100 మ్యాచ్‌లకు ఒక బంతి... ఆఖరి 4 మ్యాచ్‌లకు మరో బంతి | Ball color changes for four matches | Sakshi
Sakshi News home page

100 మ్యాచ్‌లకు ఒక బంతి... ఆఖరి 4 మ్యాచ్‌లకు మరో బంతి

Jul 19 2026 12:56 AM | Updated on Jul 19 2026 12:56 AM

Ball color changes for four matches

‘ఫిఫా’ వరల్డ్‌కప్‌లో రెండు రకాల బంతులను వినియోగించారు. టోర్నమెంట్‌ తొలి 100 మ్యాచ్‌లకు... ఆతిథ్య దేశాలైన అమెరికా, మెక్సికో, కెనడా జెండాల రంగులను ప్రస్ఫుటించేలా ఎరుపు, నీలం, ఆకుపచ్చ, తెలుపు రంగులతో కూడిన ‘ట్రియోండా’ బంతిని వాడగా... మిగిలిన నాలుగు మ్యాచ్‌లకు (2 సెమీఫైనల్స్, మూడో స్థానం మ్యాచ్, ఫైనల్‌) బంతి రంగులో మార్పులు చేశారు. స్పానిష్ లో ‘ట్రియోండా’ అంటే ‘త్రీ వేవ్స్‌’... ఆతిథ్యమిస్తున్న మూడు దేశాలకు ప్రతీక అని అర్థం. ఫ్రాన్స్‌–స్పెయిన్‌... ఇంగ్లండ్‌–అర్జెంటీనా మధ్య జరిగిన సెమీఫైనల్స్‌తో పాటు ఫ్రాన్స్‌–ఇంగ్లండ్‌ మధ్య మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో బంగారు, నలుపు రంగులతో కూడిన బంతిని వినియోగించారు. 

అడిడాస్‌ సంస్థ రూపొందించిన ఈ బంతితోనే ఫైనల్‌ కూడా జరగనుంది. ప్రపంచకప్‌నకు ఆతిథ్యమిచ్చిన 16 నగరాలకు గుర్తుగా దీన్ని రూపొందించడం విశేషం. ‘ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద ‘ఫిఫా’ ప్రపంచకప్‌కు స్వాగతించిన 16 నగరాలను ట్రియోండా గౌరవిస్తోంది. చివరి నాలుగు మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన నగరాల పేర్లు బంతిపై ప్రముఖంగా కనిపించే విధంగా రూపొందించాం. మిగిలిన 12 ఆతిథ్య నగరాల పేర్లను కూడా పొందుపరిచాం. తద్వారా టోర్నీ విజయవంతం కావడానికి వారు అందించిన సహకారాన్ని గుర్తు చేసుకుంటున్నాం’ అని ‘ఫిఫా’ ఒక ప్రకటనలో తెలిపింది. ఫైనల్‌ బంతిలో అత్యాధునిక ఏఐ సాంకేతికత ఉందని... అది కచ్చితమైన డేటా అందిస్తూ... రిఫరీలు వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడుతుందని ‘ఫిఫా’ వెల్లడించింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement