సొంతగడ్డపై ఐర్లాండ్ మహిళల జట్టుతో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ నాట్ స్కివర్ బ్రంట్‌కు ఈసీబీ సెలక్షన్ కమిటీ విశ్రాంతి ఇచ్చింది.
ఆమె స్ధానంలో స్టార్ ఆల్‌రౌండర్ చార్లీ డీన్‌కు జట్టు బాధ్యతలను అప్పగించారు. అదేవిధంగా డానీ వ్యాట్-హాడ్జ్‌తో పాటు సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ బెల్, అమీ జోన్స్‌లను వంటి సీనియర్ ప్లేయర్లను సైతం సెలక్టర్లు పక్కన పెట్టారు. వీరి స్ధానంలో గ్రేస్ పాట్స్, కిరా చాత్లీలు, గ్రేస్ పాట్స్ వంటి యువ ఆటగాళ్లకు తొలిసారి ఇంగ్లండ్ వన్డే జట్టులో చోటు దక్కింది.
అమీ జోన్స్ అందుబాటులో లేకపోవడంతో ఆలిస్ కాప్సే వికెట్ కీపర్ బాధ్యతలు నిర్వర్తించనుంది. ఈ మూడు వన్డేల సిరీస్ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో ఓటమి తర్వాత ఇంగ్లండ్ మహిళల జట్టుకు ఇదే తొలి వైట్‌బాల్ సిరీస్ కావడం గమనార్హం.
ఐరీష్ సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు
చార్లీ డీన్ (కెప్టెన్), మైయా బౌచియర్, ఆలిస్ కాప్సే (వికెట్ కీపర్), కిరా చాత్లీ, టిల్లీ కోర్టీన్-కోల్‌మన్, సోఫియా డన్క్లీ, లారెన్ ఫీలర్, డాని గిబ్సన్, జోడి గ్రెవ్‌కాక్, ఫ్రేయా కెంప్, రియానా మెక్‌డొనాల్డ్-గే, చారిస్ పావేలీ, గ్రేస్ పాట్స్, మేడీ విలియర్స్, ఇస్సీ వోంగ్.


