గోల్‌కీపర్‌ ప్రపంచ రికార్డు.. ప్రిక్వార్ట‌ర్స్‌కు స్పెయిన్‌ | Mikel Oyarzabal Double-Goals-Spain Beat-Austria Enter-R-16 FIFA-WC | Sakshi
Sakshi News home page

గోల్‌కీపర్‌ ప్రపంచ రికార్డు.. ప్రిక్వార్ట‌ర్స్‌కు స్పెయిన్‌

Jul 3 2026 4:26 AM | Updated on Jul 3 2026 5:29 AM

Mikel Oyarzabal Double-Goals-Spain Beat-Austria Enter-R-16 FIFA-WC

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో స్పెయిన్ ప్రిక్వార్ట‌ర్స్‌లో అడుగుపెట్టింది. రౌండ్ ఆఫ్ 32లో భాగంగా లాస్ ఏంజిల్స్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో స్పెయిన్ 3-0తో ఆస్ట్రియాను చిత్తు చేసింది. స్పెయిన్ త‌ర‌ఫున మికెల్ ఒజ‌ర్‌బ‌యాల్ (37, 89వ నిమిషం) డ‌బుల్ గోల్స్ చేయ‌గా, పెడ్రో పోరో (66వ నిమిషం) మ‌రో గోల్ సాధించాడు. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. స్పెయిన్ తొలి గోల్ 37వ నిమిషంలో నమోదైంది. ఎడమ వైపు నుంచి వచ్చిన లో క్రాస్‌ను బాక్స్ మధ్యలో నుంచి మికెల్ బంతిని గోల్‌పోస్టులోకి పంపించాడు. ఆ త‌ర్వాత ఆట‌ 89వ నిమిషంలో మ‌రో గోల్ సాధించాడు. ఇది కూడా మొదటి గోల్‌ను పోలి ఉంటుంది. లో క్రాస్ నుంచి వ‌చ్చిన బంతిని అందుకున్న మికెల్ నేరుగా నెట్‌లోకి పంపించాడు. 

దీంతో ఫిఫా 2026లో మికెల్ త‌న గోల్స్ సంఖ్య‌ను నాలుగుకు పెంచుకున్నాడు. ఇక డిఫెండ‌ర్ పెడ్రో పోరో  రైఫిల్ హెడ‌ర్ షాట్‌తో బంతిని గోల్‌పోస్టులోకి పంపించి ఆధిక్యాన్ని మూడుకు పెంచాడు. ఇక ప్ర‌త్య‌ర్థి ఆస్ట్రియాను స్పెయిన్ ఉక్కిరిబిక్కిరి చేసింది. ప‌టిష్ట‌మైన డిఫెన్స్‌తో ఆస్ట్రియాను కేవలం ఐదుషాట్స్‌కే ప‌రిమితం చేశారు. మొత్తం 90 నిమిషాల ఆట‌లో ఆస్ట్రియా ఒక్క‌సారి కూడా ల‌క్ష్యాన్ని ఛేదించ‌డంలో విఫ‌ల‌మైంది.

ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో స్పెయిన్‌ ఒకటి కంటే ఎక్కువ గోల్స్ సాధించడం 1994 తర్వాత ఇదే తొలిసారి. 1994 ఫిఫా వరల్డ్‌కప్‌లో స్పెయిన్‌ నాకౌట్ దశలో స్విట్జర్లాండ్‌పై 3-0తో గెలిచింది. లామినే యమాల్‌, పౌకుబార్సీ వంటి ఇద్దరు టీనేజర్లు ఉన్న ఏకైక జట్టుగా స్పెయిన్ నిలిచింది. ఈ ద్వయం గతంలో బ్రెజిల్ దిగ్గజం పీలే, జోస్ అల్టాఫిని పేరిట ఉన్న 68 ఏళ్ల ప్రపంచరికార్డును బద్దలుకొట్టింది. ఇక ప్రిక్వార్టర్స్‌లో స్పెయిన్.. క్రొయేషియా, పోర్చుగల్ మధ్య విజేతతో తలపడనుంది. 
 

స్పెయిన్ గోల్ కీపర్‌ గిన్నిస్ రికార్డు
ఈ క్ర‌మంలో స్పెయిన్ గోల్ కీపర్ ఉనై సైమన్  ప్ర‌పంచ రికార్డు సాధించాడు. ఫిఫా టోర్నమెంట్‌లో 519 నిమిషాల పాటు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా, సైమ‌న్ తొలి గోల్ కీప‌ర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును  లిఖించుకున్నాడు. 

ఫిఫా 2026 టోర్నీ గ్రూప్‌ దశ నుంచి తాజాగా లాస్‌ ఏంజెల్స్‌లో ఆస్ట్రియాతో జరిగిన నాకౌట్‌ మ్యాచ్‌ వరకు ఉనై సైమన్‌ తన ప్రత్యర్థులకు ఒక్క గోల్‌ కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో 1990 ఫీఫా ప్రపంచ కప్ సమయంలో ఇటలీ దిగ్గజ గోల్ కీపర్ వాల్టర్ జెంగా నెలకొల్పిన 517 నిమిషాల మునుపటి రికార్డును సైమన్ బ‌ద్ద‌లుకొట్టాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement