చరిత్ర సృష్టించిన సెనెగల్‌ | Senegal Become Scripts History Achieve Massive FIFA World Cup Feat | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన సెనెగల్‌

Jun 27 2026 8:48 AM | Updated on Jun 27 2026 9:04 AM

Senegal Become Scripts History Achieve Massive FIFA World Cup Feat

సెనెగల్‌ ఫుట్‌బాల్‌ జట్టు చరిత్ర సృష్టించింది. ఫిఫా ప్రపంచకప్‌ టోర్నమెంట్లో ఓ మ్యాచ్‌లో ఐదు గోల్స్‌ కొట్టిన తొలి సౌతాఫ్రికన్‌ జట్టుగా నిలిచింది. గ్రూప్‌- ‘ఐ’లో భాగంగా సెనెగల్‌ శుక్రవారం అర్ధ రాత్రి దాటిన తర్వాత ఇరాక్‌తో తలపడింది.

చావోరేవో
నాకౌట్‌ దశకు చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో సెనెగల్‌ అద్భుత ప్రదర్శన కనబరిచింది. చావోరేవో తేల్చుకునే క్రమంలో ఇరాక్‌ను 5-0 తేడాతో చిత్తు చేసి ఏకపక్ష విజయం సాధించింది. 

తద్వారా గ్రూప్‌- ‘ఐ’లో మూడో స్థానంలో నిలిచి నాకౌట్‌ దశకు అర్హత సాధించింది.  కాగా గ్రూప్‌- ‘ఐ’ టాపర్‌గా ఫ్రాన్స్‌.. రెండో స్థానంలో నిలిచిన నార్వే ఇప్పటికే నాకౌట్‌లో అడుగుపెట్టాయి. ఇరాక్‌ ఎలిమినేట్‌ అయింది.

ఆది నుంచి ఆధిపత్యం
ఇక సెనెగల్‌- ఇరాక్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. టొరంటో వేదికగా ఆట మొదలైన కాసేపటికే సెనెగల్‌ తమ వేట మొదలుపెట్టింది. నాలుగో నిమిషంలో హబీబ్‌ డియారా గోల్‌ కొట్టి శుభారంభం అందించాడు.

ఆ తర్వాత చాలా సేపటి వరకు ఇరుజట్లు డిఫెండ్‌ చేసుకుంటూ పోయాయి. ఈ క్రమంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఇస్మాలియా సర్‌ 56వ నిమిషంలో గోల్‌ కొట్టగా.. పేప్‌ గయే డబుల్‌ బొనాంజా అందించాడు. 59, 71వ నిమిషంలో గోల్స్‌ కొట్టాడు. ఇక 82వ నిమిషంలో ఇలిమన్‌ ఎన్డియాయే గోల్‌ కొట్టడంతో 5-0తో సెనెగల్‌ ఇరాక్‌ను చిత్తు చేసింది.

చదవండి: ఐర్లాండ్‌ దెబ్బ కొట్టింది

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement