క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగ.. డేవిడ్‌ భాయ్‌ ఎంట్రీ | David Warner To Feature In WCL Season 3 Alongside AB De Villiers, Yuvraj Singh | Sakshi
Sakshi News home page

క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగ.. డేవిడ్‌ భాయ్‌ ఎంట్రీ

Aug 17 2026 2:30 PM | Updated on Aug 17 2026 2:36 PM

David Warner To Feature In WCL Season 3 Alongside AB De Villiers, Yuvraj Singh

source: X

రిటైర్‌మెంట్ తర్వాత మాజీ క్రికెట్ దిగ్గజాలను మరోసారి మైదానంలోకి తీసుకొస్తున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) మూడో సీజన్‌కు స్టార్ పవర్ మరింత పెరిగింది. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ సీజన్‌లో బరిలోకి దిగనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

ఈ టోర్నీ అక్టోబర్ 3 నుంచి 18 వరకు జరగనుంది. అయితే టోర్నీ వేదికను ఇంకా ప్రకటించలేదు.

వార్నర్‌తో పాటు భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, దక్షిణాఫ్రికా విధ్వంసక బ్యాటర్ ఏబీ డివిలియర్స్, వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది, ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ వంటి దిగ్గజాలు కూడ టోర్నీలో కొనసాగనున్నారు.

బంగ్లాదేశ్ ఛాంపియన్స్‌కు కూడా చోటు
WCL మూడో సీజన్‌లో బంగ్లాదేశ్ ఛాంపియన్స్‌ను కొత్తగా చేర్చనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. దీంతో ఈసారి టోర్నీకి మరింత అంతర్జాతీయ రంగు రానుంది.

రెండు సీజన్లు.. రెండు వేర్వేరు ఛాంపియన్లు
WCL తొలి సీజన్‌లో ఇండియా ఛాంపియన్స్ టైటిల్ గెలుచుకుంది. ఫైనల్లో పాకిస్తాన్ ఛాంపియన్స్‌ను ఓడించింది.

రెండో సీజన్‌లో సౌతాఫ్రికా ఛాంపియన్స్ విజేతగా నిలిచింది. ఆ ఫైనల్లోనూ పాకిస్తాన్ ఛాంపియన్స్‌యే ప్రత్యర్ది.

ఇప్పుడు మూడో సీజన్‌లో వార్నర్ వంటి మరో విధ్వంసకర బ్యాటర్‌ చేరడంతో WCL 2026పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈసారి టోర్నీ యూకే వెలుపల నిర్వహించనున్నట్లు WCL వ్యవస్థాపకుడు, CEO హర్షిత్ తోమర్ తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement