పాక్‌ మాజీ క్రికెటర్‌కు తీవ్ర గుండెపోటు | Pakistan Veteran Basit Ali Suffers Major Heart Attack | Sakshi
Sakshi News home page

పాక్‌ మాజీ క్రికెటర్‌కు తీవ్ర గుండెపోటు

Aug 17 2026 3:47 PM | Updated on Aug 17 2026 3:59 PM

Pakistan Veteran Basit Ali Suffers Major Heart Attack

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ(55) తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను కుటంబ సభ్యులు కరాచీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాసిత్ అలీకి వైద్యులు యాంజియోప్లాస్టీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. 

బాసిత్‌ త్వరగా కోలుకోవాలని అభిమానులు, క్రికెట్ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి. బాసిత్‌ అలీ 1993-96 మధ్య కాలంలో పాక్‌ తరపున 19 టెస్టులు, 50 వన్డేలు ఆడారు. మొత్తంగా 69 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆయన 2,123 పరుగులు చేశారు. అలీ ప్రస్తుతం కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నారు.
చదవండి: బాధపడొద్దు జడ్డూ.. ఇంకా చాలా టైమ్‌ ఉంది: సర్ఫరాజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement