28 ఏళ్ల త‌ర్వాత బ‌రిలోకి.. ఇరాక్‌ను చిత్తు చేసిన నార్వే | Erling Haaland Double Goals Norway Victory Over Iraq FIFA WC 2026 | Sakshi
Sakshi News home page

28 ఏళ్ల త‌ర్వాత బ‌రిలోకి.. ఇరాక్‌ను చిత్తు చేసిన నార్వే

Jun 17 2026 7:12 AM | Updated on Jun 17 2026 12:44 PM

Erling Haaland Double Goals Norway Victory Over Iraq FIFA WC 2026

నార్వే స్టార్‌ ఎర్లింగ్‌ హాలండ్‌

28 ఏళ్ల త‌ర్వాత ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ఆడుతున్న నార్వే త‌న ప్ర‌యాణాన్ని ఘ‌నంగా ఆరంభించింది. గ్రూప్-ఐలో భాగంగా ఇరాక్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో నార్వే 4-1 తేడాతో ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. నార్వే స్టార్ ఎర్లింగ్ హాలండ్ డ‌బుల్ గోల్స్ (ఆట 29వ‌, 43వ నిమిషం)తో మెరవ‌గా, లియో గార్డ్ (76వ నిమిషం), ఇరాక్ ఆట‌గాడు అమెన్ హుస్సెన్ (90+6వ నిమిషం) సెల్ఫ్ గోల్ కొట్ట‌డంతో అది నార్వే ఖాతాలోకి వెళ్లిపోయింది. 

ఇక ఇరాక్ త‌ర‌ఫున అమెన్ హుస్సేన్ ఆట 39వ నిమిషంలో గోల్ సాధించాడు. ఇక 28 ఏళ్ల త‌ర్వాత ఫిఫా ఆడుతున్న నార్వేకు ఎర్లింగ్ హాలండ్ త‌న గోల్స్‌తో మ‌రిచిపోలేని విజ‌యాన్ని అందించాడు. క్వాలిఫ‌య‌ర్స్‌లో మాజీ చాంపియ‌న్ ఇట‌లీని ఓడించి ఫిఫాకు అర్హ‌త సాధించ‌డంలో హాలండ్ కీల‌క‌పాత్ర పోషించాడు. 


గోల్‌ కొడుతున్న ఎర్లింగ్‌ హాలండ్‌

ఇప్పుడు అస‌లు స‌మ‌రంలోనూ ఈ స్టార్ స్ట్రైక‌ర్ త‌న మ్యాజిక్‌ను ప్ర‌ద‌ర్శించాడు. అంత‌క‌ముందు ఇదే గ్రూప్‌లో ఫ్రాన్స్ 3-1 తేడాతో సెనెగ‌ల్‌ను ఓడించిన‌ప్ప‌టికీ, ఇరాక్‌పై నాలుగు గోల్స్‌తో ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించిన నార్వే గ్రూప్‌లో తొలి స్థానంలో నిలిచింది.

క్వాలిఫయర్స్‌లో సత్తా చాటి ఫిఫాకు అర్హత సాధించిన నార్వే.. ఇరాక్‌తో మ్యాచ్‌లో ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆట మొదలైన కాసేపటికే ఇరాక్ గోల్‌పోస్టులపై దాడులు మొదలుపెట్టిన నార్వేకు 29వ నిమిషంలో ఎర్లింగ్ హాలండ్ తొలి గోల్ అందించాడు. 

ఆ తర్వాత 43వ నిమిషంలో మరో గోల్ సాధించడంతో నార్వే 2-0తో ఆధిక్యంలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత రెండో సగంలో మరో రెండు గోల్స్ రావడం.. అందులో ఒకటి ఇరాక్ ఆటగాడి సెల్ఫ్ గోల్ నార్వే ఖాతాలోకి వెళ్లిపోయింది. నార్వే తన తర్వాతి మ్యాచ్‌లో జూన్ 23న సెనెగల్‌తో తలపడనుంది. ఆ తర్వాత ‍ఫ్రాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

 

చదవండి: రేపు అర్జెంటీనా మ్యాచ్‌.. కేర‌ళ‌లో మెస్సీ మేనియా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement