breaking news
Bosnia-Herzegovina
-
ప్రీ క్వార్టర్స్ దూసుకెళ్లిన అమెరికా
ఫిఫా ప్రపంచకప్ 2026లో ఆతిథ్య అమెరికా జట్టు ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌కు (రౌండ్ ఆఫ్ 16) దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో బోస్నియా అండ్ హెర్జెగొవినాపై 2-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించి, టైటిల్ రేసులో నిలిచింది. ఈ మ్యాచ్‌లో అమెరికా కేవలం 10 మంది ఆటగాళ్లతోనే పోరాటం చేసింది.64వ నిమిషంలో స్టార్ ఫార్వర్డ్ ఫొలారిన్ బలోగన్ రెడ్ కార్డ్‌కు గురై మైదానాన్ని వీడాడు. రెడ్ కార్డ్‌కు గురయ్యే సమయానికి బలోగన్ చెలరేగి ఆడుతున్నాడు. 45వ నిమిషంలో గోల్ చేసి అమెరికాకు ఆధిక్యం అందించాడు. ఈ టోర్నీలో అతనికి ఇది మూడో గోల్. మరోవైపు బోస్నియా కూడా ప్రారంభంలో కొన్ని అవకాశాలు సృష్టించుకున్నా అమెరికా గోల్‌కీపర్ మ్యాట్ ఫ్రీస్ అద్భుతమైన సేవ్‌లతో జట్టును కాపాడాడు.బలోగన్ రెడ్ కార్డ్‌కు గురైనా వెనక్కి తగ్గని అమెరికా 82వ నిమిషంలో మరో గోల్ చేసి ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. మలిక్ టిల్‌మ్యాన్ అద్భుతమైన ఫ్రీకిక్‌తో గోల్ చేసి అమెరికా విజయాన్ని ఖాయం చేశాడు.కాగా, ప్రపంచకప్ చరిత్రలో అమెరికా రౌండ్ ఆఫ్ 16కు చేరడం ఇది మూడోసారి. 1930లో తొలిసారి సెమీస్‌కు చేరిన ఆ జట్టు.. 2002 ఎడిషన్‌లో రౌండ్ ఆఫ్ 16కు చేరింది. మళ్లీ ఇప్పుడే రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. అమెరికా తమ తదుపరి మ్యాచ్‌లో బెల్జియంతో తలపడనుంది. ఈ పోరు జూలై 6న సియాటిల్‌లో జరగనుంది. స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్ కావడంతో అమెరికా నుంచి అభిమానులు సంచలనాలు ఆశిస్తున్నారు. -
కోర్టులో విషం తాగిన యుద్ధ ఖైదీ
వాషింగ్టన్ : యుద్ధ నేరాల ఆరోపణలపై జైలు పాలైన బోస్నియాకు చెందిన మాజీ క్రోట్ లీడర్ ఐక్యరాజ్యసమితి న్యాయస్థానంలో విషం తాగి బలవన్మరణం చెందారు. యుద్ధ నేరాలకు పాల్పడినట్లు అంతర్జాతీయ క్రిమినల్ ట్రైబ్యునల్(ఐసీటీ) తీర్పునిస్తూ, స్లోబోడన్ ప్రల్జక్(72)కు 20 ఏళ్ల కారాగార శిక్షను విధించింది. దీంతో షాక్‌కు గురైన స్లోబోడన్ తాను నేరస్తుడిని కాదంటూ కోర్టు హాలులో పెద్దగా కేకలు వేశాడు. తనతో పాటు తెచ్చుకున్న విషాన్ని తాగేశాడు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో పోలీసులు అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్లోబోడన్ ప్రాణాలు విడిచాడు. స్లోబోడన్తో పాటు మరికొందరిపై కూడా బోస్నియా - హెర్జ్గోవినాల మధ్య 1990లో వచ్చిన యుద్ధంలో ఘాతుకాలకు పాల్పడినట్లు కేసులు ఉన్నాయి. ఈ రణంలో దాదాపు ఒక లక్ష మంది ప్రజలు ప్రాణాలు విడిచారు. దీంతో రంగంలోకి దిగిన అమెరికా 1995లో ఓ శాంతి ఒప్పందాన్ని కుదిర్చింది. అనంతరం యుద్ధ నేరాలు చేసిన వారిని అంతర్జాతీయ నేరస్తులుగా పరిగణిస్తూ అరెస్టులు జరిగాయి. -
బోస్నియా-హెర్జెగోవినాపై నైజీరియా విజయం!
మాటో గ్రోసో(బ్రెజిల్): ప్రపంచ పుట్ బాల్ కప్ పోటీల్లో బోస్నియా-హెర్జెగోవినా నైజిరియా 1-0 తేడాతో విజయం సాధించింది. తొలిసారి పుట్ బాల్ ప్రపంచకప్ పోటీల్లో ప్రవేశించిన బోస్నియా ఆశలపై క్వాలిఫైయింగ్ రౌండ్ లో ఆఫ్రికా ఛాంపియన్ గా నిలిచిన నీళ్లు చల్లింది. నైజీరియా ఆటగాడు ఒడెర్న్ వింగీ 29 నిమిషంలో గోల్ సాధించాడు. ఆతర్వాత గోల్ సాధించడానికి బోస్నియా చేసిన ప్రయత్నాలను నైజీరియా ధీటుగా ఎదుర్కొంది. దాంతో విజయం నైజీరియా పక్షాన నిలిచింది. గత రెండు మ్యాచ్ ల్లో నైజీరియా నాలుగు పాయింట్టు సాధించి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచింది. ఇరాన్ పై 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించిన అర్జెంటీనా ప్రథమ స్థానంలో ఉంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచేందుకు అర్జెంటినాతో నైజీరియా గురువారం తలపడనుంది.


