చిన్న దేశం.. అతిపెద్ద విజయం.. సరికొత్త చరిత్ర | Cape Verde unbeaten group stage smallest nation to reach knockouts | Sakshi
Sakshi News home page

చిన్న దేశం.. అతిపెద్ద విజయం.. సరికొత్త చరిత్ర

Jun 27 2026 11:54 AM | Updated on Jun 27 2026 1:40 PM

Cape Verde unbeaten group stage smallest nation to reach knockouts

ఫిఫా ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో సంచలనం నమోదైంది. తొలిసారి ఈ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించిన కేప్‌ వెర్డె అనూహ్య రీతిలో నాకౌట్‌లోనూ అడుగుపెట్టింది. అయితే, ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించకుండానే కేప్‌ వెర్డే తదుపరి దశకు చేరుకోవడం మరో విశేషం. అదెలా అంటారా?!

గెలవలేదు.. నిలువరించింది
గ్రూప్‌- ‘H’లో భాగంగా స్పెయిన్‌, ఉరుగ్వే, సౌదీ అరేబియా జట్లతో కలిసి కేప్‌ వెర్డె ఫిఫా ప్రపంచకప్‌ బరిలో దిగింది. ఈ క్రమంలో స్పెయిన్‌తో మ్యాచ్‌ (0-0)ను డ్రా చేసుకుని కేప్‌ వెర్డె తొలుత సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఉరుగ్వే (2-2)తో మ్యాచ్‌నూ డ్రా చేసుకుంది.

తాజాగా లీగ్‌ దశలో ఆఖరిగా సౌదీ అరేబియాతో హూస్టన్‌ వేదికగా తలపడ్డ కేప్‌ వెర్డే.. ఈ మ్యాచ్‌ను 0-0తో డ్రా చేసుకుంది. ఈ క్రమంలో కేప్‌ వెర్డె ఖాతాలో మూడు పాయింట్లు చేరాయి. గ్రూప్‌- H టాపర్‌గా స్పెయిన్‌ ఏడు పాయింట్లతో ఇప్పటికే నాకౌట్‌కు చేరగా.. కేప్‌ వెర్డే రెండో స్థానంలో నిలిచి నాకౌట్‌లో అడుగుపెట్టింది. 

అతి చిన్న దేశం
మూడింట ఒక్కో మ్యాచ్‌ గెలిచిన ఉరుగ్వే, సౌదీ అరేబియా టోర్నీ నుంచి నిష్క్రమించాయి. కాగా నాకౌట్‌ దశలో కేప్‌ వెర్డేకు అర్జెంటీనా రూపంలో అతిపెద్ద సవాలు ఎదురుకానుంది. 

ఇక పశ్చిమ ఆఫ్రికాలోని ఐలాండ్‌ అయిన కేప్‌ వెర్డే.. కాబో వెర్డె పేరుతో దేశంగా గుర్తింపు పొందింది. ఇక్కడి జనాభా కేవలం 5.30 లక్షలు మాత్రమే!.. అనూహ్య రీతిలో తొలిసారి ఫిఫా ప్రపంచకప్‌ టోర్నీకి అర్హత సాధించిన కాబో వెర్డె ఏకంగా నాకౌట్‌లోనూ అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. 

చదవండి: అభిషేక్‌ శర్మ హాఫ్‌ సెంచరీ రద్దు.. ఎందుకంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement