బ్రస్సెల్స్: బెల్జియంలో మురుగునీటి కాల్వల పునరుద్ధరణ పనులు చేస్తున్న కార్మీకులకు దాదాపు రూ.98 కోట్ల విలువైన బంగారం దొరికింది. రాజధాని బ్రస్సెల్స్‌లోని సింట్–గిల్లిస్–డెండర్‌మాండేలో భూగర్భ డ్రైనేజీ పైపుల పునరుద్ధరణ కోసం మురికికాల్వ తవ్వుతుండగా కార్మీకులకు బంగారు నాణేలు కనిపించాయి. చిన్న నాణేలు కావడంతో అంతగా పట్టించుకోలేదు.
తవ్వకాలు కొనసాగించగా మరిన్ని బంగారు కడ్డీలు బయటపడ్డాయి. ఆ ప్రదేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్న అధికారులు నిధిని బ్రస్సెల్స్‌లోని ఒక సురక్షిత కేంద్రానికి తరలించారు. నిధి మూలాలపై దర్యాప్తు చేస్తున్నారు. నిధి దొరికిన స్థలం 19వ శతాబ్దం చివరలో బ్రూవరీ యజమాని థియోఫిలస్ వాన్ అస్చే కోసం నిర్మించిన ఒక గొప్ప విల్లా. నేలమాళిగ గోడ లోపల ఒక సంచిలో ఈ నిధిని భద్రపరిచారు. ఇందులోనే ఇవన్నీ దొరికాయి.


