Basit Ali
-
అతడు చెప్పాడనే వాటికి దూరం: జంపాకు ఘోర అవమానం
ఆడమ్ జంపా.. ఆస్ట్రేలియా అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా పేరు గాంచాడు. షేన్ వార్న్ తర్వాత ఆసీస్‌కు దొరికిన అత్యంత విజయవంతమైన లెగ్ స్పిన్నర్‌గా జంపా కొనసాగుతున్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో తిరుగులేని రికార్డు ఉన్న జంపా, ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. తాజాగా ఇదే విషయంపై ఓ పాకిస్తానీ క్రికెట్ షోలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కమ్రాన్ ఆక్మల్, బాసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు."ఆడమ్ జంపా ఒక అద్భుతమైన స్పిన్నర్. లైన్ అండ్ లెంగ్త్, గూగ్లీ, ఫ్లిప్పర్, అన్నీ బౌలింగ్ చేయగలడు. కానీ ఇప్పటివరకు అతడు టెస్టు క్రికెట్ ఆడకపోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. క్రికెట్ ఆస్ట్రేలియా కూడా అతడిని టెస్టుల కోసం ఎందుకు పరిగణించలేదో" అర్థం కావట్లేదు ఆక్మల్ అన్నాడు.అయితే ఇందుకు బసిత్ అలీ పొంతన లేని సమాధానమిచ్చాడు. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ ఆపడం వల్లే జంపా టెస్ట్ క్రికెట్ ఆడలేదని అలీ పేర్కొన్నాడు.కాగా జంపా, స్టోయినిష్ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ఉద్దేశించి బాసిత్ అలీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అన్పిస్తోంది. వారిద్దరూ ఆన్ది ఫీల్డ్, ఆఫ్‌ది ఫీల్డ్ చాలా క్లోజ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. గతంలో మార్కస్ స్టాయినిస్ , ఆడమ్ జంపా ‘గే కపుల్స్’ అంటూ రూమర్స్ వినిపించాయి. అయితే రూమర్స్‌కు స్టోయినిస్, జంపా ఎప్పుడో చెక్ పెట్టేశారు. తాము మంచి ఫ్రెండ్స్ అని.. ఎక్కువగా గేమ్ గురించే మాట్లాడుకుంటూ ఉంటామని స్పష్టం చేశారు. 2021లో ఆడమ్ జంపా తన గర్ల్‌ఫ్రెండ్ హాటెల్ని వివాహం చేసుకోగా.. స్టోయినిష్ గతేడాది ఆఖరిలో తన ప్రియురాలు సారా జార్నుచ్ని నిశ్చితార్దం చేసుకున్నాడు. అయితే లైవ్‌షోలో ఇద్దరు స్టార్ క్రికెటర్లను అవమానించిన బసిత్ అలీపై నెటిజన్లు ఫైరవవుతున్నారు.కొంచెం అయినా సిగ్గు ఉందా అంటూ మండిపడుతున్నాడరు. కాగా జంపా ప్రస్తుతం పీఎస్ఎల్ 2026లో కరాచీ కింగ్స్ తరపున ఆడుతుండగా.. స్టోయినిష్ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.చదవండి: IPL 2026: ఆర్సీబీ, సన్‌రైజర్స్ కాదు.. ప్లే ఆఫ్స్‌కు చేరే జట్లు ఇవే! -
టీమిండియాలోకి వచ్చేస్తాడు.. భయంగా ఉంది: పాక్ మాజీ క్రికెటర్
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇటు ఐపీఎల్.. అటు భారత అండర్-19 జట్టు తరఫున ఈ చిచ్చరపిడుగు విధ్వంసకర బ్యాటింగ్‌తో సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది రాజస్తాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వైభవ్.. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు.ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీకేవలం 35 బంతుల్లోనే శతక్కట్టిన వైభవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అత్యంత పిన్న వయసులోనే ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. అప్పటికి వైభవ్ వయసు పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే. ఇక భారత్ అండర్-19 వరల్డ్‌కప్ గెలవడంలోనూ వైభవ్ కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌తో ఫైనల్లో 80 బంతుల్లోనే 175 పరుగులతో దుమ్ములేపాడు.ఇదే జోరు కొనసాగిస్తూ ఐపీఎల్-2026లోనూ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) శుభారంభం అందుకున్నాడు. ఇటీవలే పదిహేనో వసంతంలో అడుగుపెట్టిన ఈ రాజస్తాన్ స్టార్.. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.టీమిండియాకు ఎంపిక చేయాలనే డిమాండ్లుఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీని టీమిండియాకు ఎంపిక చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఐపీఎల్ తాజా ఎడిషన్ ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌ను ఈ టూర్‌కు పంపాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు.టీమిండియాలోకి వచ్చేస్తాడుఇప్పుడు ఈ జాబితాలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కమ్రాన్ అక్మల్, బసిత్ అలీ కూడా చేరారు. గేమ్ ప్లాన్ షోలో అక్మల్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికి కేవలం 8 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఈ పిల్లాడు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. త్వరలోనే అతడు టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది.ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జాతీయ జట్టు ఆడే సిరీస్‌ల సందర్భంగా అతడు టీమ్‌లోకి రావొచ్చు. అదే జరిగితే అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేసిన పిన్న వయస్కుడిగా నిలుస్తాడు. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే తప్పకుండా అతడు టీమిండియాలోకి వచ్చేస్తాడు’’ అని అంచనా వేశాడు.నాకు భయం వేస్తోందిమరోవైపు బసిత్ అలీ మాట్లాడుతూ.. ‘‘ఆట పట్ల అతడికి పూర్తి అవగాహన ఉంది. చిన్న వయసులోనే ఎంతో పరిణతి సాధించాడు. చెన్నైతో మ్యాచ్‌లో రాజస్తాన్ 128 పరుగులు చేధించాల్సి రావడం పెద్ద విషయం కాదు. అయితే, 15 బంతుల్లోనే వైభవ్ 50 పరుగులు చేయడం చర్చనీయాంశం.అతడి తండ్రి ఎంతగానో గర్వపడుతూ ఉంటాడు. కోచ్‌లు, క్రికెట్ క్లబ్ స్నేహితులు సంతోషిస్తూ ఉంటారు. ఇప్పుడే ఇలా ఉంటే.. అతడు పాతికేళ్ల వయసులోకి వస్తే బౌలర్ల పరిస్థితి ఏమిటోనన్న విషయం తలచుకుంటేనే నాకు భయం వేస్తోంది. ఈ పిల్లాడు అందరిపైనా ఆధిపత్యం చెలాయించగలడు’’ అంటూ వైభవ్ సూర్యవంశీని ఆకాశానికెత్తాడు.చదవండి: IPL 2026: పాపం అర్జున్ టెండూల్కర్.. జట్టు మారినా? -
‘అతడు మానసికంగా అన్‌ఫిట్.. అందుకే చోటు కరువు’
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఘోర అవమానం ఎదురైంది. దాదాపు పదకొండేళ్ల తర్వాత తొలిసారి బంగ్లాదేశ్‌కు వన్డే సిరీస్‌ను కోల్పోయింది. బంగ్లా పర్యటనలో భాగంగా మూడో వన్డేలో ఓడి ఈ పరాభవాన్ని మూటగట్టుకుంది.షాహిన్ ఆఫ్రిది కెప్టెన్సీలో ఈ మూడు మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్.. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడినా.. రెండో వన్డేలో గెలిచింది. ఇక తాడోపేడో తేల్చుకోవాల్సిన మూడో వన్డేలో మాత్రం 11 పరుగుల తేడాతో ఓటమిపాలై సిరీస్‌ను చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో పాక్ జట్టు ఆట తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎవరు ఎంపిక చేశారు?ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ హెడ్‌కోచ్ మైక్ హెసన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ‘‘ఈ పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ఎవరు ఎంపిక చేశారు? అన్నింటిలోనూ అతి జోక్యం అవసరమా? ఇదేమైనా అతడి అంకుల్స్ జట్టా?’’ అంటూ ఫైర్ అయ్యాడు.పాకిస్తాన్ క్రికెట్‌ను నాశనం చేయడంలో...ఇక చీఫ్ సెలక్టర్ ఆకిబ్ జావేద్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘పాకిస్తాన్ క్రికెట్‌ను నాశనం చేయడంలో ఆకిబ్ జావేద్ పాత్ర కూడా ఉంది. మైక్ హసన్‌కు తన సెలక్షన్ అధికారాలను కట్టబెట్టిందే అతడు. హెడ్‌కోచ్ అయినప్పటికీ.. సెలక్టర్ల పనిని తానే చేస్తున్నాడు. అతడే జట్టు ఎంపిక చేస్తున్నాడు. దీనికి కారణం ఎవరు?’’ అని బసిత్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.మానసికంగానే అతడు అన్ఫిట్అదే విధంగా.. బాబర్ ఆజంను బంగ్లాదేశ్ పర్యటన నుంచి తప్పించడంపై ఆకిబ్ జావేద్ చేసిన వ్యాఖ్యలపైనా బసిత్ అలీ స్పందించాడు. ఆకిబ్ చెప్పినట్లు బాబర్‌కు ఎలాంటి గాయమూ కాలేదని పేర్కొన్నాడు. ‘‘బాబర్ ఆజం శారీరకంగా ఫిట్‌గానే ఉన్నాడు. మానసికంగానే అతడు అన్‌ఫిట్’’ అంటూ బసిత్ అలీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా బాబర్ ఆజం గత కొంతకాలంగా ఫామ్‌లేమితో విమర్శల పాలవుతున్న విషయం తెలిసిందే.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో విఫలంఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో వన్డేల నుంచి సెలక్టర్లు అతడిని తప్పించినట్లు వార్తలు రాగా.. ఆకిబ్ జావేద్ మాత్రం ఫిట్‌గా లేనందువల్లే సెలక్ట్ చేయలేదని చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో పాకిస్తాన్ విఫలమైన సంగతి తెలిసిందే. అయితే, గత వరల్డ్‌కప్‌లో సూపర్-8 కూడా చేరుకుండానే నిష్క్రమించిన పాక్.. ఈసారి సూపర్-8కు చేరుకున్నా.. సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఈ టోర్నీలో బాబర్ ఆజం మొత్తంగా 91 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం.చదవండి: అతడి ఆట అసాధారణం.. గంభీర్‌పై ద్రవిడ్ ప్రశంసలు -
‘గేమ్‌ప్లాన్ ఎవడిదో కానీ చంపేయాలి’!
పాకిస్థాన్ క్రికెట్ అంటేనే అనిశ్చితికి మారుపేరు. ఎప్పుడు ఎలా ఆడుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ, కమ్రాన్ అక్మల్ గేమ్‌ప్లాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ క్రికెటర్ బాసిత్ అలీ మాట్లాడుతూ.. ‘పవర్‌ప్లేలో 60 కంటే తక్కువ పరుగులు చేయాలని చెప్పిన వాడిని మొదట షూట్ చేయాలి. గేమ్‌ప్లాన్ చాలా చెత్తగా ఉంది. నాకు తెలిసి ఆ చెప్పినవాడు ఇంతవరకు ఒక్కసారి కూడా గ్రౌండ్లోకి దిగినట్లుగా అనిపించడం లేదు. కేవలం పేపర్‌పై రాసుకొన్న థియరీని మాత్రమే అప్లై చేసే పనిలో పడ్డట్లున్నాడు. పిచ్ పరిస్థితులపై కనీసం అంచనాలు లేకుండా జట్టును బరిలోకి ఎలా దించుతారు. ఇదే పిచ్‌పై టీమిండియా కూడా ఓటమి పాలైందన్న సంగతి మరిచిపోయినట్లున్నారు.’ అని తెలిపాడు. మరో మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ కూడా ఘాటుగా స్పందించాడు. ‘ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఒకవైపు అంతర్జాతీయ క్రికెట్ ఆడుతుంటే.. పాకిస్థాన్ ఆటతీరు మాత్రం క్లబ్ క్రికెట్ కోసం ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నట్లుగా ఉంది. బాసిత్ అలీకి ఫోన్ చేసి పాక్ జట్టు ఆడుతున్న ఆట గురించి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అంతేకాదు క్లబ్ క్రికెటర్లు కూడా ఇంత దారుణంగా ఆడరనుకుంటా’ అని తెలిపాడు. బంగ్లాతో మ్యాచ్‌లో ఓటమికి కారణాలు చాలానే ఉన్నాయని బాసిత్ అలీ తెలిపారు. జట్టులో యువరక్తం ఎక్కువగా ఉందని, వాళ్లంతా సెటిల్ కావడానికి టైం పట్టే అవకాశముందన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 30.4 ఓవర్లలో 114 పరుగులకు కుప్పకూలింది. ఫహీమ్ అశ్రఫ్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో నహిద్ రానా 5 వికెట్లు తీయగా, మెహదీ హసన్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బంగ్లాదేశ్ 15.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే మార్చి 13న జరగనుంది.చదవండి: గురుశిష్యులకు అరుదైన గౌరవం! -
IND vs PAK: ‘వర్షం పడాలని కోరుకుంటున్నా’
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది. దాయాదులు భారత్- పాకిస్తాన్ పోరుకు సమయం ఆసన్నమైంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య ఆదివారం (ఫిబ్రవరి 15) మ్యాచ్ జరుగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా.. వరుణుడి భయం అభిమానులలో ఆందోళన రేకెత్తిస్తోంది.వాన పడొద్దు దేవుడా!కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో గ్రూప్-ఎలో ఉన్న భారత్- పాక్ మధ్య మ్యాచ్‌కు శ్రీలంకలోని కొలంబోలో గల ఆర్. ప్రేమదాస స్టేడియం వేదిక. భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉంది. అయితే, ఆదివారం కొలంబోలో వాన పడే అవకాశాలు 93 శాతం ఉన్నట్లు ఆక్యూవెదర్ పేర్కొంది. సాయంత్రానికి వర్షం ముప్పు తగ్గినా అవుట్ ఫీల్డ్ తడిగా ఉంటే మ్యాచ్ సజావుగా సాగే అవకాశాలు సన్నగిల్లుతాయి.ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులంతా వర్షం ప్రభావం ఈ మ్యాచ్‌పై పడకుండా చూడాలంటూ దేవుడిని వేడుకుంటున్నారు. క్రేజీ మ్యాచ్ కోసం తామంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నామని.. తమ ఆశలపై నీళ్లు చల్లవద్దని వరుణుడిని ప్రార్థిస్తున్నారు. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ (Basit Ali) వింత వ్యాఖ్యలు చేశాడు.వర్షం పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాఓ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. "ఆ సర్వాంతర్యామి (దేవుడు) నా ప్రార్థన విని వర్షం పడేలా చేయాలి’’ అని బసిత్ అలీ వ్యాఖ్యానించాడు. ఇందుకు హోస్ట్.. "మీరు మ్యాచ్ మొత్తం చూడాలని అనుకోవడం లేదా?" అని అడుగగా.. "నేను వర్షం పడాలని కోరుకుంటున్నాను (I Want Rain)" అని పునరుద్ఘాటించాడు.అదే జరిగితే మ్యాచ్ రద్దుకాగా వరల్డ్‌కప్ గ్రూప్ దశ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉండదు. ఫలితం కోసం ఇరుజట్లు కనీసం ఐదు ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. అదీ కుదరని పక్షంలో మ్యాచ్ రద్దైనట్లు అంపైర్లు ప్రకటిస్తారు. ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు.ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో భారత్.. అమెరికా, నమీబియాలపై గెలిచి నాలుగు పాయింట్లు సాధించగా.. పాకిస్తాన్ సైతం నెదర్లాండ్స్, అమెరికా జట్లను ఓడించి నాలుగు పాయింట్లతో ఉంది. అయితే, నెట్‌రన్‌రేటు పరంగా టీమిండియా (+3.050) పాకిస్తాన్ (+0.932) అత్యంత మెరుగ్గా ఉండి అగ్రస్థానాన్ని ఆక్రమించింది.ఇదేం కోరిక?ఒకవేళ దాయాదుల పోరు వర్షం వల్ల రద్దు అయిపోతే.. భారత్- పాక్ ఐదు పాయింట్లతో సూపర్-8 దశకు దాదాపుగా అర్హత సాధించినట్లే. గ్రూప్ దశలో అమెరికా, నెదర్లాండ్స్‌లకు చెరో మ్యాచ్ మిగిలి ఉండగా.. నమీబియా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే, నెదర్లాండ్స్ (-1.352), నమీబియా (-2.884) నెట్‌రన్‌రేటు మైనస్‌లలో ఉండటం గమనార్హం.ఇక గత వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అనూహ్య రీతిలో పాకిస్తాన్‌ను ఓడించి టీమిండియాతో పాటు అమెరికా సూపర్-8కు చేరిన విషయం తెలిసిందే. దీంతో పాక్ టోర్నీ నుంచి అవమాన భారంతో నిష్క్రమించింది. ఇక ఇప్పుడు భారత్ చేతిలో పాక్ గనుక భారీ తేడాతో ఓడితే మళ్లీ అమెరికాతో ప్రమాదం పొంచి ఉండవచ్చు. ఈ నేపథ్యంలోనే భారత్- పాక్ మ్యాచ్ వాన వల్ల చెడిపోవాలని బసిత్ అలీ కోరుకుంటున్నాడని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.IND vs PAK T20 World Cup 2026: భారత్ ‘రుద్ర’ రూపంచదవండి: IND vs PAK: పాక్‌తో భారత్ మ్యాచ్.. మధ్యాహ్నమే!


