నాకౌట్‌కు క్రొయేషియా.. బతికిపోయిన పోర్చుగల్‌ | Croatia Enters Knock Out-Portugal Lucky To Escape Loss Vs Colombia | Sakshi
Sakshi News home page

నాకౌట్‌కు క్రొయేషియా.. బతికిపోయిన పోర్చుగల్‌

Jun 28 2026 8:24 AM | Updated on Jun 28 2026 10:35 AM

Croatia Enters Knock Out-Portugal Lucky To Escape Loss Vs Colombia

ఫిఫా ప్రపంచకప్‌లో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో క్రొయేషియా జూలు విదిల్చింది. గ్రూప్‌-ఎల్‌లో ఘనాతో జరిగిన మ్యాచ్‌లో క్రొయే షియా 2-1 తేడాతో విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో కొలంబియాతో డ్రా చేసుకున్న పోర్చుగల్‌ కూడా తదుపరి రౌండ్‌కు అర్హత సాధించడం గమనార్హం. క్రొయేషియా త‌రఫున ఆట 31వ నిమిషంలో పీట‌ర్ సుకిక్ తొలి గోల్ కొట్టి 1-0తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. 


ఆట రెండో అర్ధ‌భాగంలో ఘనా ప్లేయ‌ర్ డెర్రిక్ లుకాస్సెన్ 73వ నిమిషంలో గోల్ కొట్టి స్కోరును స‌మం చేశాడు. ఇక మ్యాచ్ డ్రాగా ముగుస్తుంద‌నుకున్న త‌రుణంలో చివ‌రి క్వార్ట‌ర్‌లో (ఆట 83వ నిమిషంలో) నికోలా వ్లాసిక్ మ‌రో గోల్ కొట్ట‌డంతో క్రొయేషియా 2-1తో నిలిచి విజ‌యాన్ని అందుకుంది. అయితే మ్యాచ్‌లో ఓడిన‌ప్ప‌టికీ క్రొయేషియాతో పాటు ఘ‌నా కూడా నాకౌట్‌కు అర్హ‌త సాధించింది. అంత‌క‌ముందు ఇదే గ్రూప్‌లో ప‌నామాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2-0 తేడాతో విజ‌యాన్ని అందుకొని ఏడు పాయింట్ల‌తో గ్రూప్ టాప‌ర్‌గా నిలిచింది.

నిరాశ‌ప‌రిచిన రొనాల్డో..
కొలంబియాతో మ్యాచ్‌ను డ్రా చేసుకోవ‌డం ద్వారా పోర్చుగ‌ల్ 5 పాయింట్ల‌తో రెండో స్థానంలో నిల‌వ‌గా, 7 పాయింట్ల‌తో ఉన్న కొలంబియా గ్రూప్ టాప‌ర్‌గా నాకౌట్‌లో అడుగుపెట్టింది. నిర్ణీత స‌మ‌యం ముగిసేలోపు ఇరుజ‌ట్లు గోల్ కొట్ట‌డంలో విఫ‌ల‌మ‌య్యాయి. అయితే తొలి అర్ధ‌భాగంలో దూకుడుగా ఆడిన క్రిస్టియానో రొనాల్డో త‌న ఫెవ‌రేట్ ఓవ‌ర్‌హెడ్ కిక్‌తో బంతిని గోల్ పోస్ట్‌లోకి త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేయ‌డం హైలైట్‌గా నిలిచింది. 

అయితే కొలంబియా గోల్ కీప‌ర్ దానిని స‌మ‌ర్థంగా అడ్డుకున్నాడు. ఇక రెండో హాఫ్‌లో ఇరుజ‌ట్లు ప‌దే ప‌దే గోల్ పోస్టుల‌పై దాడులు చేసుకున్న‌ప్ప‌టికీ లాభం లేక‌పోయింది. ఈ మ్యాచ్‌లో ఒక‌వేళ పోర్చుగ‌ల్ ఓడిపోయి ఉంటే మూడో స్థానంలో నాకౌట్‌లో అడుగుపెట్టేది. ఇక నాకౌట్‌లో పోర్చుగల్‌ జట్టు క్రొయేషియాతో అమీతుమీకి సిద్ధమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement