హాలండ్‌ ప్రపంచ రికార్డు.. ప్రిక్వార్ట‌ర్స్‌కు నార్వే | Erling-Haaland-Winning-Goal-Norway Beat Ivory Coast-Enters Round-16 | Sakshi
Sakshi News home page

హాలండ్‌ ప్రపంచ రికార్డు.. ప్రిక్వార్ట‌ర్స్‌కు నార్వే

Jul 1 2026 1:00 AM | Updated on Jul 1 2026 5:12 AM

Erling-Haaland-Winning-Goal-Norway Beat Ivory Coast-Enters Round-16

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో 28 ఏళ్ల తర్వాత నార్వే జ‌ట్టు ప్రిక్వార్ట‌ర్స్‌లో అడుగుపెట్టింది. రౌండ్ ఆఫ్ 32లో భాగంగా మంగ‌ళ‌వారం రాత్రి ఐవ‌రీ కోస్ట్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో నార్వే 2-1 తేడాతో విజ‌యం సాధించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. నార్వే త‌ర‌ఫున ఆంటోనియో నుసా (39వ నిమిషం), ఎర్లింగ్ హాలండ్ (86వ నిమిషం) గోల్స్ చేశారు.  

ఇక ఐవ‌రీ కోస్ట్ త‌ర‌ఫున అమ‌డ్ డియాల్లో (74వ నిమిషం) గోల్ సాధించాడు. ప్రిక్వార్ట‌ర్స్‌లో బ్రెజిల్‌తో నార్వే అమీతుమీ తేల్చుకోనుంది.  ఆట మొద‌లైన త‌ర్వాత తొలి హాఫ్‌కు ముందు నార్వేకు ఆంటోనియో గోల్ అందించాడు. రెండో అర్ధ‌భాగంలో ఐవ‌రీ కోస్ట్ త‌ర‌ఫున అమ‌డ్ డియాల్లో గోల్ చేసి ఆ జ‌ట్టు త‌ర‌ఫున‌ నాకౌట్‌లో తొలి గోల్ చేసిన ఆట‌గాడిగా నిలిచాడు. 

ఇక మ్యాచ్ డ్రా దిశ‌గా నడుస్తున్న స‌మ‌యంలో నార్వే స్టార్ స్ట్రైక‌ర్ ఎర్లింగ్ హాలండ్ 82వ నిమిషంలో త‌న స‌హ‌చ‌రుడు అందించిన పాస్‌ను ఏమాత్రం త‌ప్పు చేయ‌కుండా సింపుల్‌గా గోల్‌పోస్ట్‌లోకి పంపించి ఆధిక్యాన్ని 2-1కి పెంచాడు. ఆ త‌ర్వాత నిర్ణీత స‌మ‌యం ముగిసిన త‌ర్వాత ఇంజ్యూరీ టైమ్‌లో ఐవ‌రీ కోస్ట్ గోల్ చేయ‌డంలో విఫ‌లం కావ‌డంతో నార్వే విజ‌యాన్ని సాధించింది.

ఇక నార్వే స్టార్ ఎర్లింగ్ హాలండ్ ఐవ‌రీ కోస్ట్‌తో మ్యాచ్‌లో గోల్ చేయ‌డం ద్వారా అరుదైన రికార్డు సాధించాడు. తొలి ప్ర‌పంచ‌క‌ప్ ఆడుతున్న ఎర్లింగ్ హాలండ్ తాను ఆడిన ప్ర‌తీ మ్యాచ్‌లోనూ గోల్ కొట్ట‌డం విశేషం. ఈ నేప‌థ్యంలో త‌న‌ తొలి ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన‌ అన్ని మ్యాచ్‌ల్లో గోల్స్ సాధించిన హాలండ్‌.. గెర్డ్ ముల్ల‌ర్ (జ‌ర్మ‌నీ), యూసెబియో (పోర్చుగ‌ల్‌), జ‌స్ట్ ఫాంటైన్ (ఫ్రాన్స్‌) వంటి దిగ్గజ స్ట్రైక‌ర్ల స‌ర‌స‌న చోటు సంపాదించాడు. మొత్తం మీద నాలుగు మ్యాచ్‌ల్లో హాలండ్‌ ఆరు గోల్స్‌ చేశాడు. మ‌రోవైపు తొలిసారి నాకౌట్ మ్యాచ్ ఆడిన ఐవ‌రీ కోస్ట్ త‌న స్థాయిని మించి ప్ర‌ద‌ర్శ‌న చేసింద‌ని చెప్పొచ్చు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement