ఆఖరి నిమిషంలో గోల్‌.. ప్రిక్వార్ట‌ర్స్‌కు దూసుకెళ్లిన బ్రెజిల్‌ | Brazil Enters Round-16 Beat Japan FIFA World Cup 2026 | Sakshi
Sakshi News home page

ఆఖరి నిమిషంలో గోల్‌.. ప్రిక్వార్ట‌ర్స్‌కు దూసుకెళ్లిన బ్రెజిల్‌

Jun 30 2026 12:51 AM | Updated on Jun 30 2026 4:42 AM

Brazil Enters Round-16 Beat Japan FIFA World Cup 2026

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో మాజీ చాంపియ‌న్ బ్రెజిల్ ప్రిక్వార్ట‌ర్స్ (రౌండ్ ఆఫ్ 16)లో అడుగుపెట్టింది. సోమ‌వారం రాత్రి రౌండ్‌ ఆఫ్‌ 32లో భాగంగా జ‌పాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ 2-1 తేడాతో విజ‌యం సాధించింది. బ్రెజిల్ త‌ర‌ఫున కేస్‌మిరో (56వ నిమిషం), గాబ్రియెల్ మార్టినెల్లి (90+6వ నిమిషం) గోల్స్ కొట్టారు. ఇక జ‌పాన్ త‌ర‌ఫున కైషూ సానో 29వ నిమిషంలో గోల్ సాధించాడు. 

ఆట తొలి అర్ధ‌భాగంలో జ‌పాన్ పూర్తి ఆధిప్య‌తం క‌న‌బ‌రిచింది. గాయంతో బ్రెజిల్ స్టార్ నెయ్‌మ‌ర్ జూనియ‌ర్ జ‌పాన్‌తో మ్యాచ్‌కు కూడా దూరంగానే ఉన్నాడు. దీంతో ఆరంభం నుంచి బ్రెజిల్ కాస్త త‌డ‌బ‌డింది. అయితే జపాన్ మాత్రం బ్రెజిల్‌పై ప‌దే ప‌దే దాడులు చేసింది. ఈ నేప‌థ్యంలో 29వ నిమిషంలో కైషూ సానో జ‌పాన్‌కు గోల్ అందించాడు. 

దీంతో హాఫ్ టైమ్ ముగిసేస‌రికి జ‌పాన్ 1-0తో బ్రెజిల్‌పై ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో అర్ధ‌భాగంలో బ్రెజిల్ డిఫెన్స్ మోడ్ నుంచి బ‌య‌టకు వ‌చ్చి దూకుడును ప్ర‌ద‌ర్శించింది. దీంతో ఆట మొద‌లైన కాసేప‌టికే 56వ నిమిషంలో కేస్‌మిరో బ్యాక్ హెడ‌ర్ షాట్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించి 1-1తో స్కోరును స‌మం చేశాడు. 

ఆ త‌ర్వాత బ్రెజిల్ ప‌లుమార్లు జ‌పాన్ గోల్ పోస్టుపై దాడులు చేసినప్ప‌టికీ స‌మ‌ర్థంగా అడ్డుకుంది. దీంతో నిర్ణీత స‌మ‌యం ముగిసేస‌రికి ఇరుజ‌ట్లు 1-1తో స‌మంగా ఉండ‌డంతో స్టాపేజీ టైమ్‌ (ఇంజ్యూరీ టైమ్‌) ఇచ్చారు. స్టాపేజీ టైమ్‌ బ్రెజిల్‌కు క‌లిసి వ‌చ్చింది. స‌బ్‌స్టిట్యూట్‌గా వ‌చ్చిన గాబ్రియెల్ మార్టినెల్లి గుమెరాస్ నుంచి పాస్ అందుకొని డీప్ నుంచి బంతిని గోల్‌పోస్ట్‌కు త‌ర‌లించి బ్రెజిల్‌కు రెండో గోల్ అందించ‌డంతో పాటు విజ‌యాన్ని సాధించి పెట్టాడు. ఇప్పటి వరకు జరిగిన 23 ప్రపంచకప్‌లలో ఆడిన బ్రెజిల్‌ జట్టు 20వసారి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. ఇక రౌండ్ ఆఫ్ 16లో బ్రెజిల్.. ఐవ‌రీ కోస్ట్‌, నార్వే మ‌ధ్య విజేత‌తో త‌ల‌ప‌డనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement