హ్యారికేన్ విధ్వంసం.. ప్రిక్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌ | Harry Kane Double Goals Saves England Enters Round-16 Will Face Mexico | Sakshi
Sakshi News home page

హ్యారికేన్ విధ్వంసం.. ప్రిక్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌

Jul 2 2026 12:20 AM | Updated on Jul 2 2026 12:32 AM

Harry Kane Double Goals Saves England Enters Round-16 Will Face Mexico

ఫిఫా ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్‌ ఇంగ్లండ్ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. బుధవారం రాత్రి డీఆర్ కాంగోతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2-1 తేడాతో విజయాన్ని సాధించింది. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ హ్యారికేన్ డబుల్ గోల్స్ (75, 86వ నిమిషం) చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక కాంగో తరఫున 7వ నిమిషంలో బ్రియాన్ సిపెంగా గోల్ కొట్టాడు. 

మ్యాచ్ తొలి అర్ధభాగంలో ఇంగ్లండ్‌పై కాంగో ఆధిపత్యం ప్రదర్శించడం విశేషం. మ్యాచ్ మొదలైన కాసేపటికే కాంగో తరఫున బ్రియాన్ గోల్ చేయడం ఇంగ్లండ్ జట్టును షాక్‌కు గురి చేసింది. ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంగ్లండ్ గోల్ కొట్టడంలో సఫలం కాలేకపోయింది. అయితే రెండో అర్ధభాగంలోనూ మూడో క్వార్టర్ వరకు ఇంగ్లండ్ గోల్ చేయకపోవడం గమనార్హం.  

ఇక ఓటమి తప్పదనుకున్న దశలో హ్యారికేన్ విజృంభించాడు. తనలోని విన్యాసాలను బయటకు తీసిన హ్యారికేన్ 75వ నిమిషంలో గోల్ కొట్టి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత మరో 11 నిమిషాల వ్యవధిలో రెండో గోల్ కొట్టి ఇంగ్లండ్‌ను 2-1తో ఆధిక్యంలో నిలిపాడు. తద్వారా నిర్ణీత సమయంలో కాంగో మరో గోల్ కొట్టడంలో విఫలం కావడంతో ఇంగ్లండ్ ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది.

ఇక హ్యారికేన్‌ టోర్నీలో ఐదు గోల్స్ కొట్టడం ద్వారా గోల్డెన్ బూట్ రేసులో కొనసాగుతున్నాడు. మెస్సీ, ఎంబాపె చెరో ఆరు గోల్స్‌తో సంయుక్తంగా ఉండగా, హాలండ్‌, హ్యారికేన్‌లు చెరో 5 గోల్స్‌తో రెండో స్థానంలో ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement