19తో ముడిపడ్డ మెస్సీ-యమాల్ అనుబంధం | FIFA World Cup 2026 Final, The Amazing Story Behind The Number 19 Connecting Lionel Messi And Lamine Yamal | Sakshi
Sakshi News home page

19తో ముడిపడ్డ మెస్సీ-యమాల్ అనుబంధం

Jul 18 2026 11:15 AM | Updated on Jul 18 2026 11:34 AM

FIFA World cup 2026 Final: crazy coincidence between messi, lamine yamal and 19 number

ఫిఫా వరల్డ్‌కప్‌ 2026 తుది అంకానికి చేరింది. అర్జెంటీనా-స్పెయిన్‌ జట్లు ఫైనల్‌కు చేరాయి. జులై 19న న్యూజెర్సీలోని మెట్‌లైఫ్‌ స్టేడియంలో ఈ రెండు జట్లు టైటిల్‌ కోసం పోటీపడతాయి. ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం ఆదివారం మధ్యరాత్రి (సోమవారం) 12:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌ కోసం ప్రపంచవ్యాప్త క్రీడాభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇరు జట్లకు చెందిన స్టార్‌ ఆటగాళ్లు లియోనల్‌ మెస్సీ (అర్జెంటీనా), లమీన్‌ యమాల్‌ (స్పెయిన్‌) మధ్య కొన్ని యాదృచ్ఛిక విషయాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ముఖ్యంగా 19 సంఖ్యతో మెస్సీ-యమాల్‌కు ముడిపడిన అనుబంధం ఫుట్‌బాల్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

  • 2007లో యునిసెఫ్ నిర్వహించిన ఛారిటీ ఫోటోషూట్‌లో అప్పటి 20 ఏళ్ల మెస్సీ, ఆరు నెలల చిన్నారి యమాల్‌కు స్నానం చేయించాడు. అదే చిన్నారి ఇప్పుడు 2026 ప్రపంచకప్ ఫైనల్లో మెస్సీకి ప్రత్యర్థిగా నిలబడ్డాడు.

  • ఈ ఫోటోషూట్‌కు సరిగ్గా 19 ఏళ్ల తర్వాత జులై 19న జరిగే ప్రపంచకప్ ఫైనల్లో మెస్సీ-యమాల్‌ ఒకరినొకరు ఎదుర్కోనున్నారు. ప్రపంచకప్‌ ఫైనల్‌కు కొద్ది రోజుల ముందే (జూలై 13) యమాల్ తన 19వ పుట్టినరోజు జరుపుకున్నాడు.

  • మెస్సీ, యమాల్‌ తమ మొదటి ప్రపంచకప్ గోల్‌ను 18 ఏళ్ల వయసులో, 19వ నంబర్‌ జెర్సీ ధరించి నమోదు చేయడం మరింత ఆశ్చర్యకరం.

ఒకప్పుడు తాను స్నానం చేయించిన చిన్నారి... ఇప్పుడు ప్రపంచకప్ కిరీటం కోసం తనతో పోటీపడటాన్ని మెస్సీ సహా ప్రపంచమంతా నమ్మలేకపోతుంది. ఈ విషయాలు ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత అరుదైన యాదృచ్ఛికాలుగా నిలిచిపోతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement