ప్రీ క్వార్టర్స్‌కు కొలంబియా.. ఘనాపై ఘన విజయం | Colombia Beat Ghana To Enter FIFA World Cup 2026 Round Of 16, Check Out Full Knockout Schedule Here | Sakshi
Sakshi News home page

ప్రీ క్వార్టర్స్‌కు కొలంబియా.. ఘనాపై ఘన విజయం

Jul 4 2026 10:17 AM | Updated on Jul 4 2026 10:55 AM

Colombia see off Ghana to head back to World Cup round of 16

ఫిఫా వరల్డ్ కప్‌-2026లో కొలంబియా జట్టు కీలక విజయం సాధించింది. కెన్సాస్ సిటీలోని ఆర్రోహెడ్ స్టేడియంలో ఇవాళ జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో ఘనాపై 1-0 గోల్స్‌ తేడాతో గెలిచి, రౌండ్ ఆఫ్ 16కి అర్హత సాధించింది.

ఈ మ్యాచ్ ఆరంభం నుంచే కొలంబియా దూకుడుగా ఆడింది. 14వ నిమిషంలో జాన్ ఆరియాస్ చేసిన గోల్ మ్యాచ్‌ ఫలితాన్ని నిర్ణయించింది. లూయిస్ సువారెజ్ అందించిన కచ్చితమైన క్రాస్‌ను ఆరియాస్ సమర్థంగా ఫినిష్ చేసి జట్టుకు ఆధిక్యం అందించాడు. ఈ గోల్ తర్వాత కొలంబియా ఆటపై పూర్తి నియంత్రణ సాధించింది. చివరి అదే జోరు కొనసాగించి ఘనాను ఇంటికి పంపింది. రౌండ్ ఆఫ్ 16లో కొలంబియా స్విట్జర్లాండ్‌తో తలపడనుంది.

ఈ మ్యాచ్‌తో రౌండ్‌ ఆఫ్‌ 32 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇవాళ రాత్రి నుంచి రౌండ్‌ ఆఫ్‌ 16 మ్యాచ్‌లు మొదలవుతాయి. రాత్రి 10:30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌లో కెనడా, మొరాకో పోటీపడతాయి. మధ్యరాత్రి 2:30 గంటల​కు ఫ్రాన్స్‌, పరాగ్వే అమీతుమీ తేల్చుకుంటాయి. మిగతా రౌండ్‌ ఆఫ్‌ 16 మ్యాచ్‌లు ఇలా ఉన్నాయి.

జులై 6 మధ్య రాత్రి 1:30 గంటలకు బ్రెజిల్‌ వర్సెస్‌ నార్వే
జులై 6 తెల్లవారు జామున 5:30 గంటలకు మెక్సికో వర్సెస్‌ ఇంగ్లండ్‌
జులై 7 మధ్య రాత్రి 12:30 గంటలకు పోర్చుగల్‌ వర్సెస్‌ స్పెయిన్‌
జులై 7 తెల్లవారు జామున 5:30 గంటలకు యూఎస్‌ఏ వర్సెస్‌ బెల్జియం
జులై 7 రాత్రి 9:30 గంటలకు అర్జెంటీనా వర్సెస్‌ ఈజిప్ట్‌
జులై 8 మధ్య రాత్రి 1:30 గంటలకు స్విట్జర్లాండ్‌ వర్సెస్‌ కొలంబియా

 

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement