్యం ఎగుమతులు పెంచేందుకు భారత్ తీసుకున్న నిర్ణయానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. దేశంలో వరి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) పెంపు నిర్ణయానికి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(డబ్ల్యూటీఓ)లో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈమేరకు భారత నిర్ణయాన్ని అమెరికా, పరాగ్వే సంయుక్తంగా డబ్ల్యూటీఓలో వ్యతిరేకిస్తున్నాయి. ప్రపంచ ఆహార భద్రతకు సంబంధించిన ‘బాలీ ఒప్పందాల’ను(డబ్ల్యూటీఓ ఆహార సబ్సిడీ పరిమితులు) భారత్ భేఖాతరు చేస్తుందని వాదించాయి.ఎంఎస్పీ పెంపు విధానం భారత్ దేశీయ ఆహార పంపిణీ వ్యవస్థలో భాగం అయినప్పటికీ ఎగుమతులు, ఆహారేతర ప్రయోజనాల కోసం నిల్వలు పెంచుతోందని యూఎస్, పరాగ్వే అభిప్రాయపడుతున్నాయి. భారత్ ఎంఎస్పీ పెంచడం, భారీగా నిల్వలు ఉండడం, ఎగుమతులు సాగించడం వంటి విధానాలు ప్రపంచ బియ్యం ధరలపై ఒత్తిడిని పెంచుతున్నట్లు చెప్పాయి. పాకిస్థాన్‌ను ఉదాహరిస్తూ.. అక్కడి బాస్మతియేతర బియ్యం ధరలు దాదాపు రాత్రికి రాత్రే మెట్రిక్ టన్నుకు సుమారు 200 డాలర్లు పడిపోయాయని గుర్తు చేశాయి.అయితే భారత్ వాదనలు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. దేశం తన వంతుగా చిన్న, సన్నకారు రైతులకు మద్దతు ఇవ్వడానికి, పేదలకు ఆహారం అందించడానికి, కొన్ని దేశాలకు ఆహార భద్రతను నిర్ధారించేందుకు ఈ మార్పులు చేసినట్లు చెప్పింది. భారతదేశం బియ్యంపై ఆంక్షలను ఎత్తివేసినప్పటి నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. 2025 నాటికి రికార్డు స్థాయిలో 22.5 మిలియన్ టన్నులకు పెరుగుతాయని భావిస్తున్నారు. అయితే డబ్ల్యూటీఓ నిబంధనలకు లోబడే నిర్ణయాలున్నట్లు భారత అధికారులు చెబుతున్నారు. ఎఫ్‌సీఐ గోదాముల్లోని బియ్యాన్ని ఎగుమతులకు ఉపయోగించడం లేదన్నారు. అందుకు బదులుగా ఏటా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న స్టాక్‌నే నిల్వ ఉంచకుండా నేరుగా ఎగుమతి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దీనిపై సెప్టెంబర్ 25-26 తేదీల్లో జరిగే సమీక్షా సమావేశంలో చర్చ జరగనుంది.ఇదీ చదవండి: భారత్–అమెరికా చర్చల్లో పురోగతి -
నిత్యానంద కైలాసతో ఒప్పందాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
బ్యూనస్ ఎయిర్: నిత్యానంద ప్రకటించుకున్న 'యునైటెట్ స్టేట్స్ ఆఫ్ కైలాస' ప్రత్యేక దేశంతో ఒప్పందం చేసుకున్నందుకు పరాగ్వే దేశ అధికారి తన పదవిని కోల్పోయాడు. దక్షిణ అమెరికన్ ఐస్‌ల్యాండ్‌గా పేర్కొని నిత్యానంద కైలాస దేశం నుంచి కొంత మంది అధికారులు తనను మోసం చేసినట్లు ఆ పరాగ్వే అధికారి చెప్పారు. ఆర్నాల్డ్ చమోర్రో వ్యవసాయ మంత్రిత్వ శాఖలో ప్రధాన అధికారిగా పనిచేస్తున్నారు. దక్షిణ అమెరికన్ ఐస్‌ల్యాండ్‌గా పేర్కొని నిత్యానంద కైలాస దేశం నుంచి కొంత మంది అధికారులు తన వద్దకు వచ్చారు. కైలాసతో దౌత్య సంబంధాలు, పరస్పర సహకారానికి సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేయించుకున్నారు. అంతేకాకుండా కైలాసకు ఐక్యారాజ్య సమితి గుర్తింపు తెప్పించడానికి సంబంధించిన పత్రాలపై కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. పరాగ్వే వ్యవసాయ మంత్రి కార్లోస్ గిమెనేజ్ను కూడా కలిశారు. నిత్యానంద దేశంతో ఒప్పందం వ్వవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పరాగ్వేలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో వివిధ కేసుల్లో నిందితునిగా ఉన్న నిత్యానందతో ఒప్పందం చేసుకోవడాన్ని ప్రజలు ప్రశ్నించారు. ఇక చేసేదేమి లేక ఒప్పందాలపై సంతకాలు చేసిన వ్యవసాయ శాఖ అధికారి రాజీనామా చేశారు. ఇదీ చదవండి: యూపీ అబ్బాయి.. డచ్ అమ్మాయి.. ఖండాంతరాలు దాటిన ప్రేమ -
భారత జట్ల విజయం
బటూమి (జార్జియా): చెస్ ఒలింపియాడ్ ఐదో రౌండ్లో భారత పురుషుల, మహిళల జట్లు విజయం సాధించాయి. భారత పురుషుల జట్టు 3.5–0.5తో పరాగ్వేపై... మహిళల జట్టు 3.5–0.5తో అర్జెంటీనాపై గెలుపొందాయి. విశ్వనాథన్ ఆనంద్ 26 ఎత్తుల్లో రమిరెజ్ డెల్గాడోపై... ఆధిబన్ 35 ఎత్తుల్లో అల్మిరాన్‌పై... శశికిరణ్ 35 ఎత్తుల్లో వెర్జివ్‌కర్‌పై నెగ్గగా; గిలెర్మోతో జరిగిన గేమ్‌ను పెంటేల హరికృష్ణ 59 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 52 ఎత్తుల్లో కరోలినా లుజాన్‌పై... తానియా సచ్దేవ్ 36 ఎత్తుల్లో ఫ్లోరెన్సియాపై... ఇషా కరవాడే 35 ఎత్తుల్లో ఐలెన్‌పై విజయం సాధించగా... క్లాడియా అమూరాతో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 65 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. -
పరాగ్వేలో భారీ దొంగతనం
-
క్వార్టర్స్‌లో అమెరికా, కొలంబియా
కోపా అమెరికా కప్ ఫిలడెల్ఫియా: టోర్నమెంట్లో ముందుకు సాగాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో అమెరికా ఫుట్‌బాల్ జట్టు సత్తా చాటింది. పటిష్టమైన డిఫెన్స్‌కు తోడు ఫార్వర్డ్స్ సమయోచిత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. దీంతో కోపా అమెరికా కప్‌లో శనివారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్‌లో అమెరికా 1-0తో పరాగ్వేపై విజయం సాధించింది. క్లింట్ డెంప్సే (27వ ని.) యూఎస్ తరఫున ఏకైక గోల్ సాధించాడు. తొలి మ్యాచ్‌లో కొలంబియా చేతిలో ఓడినా... తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో తిరుగులేని ప్రదర్శనతో చెలరేగిన అమెరికా గ్రూప్ టాపర్‌గా ఆరు పాయింట్లతో క్వార్టర్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. మరోవైపు 2001 తర్వాత పరాగ్వే గ్రూప్ దశలో వైదొలగడం ఇదే తొలిసారి. గత రెండు మ్యాచ్‌ల్లో మాదిరిగా లైనప్‌లో ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగిన అమెరికాకు సెంటర్ మిడ్‌ఫీల్డ్‌లో మైకేల్ బ్రాడ్లీ, జోన్స్‌లు అడ్డుగోడలా నిలిచారు. వీళ్ల అండతో ఫార్వర్డ్స్... పరాగ్వేపై దూకుడుగా దాడి చేశారు. అయితే 6వ నిమిషంలో ఫ్యాబిన్ జాన్సన్ (అమెరికా) కొట్టిన కర్లింగ్ ఫ్రీ కిక్ క్రాస్‌బార్ పైనుంచి వెళ్లడంతో తేరుకున్న పరాగ్వే ఒక్కసారిగా కౌంటర్ అటాక్‌కు దిగింది. కానీ 27వ నిమిషంలో లెఫ్ట్ ఫ్లాంక్ నుంచి జార్డెస్ ఇచ్చిన క్రాస్ పాస్‌ను డెంప్సే నేరుగా గోల్‌పోస్ట్‌లోకి పంపి అమెరికాకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఇప్పటికే క్వార్టర్స్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న కొలంబియా... ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మాత్రం బోల్తా కొట్టింది. కోస్టారికాతో జరిగిన మ్యాచ్‌లో కొలంబియా 2-3తో ఓడిపోయింది. -
టాస్ వేయబోతే ఎడ్జ్ అయ్యింది!
పసడెనా (అమెరికా): కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. భారత కాలమాన ప్రకారం మంగళవారం రాత్రి ఇక్కడ కొలంబియా-పరాగ్వే మ్యాచ్ సందర్భంగా తొలుత వేసిన టాస్ కాస్తా ఎడ్జ్(వోర)గా పడటం ఆసక్తికరంగా మారింది. టాస్ లో భాగంగా కొలంబియా-పరాగ్వే కెప్టెన్లతో పాటు, నలుగురు అధికారులు ఫీల్డ్‌లోకి వచ్చారు. అనంతరం గాల్లో ఎగురువేసిన కాయిన్ గడ్డిలో నిటారుగా నిలబడి పోయింది. దాంతో ఇరు జట్ల కెప్టెన్లు, అధికారులు నవ్వుకుంటూ మరోసారి ఆ కాయిన్ తీసుకుని టాస్ వేశారు. ఇలా ముందుగా టాస్ వేసిన కాయిన్ ఎడ్జ్ గా పడటంతో ఆ మ్యాచ్‌కు ఆరంభానికి కాస్త ఆలస్యమైంది. ఈ మ్యాచ్‌లో కొలంబియా 2-1 తేడాతో గెలిచి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.. కొలంబియా తరఫున కార్లోస్ బాకా, జేమ్స్ రోడ్రిగ్వేజ్ తలో గోల్స్ చేసి విజయంలో సహకరించారు.ఆపై పరాగ్వే 71వ నిమిషంలో గోల్ మాత్రమే చేయడంతో ఓటమి తప్పలేదు.


