సౌతాఫ్రికా హృదయం ముక్కలు | FIFA World Cup 2026: Canada Beat South Africa Enters Round 16 | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికా హృదయం ముక్కలు

Jun 29 2026 10:51 AM | Updated on Jun 29 2026 10:58 AM

FIFA World Cup 2026: Canada Beat South Africa Enters Round 16

ఫిఫా ప్రపంచకప్‌-2026 టోర్నీలో సౌతాఫ్రికా ప్రయాణం ముగిసిపోయింది. రౌండ్‌ 32లో భాగంగా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కెనడాను సౌతాఫ్రికా నిలువరించలేకపోయింది. ఫలితంగా కెనడా చేతిలో 1-0తో ఓటమి పాలైంది.

ఈ క్రమంలో కెనడా రౌండ్‌ 16కు దూసుకువెళ్లగా.. సౌతాఫ్రికా టోర్నీ నుంచి నిష్క్రమించింది. లాస్‌ ఏంజెలెస్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంజూరీ టైమ్‌లో కెనడా మిడ్‌ఫీల్డర్‌ స్టీఫెన్‌ ఉస్తాకియో అద్భుత రీతిలో గోల్‌ కొట్టాడు. దీంతో కెనడా 1-0తో విజయం సాధించగా.. సౌతాఫ్రికా హృదయం ముక్కలైంది. 

తొలిసారి..
ఇక కెనడా రౌండ్‌ 16 మ్యాచ్‌లో భాగంగా నెదర్లాండ్స్‌ లేదంటే మోరాకోతో తలపడనుంది.  కాగా ఆతిథ్య దేశమైన కెనడా గ్రూప్‌ దశలో అంతగా ఆకట్టుకోలేకపోయింది. గ్రూప్‌-బిలో భాగంగా బోస్నియాతో మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకున్న కెనడా.. ఖతార్‌పై 6-0తో విజయం సాధించింది. అయితే, ఆఖరి మ్యాచ్‌లో భాగంగా స్విట్జర్లాండ్‌ చేతిలో 2-1తో ఓడిపోయింది.

అయితే, బోస్నియా, ఖతార్‌ పేలవ ప్రదర్శన కారణంగా గ్రూప్‌-బిలో రెండో స్థానంలో నిలిచిన కెనడా.. నాకౌట్‌కు అర్హత సాధించింది. ఇక నాకౌట్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఎలిమినేట్‌ చేసి మరో ముందడుగు వేసింది. కాగా కెనడా నాకౌట్‌ మ్యాచ్‌లో విజయం సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement