అమెరికా సంచలన విజయం.. ఫిఫా చరిత్రలోనే | USA Achieve Historic First With 4-1 Drubbing Of Paraguay | Sakshi
Sakshi News home page

FIFA World Cup 2026: అమెరికా సంచలన విజయం.. ఫిఫా చరిత్రలోనే

Jun 13 2026 10:06 AM | Updated on Jun 13 2026 10:52 AM

USA Achieve Historic First With 4-1 Drubbing Of Paraguay

ఫిఫా ప్రపంచకప్ 2026లో తమ తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య అమెరికా చారిత్రత్మక విజయాన్ని అందుకుంది.  లాస్ ఏంజిల్స్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన‌ గ్రూప్‌-డి మ్యాచ్‌లో పరాగ్వేను 4-1 తేడాతో అమెరికా చిత్తు చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కు యూఎస్ఎ ఆధిపత్యం చెలాయించింది.

మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే పరాగ్వే ఆటగాడు డామియన్ బొబాడిల్లా చేసిన పొరపాటు అమెరికాకు క‌లిసొచ్చింది. బొబాడిల్లా ప్రత్యర్థి పాస్‌ను అడ్డుకునే క్రమంలో బంతిని తానే స్వయంగా నెట్‌లోకి పంపి 'ఓన్ గోల్' చేశాడు. దీంతో అమెరికా 1-0తో ముందంజ వేసింది.

బలోగన్ జోరు..
ఆ తర్వాత 28 నిమిషంలో అమెరికా స్ట్రైకర్ ఫోలారిన్ బలోగన్ అద్భుతమైన పాస్‌ను అందుకుని, బంతిని సునాయాసంగా నెట్‌లోకి పంపాడు. దీంతో అమెరికా సంబరాల్లో మునిగిపోయింది. ఇక్కడే ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. రిఫరీ డానీ మాకెలీ ఆ గోల్‌ను  'అంపైర్ ఆఫ్‌సైడ్'గా ప్రకటించి తిరస్కరించాడు.

అయినప్పటికి బాలోగన్ ఏమాత్రం నిరాశ పడలేదు. కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే (31వ నిమిషంలో) బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపి స్కోరును 2-0కు చేర్చాడు. అయితే ఫస్ట్ హాఫ్‌లో ఇంజ్యురీ టైమ్ పేరిట 5 నిమిషాలు అదనంగా కేటాయించారు. ఈ సమయం అమెరికాకు కలిసొచ్చింది. బలోగన్  మరో సూపర్‌ గోల్‌తో మెరిశాడు. దీంతో ఫస్టాఫ్ ముగిసేసరికి అమెరికా 3-0తో పూర్తి ఆధిక్యంలో నిలిచింది.

ఇక సెకెండ్ హాఫ్‌లో పుంజుకునేందుకు పరాగ్వే గట్టిగా ప్రయత్నించింది. ఈ క్రమంలో 73వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ 'మౌరిసియో' పరాగ్వే తరఫున తొలి గోల్ సాధించి ఆశలు రేకెత్తించాడు. అయితే ఆ ఆతర్వాత  డిఫెండర్లు అప్రమత్తంగా వ్యవహరించి ఆ తర్వాత పరాగ్వేకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. 

మ్యాచ్ ఆఖరిలో అమెరికాకు చెందిన జియోవన్నీ రేనా అద్భుతమైన గోల్‌ను సాధించి 4-1 ఆధిక్యాన్ని అందించాడు. కాగా  ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో యూఎస్‌ఎ నాలుగు గోల్స్ సాధించడం ఇదే మొదటిసారి.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement