breaking news
Erling Haaland
-
బ్రెజిల్‌కు గుండెకోత.. ప్రపంచకప్ నుంచి నిష్క్రమణ
ఆరో సారి ఫిఫా వరల్డ్‌కప్ గెలవాలనుకున్న మాజీ ఛాంపియన్ బ్రెజిల్ ఆశలు అడియాశలయ్యాయి. నార్వే స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ బ్రెజిల్ ఆశలను అడియాశలు చేశాడు. 2026 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్‌పై నార్వే 2-0 గోల్స్ తేడాతో గెలుపొంది, తొలిసారి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ దెబ్బతో బ్రెజిల్ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్లో నార్వే ఇంగ్లండ్ లేదా మెక్సికోతో తలపడుతుంది. ఒంటికాలితో తన్నేశాడు..!బ్రెజిల్ ప్రపంచకప్ కలను హాలాండ్ ఒంటికాలితో తన్నేశాడు. మ్యాచ్ చివరి క్షణాల్లో (80, 90) లభించిన రెండు అవకాశాలను అద్భుతంగా సద్వినియోగం చేసుకుని రెండు గోల్స్ నమోదు చేశాడు. దీంతో బ్రెజిల్‌పై నార్వే చారిత్రక విజయం సాధించింది. బ్రెజిల్ ఆరో ప్రపంచకప్ కల చెదిరిపోయింది.ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ అటాకింగ్ కంటే డిఫెన్స్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చి మూల్యం చెల్లించుకుంది. మరోవైపు నార్వే దూకుడుగా ఆడి బ్రెజిల్‌ను చావుదెబ్బ కొట్టింది. ఆ జట్టు తరఫున హాలాండ్, మార్టిన్ ఓడెగార్డ్, పాట్రిక్ బెర్గ్, ఆండ్రియాస్ షెల్డెరప్ అద్భుతంగా ఆడారు. వరుసగా ప్రమాదకర దాడులు చేశారు.78వ నిమిషానికి నార్వే 523 పాస్‌లు పూర్తి చేయగా, బ్రెజిల్ కేవలం 203 పాస్‌లతోనే సరిపెట్టుకోవడం మ్యాచ్‌పై నార్వే ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపించింది.బ్రెజిల్‌కు సైతం అవకాశాలు వచ్చినా..!బ్రెజిల్‌కు సైతం మ్యాచ్‌లో పలు కీలక అవకాశాలు వచ్చినా వాటిని గోల్స్‌గా మలచలేకపోయింది. బ్రునో గిమరాయెస్ కొట్టిన పెనాల్టీని గోల్‌కీపర్ ఓర్జన్ నైలాండ్ అద్భుతంగా అడ్డుకున్నాడు. గాబ్రియెల్ మార్టినెల్లి ప్రయత్నాన్ని కూడా నైలాండ్ నిలువరించాడు. ప్రత్యామ్నాయ ఆటగాడు ఎండ్రిక్‌కు వినీషియస్ జూనియర్ అందించిన చక్కని అవకాశాన్ని కూడా గోల్‌గా మార్చలేకపోయాడు. 68వ నిమిషంలో స్టార్ స్ట్రైకర్ నెయ్మార్ బరిలోకి దిగినా దాడుల్లో పెద్ద మార్పు రాలేదు. స్టాపేజ్ టైమ్‌లో (90+10) నెయ్మార్ పెనాల్టీ ద్వారా ఒక గోల్ చేసినా అప్పటికే ఆలస్యమైపోయింది.80 నిమిషాలు నిశ్శబ్దం... చివరి 10 నిమిషాల్లో తుఫాన్దాదాపు 80 నిమిషాల పాటు బ్రెజిల్ డిఫెండర్లు హాలాండ్‌ను సమర్థంగా కట్టడి చేశారు. కానీ 80వ నిమిషంలో షెల్డెరప్ ఇచ్చిన అద్భుతమైన క్రాస్‌ను హాలాండ్ హెడర్‌తో గోల్‌గా మలిచి నార్వేకు ఆధిక్యం అందించాడు. 90వ నిమిషంలో బ్రెజిల్ మొత్తం ముందుకు రావడంతో ఏర్పడిన ఖాళీలను చాకచక్యంగా ఉపయోగించుకున్న హాలాండ్, బాక్స్ వెలుపల నుంచి ఎడమ కాలితో కొట్టిన బుల్లెట్ షాట్‌ను గోల్‌గా మార్చి మ్యాచ్‌ను పూర్తిగా నార్వే వైపు తిప్పేశాడు.నెయ్మార్ కన్నీళ్లు.. హాలాండ్ ఆనందభాష్పాలుఫైనల్ విజిల్ అనంతరం నెయ్మార్ మైదానంలోనే నిలబడి భావోద్వేగానికి గురయ్యాడు. ఇది అతని చివరి ప్రపంచకప్ మ్యాచ్ కావచ్చన్న నేపథ్యంలో ఆ దృశ్యం అభిమానులను కదిలించింది. మరోవైపు చారిత్రక విజయంతో హాలాండ్ మైదానంలోనే కుప్పకూలి ఆనందభాష్పాలు పెట్టుకున్నాడు. నార్వే అభిమానులు స్టేడియంలో చాలా సేపు సంబరాలు కొనసాగించారు. -
హాలండ్ ప్రపంచ రికార్డు.. ప్రిక్వార్టర్స్‌కు నార్వే
ఫిఫా ప్రపంచకప్‌లో 28 ఏళ్ల తర్వాత నార్వే జట్టు ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. రౌండ్ ఆఫ్ 32లో భాగంగా మంగళవారం రాత్రి ఐవరీ కోస్ట్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్వే 2-1 తేడాతో విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. నార్వే తరఫున ఆంటోనియో నుసా (39వ నిమిషం), ఎర్లింగ్ హాలండ్ (86వ నిమిషం) గోల్స్ చేశారు. ఇక ఐవరీ కోస్ట్ తరఫున అమడ్ డియాల్లో (74వ నిమిషం) గోల్ సాధించాడు. ప్రిక్వార్టర్స్‌లో బ్రెజిల్‌తో నార్వే అమీతుమీ తేల్చుకోనుంది. ఆట మొదలైన తర్వాత తొలి హాఫ్‌కు ముందు నార్వేకు ఆంటోనియో గోల్ అందించాడు. రెండో అర్ధభాగంలో ఐవరీ కోస్ట్ తరఫున అమడ్ డియాల్లో గోల్ చేసి ఆ జట్టు తరఫున నాకౌట్లో తొలి గోల్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక మ్యాచ్ డ్రా దిశగా నడుస్తున్న సమయంలో నార్వే స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలండ్ 82వ నిమిషంలో తన సహచరుడు అందించిన పాస్‌ను ఏమాత్రం తప్పు చేయకుండా సింపుల్‌గా గోల్‌పోస్ట్‌లోకి పంపించి ఆధిక్యాన్ని 2-1కి పెంచాడు. ఆ తర్వాత నిర్ణీత సమయం ముగిసిన తర్వాత ఇంజ్యూరీ టైమ్‌లో ఐవరీ కోస్ట్ గోల్ చేయడంలో విఫలం కావడంతో నార్వే విజయాన్ని సాధించింది.ఇక నార్వే స్టార్ ఎర్లింగ్ హాలండ్ ఐవరీ కోస్ట్‌తో మ్యాచ్‌లో గోల్ చేయడం ద్వారా అరుదైన రికార్డు సాధించాడు. తొలి ప్రపంచకప్ ఆడుతున్న ఎర్లింగ్ హాలండ్ తాను ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ గోల్ కొట్టడం విశేషం. ఈ నేపథ్యంలో తన తొలి ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో గోల్స్ సాధించిన హాలండ్.. గెర్డ్ ముల్లర్ (జర్మనీ), యూసెబియో (పోర్చుగల్), జస్ట్ ఫాంటైన్ (ఫ్రాన్స్) వంటి దిగ్గజ స్ట్రైకర్ల సరసన చోటు సంపాదించాడు. మొత్తం మీద నాలుగు మ్యాచ్‌ల్లో హాలండ్ ఆరు గోల్స్ చేశాడు. మరోవైపు తొలిసారి నాకౌట్ మ్యాచ్ ఆడిన ఐవరీ కోస్ట్ తన స్థాయిని మించి ప్రదర్శన చేసిందని చెప్పొచ్చు. Well done, Norway! 🇳🇴 Congratulations on the victory!You rowed hard throughout the entire match! pic.twitter.com/6m8IueBJ0r— Orla Joelsen (@OJoelsen) June 30, 2026 👽🇳🇴 3 starts, 5 goals. Erling Haaland has scored in every single World Cup game he’s played in his career.Absolute machine. pic.twitter.com/XIMg3UJQbP— Fabrizio Romano (@FabrizioRomano) June 30, 2026 -
హాలండ్ జోరు.. ఉత్కంఠ పోరులో నార్వే విజయం
ఫిఫా ప్రపంచకప్‌లో నార్వే జట్టు రౌండ్ ఆఫ్ 32 దశకు అర్హత సాధించింది. గ్రూప్-ఐలో భాగంగా మంగళవారం సెనెగల్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో నార్వే 3-2తో విజయాన్ని అందుకుంది. నార్వే తరఫున స్టార్ ఆటగాడు ఎర్లింగ్ హాలండ్ (ఆట 48, 58వ నిమిషం) డబుల్ గోల్స్ కొట్టగా, మార్కస్ పెడెర్సన్ (ఆట 43వ నిమిషం) మరో గోల్ చేశాడు. అటు సెనెగల్ తరఫున ఇస్మాయిల్ సర్ (ఆట 53, 90+3వ నిమిషం) రెండు గోల్స్ కొట్టాడు. ఈ విజయంతో నార్వే నాకౌట్ దశకు చేరుకోగా సెనెగల్ ఆడిన రెండింటిలో ఓడి ఇంటిబాట పట్టింది.ఇక రెండు గోల్స్ సాధించిన ఎర్లింగ్ హాలండ్‌కు 52 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 59 గోల్స్ కావడం విశేషం. అంతేకాదు ఫిఫా ప్రపంచకప్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలవడం నార్వేకు ఇదే తొలిసారి. కాగా లీగ్ దశలో నార్వే తన చివరి మ్యాచ్‌ను ఫ్రాన్స్‌తో ఆడనుంది.నార్వే ‘వై కింగ్’ సెలబ్రేషన్ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, ముఖ్యంగా ప్రపంచకప్ (World Cup) లాంటి మెగా టోర్నమెంట్లలో నార్వే దేశ ఫుట్‌బాల్ జట్టు, వారి అభిమానులు "వైకింగ్ రోయింగ్" (Viking rowing) అనే వినూత్నమైన సెలబ్రేషన్ చేసుకుంటారు. ఆటగాళ్లు లేదా అభిమానులు నేలపై వరుసగా కూర్చొని, తెడ్డు వేస్తున్నట్లు (rowing) హావభావాలు ప్రదర్శిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఇది వారి దేశ సంస్కృతికి ప్రతీక.The Norwegian team and fans doing the Row are just beautiful.pic.twitter.com/hi2YqZimUi— World Cup 2026 Daily (@TotalFootball) June 23, 2026Read: వందో మ్యాచ్‌లో ఎంబాపె రికార్డు గోల్స్.. నాకౌట్‌కు ఫ్రాన్స్ -
28 ఏళ్ల తర్వాత బరిలోకి.. ఇరాక్‌ను చిత్తు చేసిన నార్వే
28 ఏళ్ల తర్వాత ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న నార్వే తన ప్రయాణాన్ని ఘనంగా ఆరంభించింది. గ్రూప్-ఐలో భాగంగా ఇరాక్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్వే 4-1 తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. నార్వే స్టార్ ఎర్లింగ్ హాలండ్ డబుల్ గోల్స్ (ఆట 29వ, 43వ నిమిషం)తో మెరవగా, లియో గార్డ్ (76వ నిమిషం), ఇరాక్ ఆటగాడు అమెన్ హుస్సెన్ (90+6వ నిమిషం) సెల్ఫ్ గోల్ కొట్టడంతో అది నార్వే ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక ఇరాక్ తరఫున అమెన్ హుస్సేన్ ఆట 39వ నిమిషంలో గోల్ సాధించాడు. ఇక 28 ఏళ్ల తర్వాత ఫిఫా ఆడుతున్న నార్వేకు ఎర్లింగ్ హాలండ్ తన గోల్స్‌తో మరిచిపోలేని విజయాన్ని అందించాడు. క్వాలిఫయర్స్‌లో మాజీ చాంపియన్ ఇటలీని ఓడించి ఫిఫాకు అర్హత సాధించడంలో హాలండ్ కీలకపాత్ర పోషించాడు. గోల్ కొడుతున్న ఎర్లింగ్ హాలండ్ఇప్పుడు అసలు సమరంలోనూ ఈ స్టార్ స్ట్రైకర్ తన మ్యాజిక్‌ను ప్రదర్శించాడు. అంతకముందు ఇదే గ్రూప్‌లో ఫ్రాన్స్ 3-1 తేడాతో సెనెగల్‌ను ఓడించినప్పటికీ, ఇరాక్‌పై నాలుగు గోల్స్‌తో ఆధిపత్యం ప్రదర్శించిన నార్వే గ్రూప్‌లో తొలి స్థానంలో నిలిచింది.క్వాలిఫయర్స్‌లో సత్తా చాటి ఫిఫాకు అర్హత సాధించిన నార్వే.. ఇరాక్‌తో మ్యాచ్‌లో ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆట మొదలైన కాసేపటికే ఇరాక్ గోల్‌పోస్టులపై దాడులు మొదలుపెట్టిన నార్వేకు 29వ నిమిషంలో ఎర్లింగ్ హాలండ్ తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత 43వ నిమిషంలో మరో గోల్ సాధించడంతో నార్వే 2-0తో ఆధిక్యంలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత రెండో సగంలో మరో రెండు గోల్స్ రావడం.. అందులో ఒకటి ఇరాక్ ఆటగాడి సెల్ఫ్ గోల్ నార్వే ఖాతాలోకి వెళ్లిపోయింది. నార్వే తన తర్వాతి మ్యాచ్‌లో జూన్ 23న సెనెగల్‌తో తలపడనుంది. ఆ తర్వాత ఫ్రాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. HAALAND SCORES HIS FIRST WORLD CUP GOAL!!! pic.twitter.com/hOFIEuj8Bd— AzzaTalksFooty (@AzzaTalksFooty) June 16, 2026చదవండి: రేపు అర్జెంటీనా మ్యాచ్.. కేరళలో మెస్సీ మేనియా! -
వారానికి రూ. 5 కోట్లు.. జాక్‌పాట్ కాదు! అంతకు మించి..
నార్వే ఫుట్‌బాల్ స్టార్ ఎర్లింగ్ హాలాండ్(Erling Haaland) జాక్‌పాట్ కొట్టేశాడు. ఊహకందని రీతిలో వారానికి రూ. 5 కోట్ల చొప్పున సంపాదించనున్నాడు. ఈ మేరకు ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ సిటీ(Manchester City) ఫుట్‌బాల్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కాగా 2000 సంవత్సరంలో జన్మించిన హాలాండ్ నార్వే జాతీయ జట్టు తరఫున ఫుట్‌బాల్ ఆడుతున్నాడు.రెండుసార్లు ‘గోల్డెన్ బూట్’ఈ క్రమంలో ఇంగ్లండ్‌లో జరిగే ప్రీమియర్ లీగ్(Premier League)లో అడుగుపెట్టిన హాలాండ్.. అరంగేట్రంలోనే రికార్డులు బద్దలుకొట్టాడు. తొలి సీజన్లోనే 36 గోల్స్‌తో దుమ్ములేపాడు ఈ స్ట్రైకర్. ఇక గత సీజన్లో మాంచెస్టర్ తరఫున 27 గోల్స్ కొట్టిన అతడు.. రెండుసార్లు ‘గోల్డెన్ బూట్’ గెలిచాడు.కానీ ఈ దఫా 16 గోల్స్‌తో సరిపెట్టాడు. ఇక గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. అతడు మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌తో ఇంకో రెండేళ్లు మాత్రమే కొనసాగాల్సి ఉంది. కానీ తాజాగా ఈ డీల్‌ను పొడగిస్తూ మాంచెస్టర్ సిటీ నిర్ణయం తీసుకుంది. తొమ్మిదిన్నరేళ్ల పాటు హాలాండ్‌ను కొనసాగించనుంది.కళ్లు చెదిరే మొత్తంప్రీమియర్ లీగ్ చరిత్రలోనే ఇది సుదీర్ఘకాలం పాటు సాగే ఒప్పందం. అంతేకాదు.. ఈ డీల్ ద్వారా హాలాండ్ వారానికి ఐదు లక్షల పౌండ్లు(భారత కరెన్సీలో దాదాపు ఐదున్నర కోట్లకు పైగా) ఆర్జించనున్నాడట. ఈ నేపథ్యంలో హాలాండ్ స్పందిస్తూ.. ‘‘నేను చాలా చాలా సంతోషంగా.. గర్వంగా ఉన్నాను. సిటీ క్లబ్‌తో సుదీర్ఘకాలం కొనసాగేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ ఒప్పందం గురించి సులువుగానే నిర్ణయానికి వచ్చేశాను.ఇక ఆటపై నేను మరింత దృష్టి పెట్టగలను. ఒకే జట్టుతో ఎక్కువకాలం కలిసి ప్రయాణించడం సానుకూల ఫలితాలను ఇస్తుంది’’ అని పేర్కొన్నాడు. ఇక మాంచెస్టర్ సిటీ టీమ్ మేనేజర్(కోచ్) జోసెప్ గ్వార్డియోలా సలాతో కలిసి మరికొంతకాలం పనిచేయడం ద్వారా తన నైపుణ్యాలు మరింత మెరుగుపరచుకోవచ్చని హాలాండ్ హర్షం వ్యక్తం చేశాడు.అలాంటి వ్యక్తిని చూడలేదు‘‘నేను ఇప్పటికే చాలా మెరుగయ్యాను. అతడితో కలిసి పనిచేయడం చాలా బాగుంటుంది. అతడు కేవలం అత్యుత్తమ వ్యక్తి మాత్రమే కాదు.. హార్డ్‌వర్కర్ కూడా. అలాంటి వ్యక్తిని నేను ఇంతకు ముందు చూడనేలేదు’’ అని గ్వార్డియోలాపై హాలాండ్ ప్రశంసలు కురిపించాడు. కాగా స్పెయిన్‌కు చెందిన గ్వార్టియోలా మాంచెస్టర్ సిటీ క్లబ్‌కు 2016 నుంచి కోచ్‌గా ఉన్నాడు. వివిధ టోర్నీల్లో కలిపి మొత్తంగా 18 సార్లు ట్రోఫీ అందించాడు. ఇదిలా ఉంటే.. తాజా ఒప్పందం ప్రకారం ఎర్లిండ్ హాలాండ్ మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌తో 2034 వరకు కొనసాగనున్నాడు.చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్


