కేప్ వెర్డే కెప్టెన్‌పై లైంగిక ఆరోపణలు! | Cape Verde captain Ryan Mendes under police investigation in Auckland | Sakshi
Sakshi News home page

Fifa World Cup: కేప్ వెర్డే కెప్టెన్‌పై లైంగిక ఆరోపణలు!

Jun 29 2026 9:24 PM | Updated on Jun 29 2026 9:24 PM

Cape Verde captain Ryan Mendes under police investigation in Auckland

ఫిఫా ప్రపంచకప్ 2026లో ఆఫ్రికా ద్వీప దేశం కేప్ వెర్డే సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో కేప్ వెర్డే వరుస డ్రాలతో రౌండ్ ఆఫ్ 32 కి దూసుకెళ్లింది. అయితే  అర్జెంటీనాతో నాకౌట్‌ మ్యాచ్​కు ముందు కేప్ వెర్డేకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రేయాన్ మెండిస్‌పై అత్యాచార ఆరోపణలు రావడం ప్రస్తుతం ఫుట్‌బాల్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశమైంది. 

ఈ ఏడాది మార్చిలో న్యూజిలాండ్‌లో జరిగిన ఒక టోర్నీ సందర్భంగా.. జట్టుకు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన బ్రెజిల్ మహిళపై మెండిస్ హోటల్ గదిలో లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 

ఆక్లాండ్‌ పోలీసులకు సదరు మహిళ ఫిర్యాదు చేసినట్లు బ్రెజిల్‌కు చెందిన 'గ్లోబో' మీడియా సంస్థ తమ కథనంలో పేర్కొంది. బ్రెజిల్ మహిళ ఆరోపణలపై ఫిఫా స్పందించింది.  ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నామని, న్యూజిలాండ్‌ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఫిఫా తెలిపింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement