'సెంచరీలు కొట్టండి.. లేదంటే అంతే మీ పని' | Basit ali blasts Hardik Pandya and Mumbai Indians after dismal show in IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: 'సెంచరీలు కొట్టండి.. లేదంటే అంతే మీ పని'

Apr 24 2026 7:45 PM | Updated on Apr 24 2026 8:39 PM

Basit ali blasts Hardik Pandya and Mumbai Indians after dismal show in IPL 2026

ఐపీఎల్‌-2026లో ముంబై ఇండియ‌న్స్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగుతోంది. గురువారం వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 103 ప‌రుగుల తేడాతో ముంబై చిత్తు అయింది. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ప‌రుగుల తేడా ప‌రంగా ముంబై ఇండియ‌న్స్‌కు ఇదే అతి పెద్ద ఓట‌మి.

దీంతో ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల చెత్త ప్రదర్శనపై ఆ జట్టు యజమాని ఆకాశ్ సైతం అసహనం వ్యక్తం చేశారు. ముంబై డౌగౌట్‌కు దగ్గరలో ఉన్న ఆకాశ్‌..  సోఫాలో నుంచి లేచి నిలబడి.. ‘‘అంతా అయిపోయింది. ఇంకేం చూస్తారు.. పదండి పదండి’’ అన్నట్లుగా ప్రేక్షకులకు సైగ చూస్తూ స్టేడియాన్ని వీడారు.  ఈ నేపథ్యంలో ఆకాశ్‌ అంబానీపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముంబై వరుస వైఫల్యాలపై ఆకాశ్ గుర్రుగా ఉన్నారని బసిత్ అలీ అన్నాడు.

ఆకాష్ అంబానీకి గనుక కోపం వస్తే పరిస్థితి మరో విధంగా ఉంటుంది. అప్పుడు ఆటగాళ్లను ఆయన దండిస్తాడు. భాయ్ ఇకపై మ్యాచ్‌లు గెలవండి, సెంచరీలు కొట్టండి అని తమ ఆటగాళ్లకు ఆకాష్‌ గట్టిగా చెబుతాడు అని బసిత్ అలీ ఎగతాళిగా వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా ముంబై జట్టు సెలక్షన్‌పై కూడా అతడు విమర్శలు కురిపించాడు. 

ముఖ్యంగా వరుసగా రెండు మ్యాచ్‌లలో విఫలమైన యువ ఆటగాడు డానిష్ మలేవార్‌ను జట్టులోకి తీసుకోవడాన్ని అతడు తప్పబట్టాడు. "ఈ కొత్త ఓపెనర్ ఎవరు? అతడిని ముంబై ఎందుకు ఆడిస్తోంది? అతనేమన్నా సిఫార్సుతో జట్టులోకి వచ్చాడా? అని అలీ మండిపడ్డాడు. అయితే ముంబై ఫ్యాన్స్‌ మాత్రం బసిత్‌ అలీకి కౌంటరిస్తున్నారు. ముందు మీ పీఎస్‌ఎల్ సంగతి చూసుకోండి, ఆ తర్వాత ఐపీఎల్‌ గురుంచి మాట్లాడు అంటూ ఓ నెటిజన్‌ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టాడు. కాగా ఐపీఎల్‌కు పోటీగా ప్రారంభమైన పీఎస్‌ఎల్‌-2026 సీజన్‌ అట్టర్‌ ప్లాప్‌ అయింది.
 

Advertisement
 
Advertisement
Advertisement