కేప్ వెర్డె సంచలనం.. తొలిసారి ప్రపంచకప్ టోర్నీకి అర్హత
ప్రాయ (కేప్ వెర్డె): కేవలం 5 లక్షల 25 వేల జనాభా కలిగిన ఆఫ్రికా దేశం కేప్ వెర్డె అద్భుతం చేసింది. వచ్చే ఏడాది అమెరికా, కెనడా, మెక్సికోలలో జరిగే ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీకి కేప్ వెర్డె అర్హత సాధించింది. ఆఫ్రికా జోన్ గ్రూప్ ‘డి’లో భాగంగా ఇస్వాతిని జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేప్ వెర్డె 3–0 గోల్స్ తేడాతో గెలిచింది. తొలిసారి అర్హతతద్వారా గ్రూప్ ‘డి’ విజేత హోదాలో ప్రపంచకప్ టోర్నీ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఐస్లాండ్ తర్వాత ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందిన అతి తక్కువ జనాభా కలిగిన దేశంగా కేప్ వెర్డె గుర్తింపు పొందింది. 2018లో ఐస్లాండ్ జట్టు (3 లక్షల 25 వేల జనాభా) ప్రపంచకప్ టోర్నీకి తొలిసారి అర్హత పొందింది. మరో మూడు బెర్త్లుఇక 2026 ప్రపంచకప్ టోర్నీలో తొలిసారి 48 దేశాలు పాల్గొంటుండగా... ఆఫ్రికా జోన్‌కు 9 బెర్త్‌లు కేటాయించారు. ఆఫ్రికా జోన్ నుంచి ఇప్పటి వరకు అల్జీరియా, కేప్ వెర్డె, ఈజిప్ట్, ఘనా, మొరాకో, ట్యూనిషియా జట్లు అర్హత సాధించాయి. మరో మూడు బెర్త్‌లు ఖరారు కావాల్సి ఉన్నాయి. ఇక కేప్ వెర్డె ప్రపంచకప్ టోర్నీకి తొలిసారి అర్హత సాధించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.CAPE VERDE, POPULATION 560,000, QUALIFY FOR A FIRST-EVER WORLD CUP 🇨🇻The second-smallest nation ever to achieve that feat. Every US state has a bigger population, yet the Blue Sharks are on their way to football's big dance 🦈Soak up these scenes 💙pic.twitter.com/aR2KMRLteE— Men in Blazers (@MenInBlazers) October 13, 2025