ఎంబపే జోరు.. క్వార్టర్‌ ఫైనల్లో మొరాకో, ఫ్రాన్స్‌ | France ousts Paraguay after World Cup Round of 16 kicks off with Morocco rout of Canada] | Sakshi
Sakshi News home page

ఎంబపే జోరు.. క్వార్టర్‌ ఫైనల్లో మొరాకో, ఫ్రాన్స్‌

Jul 5 2026 8:07 AM | Updated on Jul 5 2026 8:07 AM

France ousts Paraguay after World Cup Round of 16 kicks off with Morocco rout of Canada]

ఫిఫా ప్రపంచకప్‌ 2026లో మొరాకో, ఫ్రాన్స్‌ జట్లు క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. తొలి రౌండ్‌ ఆఫ్‌ 16 మ్యాచ్‌లో సహా ఆతిథ్య జట్టు కెనడాపై మొరాకో.. పరాగ్వేపై ఫ్రాన్స్‌ గెలుపొందాయి. మొరాకో కెనడాపై 3-0 గోల్స్‌ తేడాతో గెలుపొందగా.. ఫ్రాన్స్‌ పరాగ్వేను 1-0 గోల్స్‌తో చిత్తు చేసింది.

చరిత్ర సృష్టించిన మొరాకో
కెనడాపై గెలుపుతో మొరాకో చరిత్ర సృష్టించింది. వరుసగా రెండు ప్రపంచకప్‌లలో క్వార్టర్స్‌కు చేరిన తొలి ఆఫ్రికన్‌ జట్టుగా రికార్డు నెలకొల్పింది. మొరాకో ఈ ఘనత సాధించడానికి అజెద్దీన్‌ ఔనాహీ (Azzedine Ounahi) తోడ్పడ్డాడు. 

ఈ మ్యాచ్‌లో అజెద్దీన్‌ రెండు గోల్స్‌తో మొరాకోకు చారిత్రక విజయాన్ని అందించాడు. అదనపు సమయంలో సూఫియాన్‌ రహిమీ (Soufiane Rahimi) మరో గోల్‌ చేసి మొరాకోను క్వార్టర్స్‌కు చేర్చాడు.

ఎంబపే జోరు
ప్రస్తుత ప్రపంచకప్‌లో ఫ్రాన్స్‌ కెప్టెన్‌ కైలియన్‌ ఎంబపే జోరు కొనసాగుతోంది. వరుసగా అతడు మరో మ్యాచ్‌లో గోల్‌ సాధించి తన జట్టును గెలిపించాడు. ఈ గోల్‌తో అతడు మెస్సీతో సమానంగా 7 గోల్స్‌తో గోల్డెన్‌ బూట్‌ రేసులో ముందున్నాడు. పరాగ్వేతో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఎంబపే 70వ నిమిషంలో పెనాల్టీ ద్వారా గోల్‌ చేసి మ్యాచ్‌ ఫలితాన్ని నిర్ణయించాడు.

క్వార్టర్స్‌లో ఫ్రాన్స్‌-మొరాకో పోరు
ఈ విజయాల తర్వాత జూలై 9న బోస్టన్‌లో జరిగే తొలి క్వార్టర్‌ ఫైనల్లో ఫ్రాన్స్‌, మొరాకో తలపడనున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement