నాకౌట్ అయిన సెనెగ‌ల్‌.. బెల్జియంను వ‌రించిన అదృష్టం | Penalty To-Belgium In-Extra Time Beat-Senegal Enters R-16-FIFA WC | Sakshi
Sakshi News home page

నాకౌట్ అయిన సెనెగ‌ల్‌.. బెల్జియంను వ‌రించిన అదృష్టం

Jul 2 2026 4:55 AM | Updated on Jul 2 2026 5:14 AM

Penalty To-Belgium In-Extra Time Beat-Senegal Enters R-16-FIFA WC

ఫిఫా ప్రపంచకప్‌లో బెల్జియం ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. సెనెగల్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో బెల్జియం 3-2 తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. దీంతో సెనెగ‌ల్ ఫిఫా నుంచి నాకౌట్ అయింది. బెల్జియం తరఫున రొమెలు లుకాకు (86వ నిమిషం), కెప్టెన్‌ యురి టిలేమన్స్ (89, 120+5వ నిమిషం)లో డబుల్ గోల్స్‌తో మెరిశాడు.  

ఇక సెనెగల్ తరఫున హబిబ్ డియారా (24వ నిమిషం), ఇస్మాయిలా సర్ (51వ నిమిషం) గోల్స్ సాధించారు. నిర్ణీత సమయం ముగిసేలోగా ఇరుజట్లు 2-2తో సమానంగా నిలిచాయి. ఇంజ్యూరీ టైమ్‌లోనూ గోల్ కొట్టలేదు. అయితే ఎక్స్‌ట్రా టైమ్‌లో టిలేమన్స్‌ను బంతిని కొట్ట‌కుండా సెనెగ‌ల్ ఆట‌గాడు లామినే క‌మారా ఉద్దేశ‌పూర్వ‌కంగా కింద ప‌డేసిన‌ట్లు తేల‌డంతో రిఫ‌రీ బెల్జియంకు పెనాల్టీ కిక్ అవ‌కాశ‌మిచ్చారు.

దీంతో త‌న‌కు ల‌భించిన పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలచడంలో టిలేమ‌న్స్ స‌క్సెస్ అయ్యాడు. దీంతో బెల్జియం విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. ఇక బెల్జియం.. ప్రిక్వార్ట‌ర్స్‌లో అమెరికా, బోస్నియా అండ్ హెర్జెగొవినా మ‌ధ్య మ్యాచ్ విజేత‌తో త‌ల‌ప‌డ‌నుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement