రొనాల్డో కథ ముగిసింది.. ప్రీ క్వార్టర్స్‌లో పోర్చుగల్‌ ఓటమి | FIFA World Cup 2026, Spain Beat Portugal In Super 16 Match, Check Out Score Details And Highlights | Sakshi
Sakshi News home page

రొనాల్డో కథ ముగిసింది.. ప్రీ క్వార్టర్స్‌లో పోర్చుగల్‌ ఓటమి

Jul 7 2026 7:04 AM | Updated on Jul 7 2026 9:38 AM

FIFA World cup 2026: Spain beat portugal in super 16 match

ఫిఫా వరల్డ్‌‍కప్‌ 2026లో పోర్చుగల్‌ ప్రయాణం ముగిసింది. ఇవాళ జరిగిన ప్రీ క్వార్టర్‌ ఫైనల్లో ఆ జట్టు స్పెయిన్‌ చేతిలో 0-1 గోల్స్‌ తేడాతో ఓడింది. తద్వారా నాకౌట్‌ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ గెలుపుతో స్పెయిన్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు అడ్వాన్స్‌ అయ్యింది.

డల్లాస్‌ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు హోరీహోరీగా పోరాడినా నిర్ణీత సమయంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. దీంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది. అదనపు సమయంలో(91వ నిమిషం) ప్రత్యామ్నాయ ఆటగాడిగా బరిలోకి దిగిన మికెల్ మెరినో కీలక గోల్ చేసి స్పెయిన్‌కు ఆధిక్యాన్ని అందించాడు. ఫెరాన్ టొరెస్ అందించిన అద్భుతమైన పాస్‌ను మెరినో సద్వినియోగం చేసుకొని గోల్‌గా మలిచాడు.

ఆ గోల్‌తో స్పెయిన్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లగా, మిగిలిన సమయంలో పోర్చుగల్‌ స్కోర్‌ను సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా స్పెయిన్ రక్షణను ఛేదించలేకపోయింది.

ఈ విజయంతో స్పెయిన్ ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా తన అద్భుతమైన డిఫెన్సివ్ రికార్డును కొనసాగించింది. క్వార్టర్‌ఫైనల్లో స్పెయిన్ అమెరికా లేదా బెల్జియంతో తలపడనుంది.

రొనాల్డో వరల్డ్‌కప్‌ ప్రయాణానికి ముగింపు
మరోవైపు, ఈ ఓటమితో పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో ప్రపంచకప్ ప్రయాణం కూడా ముగిసినట్లైంది. ప్రస్తుతం రొనాల్డో వయసు 41 సంవత్సరాలు. ఏ లెక్కన చూసుకున్న అతడు మరో ప్రపంచకప్‌ ఆడలేదు. దీంతో అనధికారికంగా రొనాల్డో వరల్డ్‌కప్‌ జర్నీ ముగిసిందనుకోవాలి. ఫుట్‌బాల్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా గుర్తింపు పొందిన రొనాల్డోకు ప్రపంచకప్ ట్రోఫీ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement