ప్రీ క్వార్టర్స్‌ దూసుకెళ్లిన అమెరికా | USA beats Bosnia Herzegovina to advance to round of 16 | Sakshi
Sakshi News home page

ప్రీ క్వార్టర్స్‌ దూసుకెళ్లిన అమెరికా

Jul 2 2026 8:25 AM | Updated on Jul 2 2026 11:10 AM

USA beats Bosnia Herzegovina to advance to round of 16

ఫిఫా ప్రపంచకప్‌ 2026లో ఆతిథ్య అమెరికా జట్టు ప్రీ క్వార్టర్‌ ఫైనల్స్‌కు (రౌండ్‌ ఆఫ్‌ 16) దూసుకెళ్లింది. రౌండ్‌ ఆఫ్‌ 32 మ్యాచ్‌లో బోస్నియా అండ్‌ హెర్జెగొవినాపై 2-0 గోల్స్‌ తేడాతో ఘన విజయం సాధించి, టైటిల్‌ రేసులో నిలిచింది. ఈ మ్యాచ్‌లో అమెరికా కేవలం 10 మంది ఆటగాళ్లతోనే పోరాటం చేసింది.

64వ నిమిషంలో స్టార్‌ ఫార్వర్డ్‌ ఫొలారిన్‌ బలోగన్‌ రెడ్‌ కార్డ్‌కు గురై మైదానాన్ని వీడాడు. రెడ్‌ కార్డ్‌కు గురయ్యే సమయానికి బలోగన్‌ చెలరేగి ఆడుతున్నాడు. 45వ నిమిషంలో గోల్ చేసి అమెరికాకు ఆధిక్యం అందించాడు. ఈ టోర్నీలో అతనికి ఇది మూడో గోల్. మరోవైపు బోస్నియా కూడా ప్రారంభంలో కొన్ని అవకాశాలు సృష్టించుకున్నా అమెరికా గోల్‌కీపర్ మ్యాట్‌ ఫ్రీస్‌ అద్భుతమైన సేవ్‌లతో జట్టును కాపాడాడు.

బలోగన్‌ రెడ్‌ కార్డ్‌కు గురైనా వెనక్కి తగ్గని అమెరికా 82వ నిమిషంలో మరో గోల్‌ చేసి ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. మలిక్‌ టిల్‌మ్యాన్‌ అద్భుతమైన ఫ్రీకిక్‌తో గోల్ చేసి అమెరికా విజయాన్ని ఖాయం చేశాడు.

కాగా, ప్రపంచకప్‌ చరిత్రలో అమెరికా రౌండ్‌ ఆఫ్‌ 16కు చేరడం ఇది మూడోసారి. 1930లో తొలిసారి సెమీస్‌కు చేరిన ఆ జట్టు.. 2002 ఎడిషన్‌లో రౌండ్‌ ఆఫ్‌ 16కు చేరింది. మళ్లీ ఇప్పుడే రౌండ్‌ ఆఫ్‌ 16కు అర్హత సాధించింది. అమెరికా తమ తదుపరి మ్యాచ్‌లో బెల్జియంతో తలపడనుంది. ఈ పోరు జూలై 6న సియాటిల్‌లో జరగనుంది. స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌ కావడంతో అమెరికా నుంచి అభిమానులు సంచలనాలు ఆశిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement