అతడు చెప్పాడనే వాటికి దూరం: జంపాకు ఘోర అవమానం | Ex-Pakistan batters bizarre claim on Adam Zampa stuns fans | Sakshi
Sakshi News home page

అతడు చెప్పాడనే వాటికి దూరం: జంపాకు ఘోర అవమానం

Apr 3 2026 2:46 PM | Updated on Apr 3 2026 3:46 PM

Ex-Pakistan batters bizarre claim on Adam Zampa stuns fans

ఆడ‌మ్ జంపా.. ఆస్ట్రేలియా అత్యుత్త‌మ స్పిన్న‌ర్ల‌లో ఒక‌డిగా పేరు గాంచాడు. షేన్ వార్న్ తర్వాత ఆసీస్‌కు దొరికిన అత్యంత విజయవంతమైన లెగ్ స్పిన్నర్‌గా జంపా కొన‌సాగుతున్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తిరుగులేని రికార్డు ఉన్న జంపా, ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. తాజాగా ఇదే విష‌యంపై ఓ పాకిస్తానీ క్రికెట్ షోలో చ‌ర్చ జ‌రిగింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్లు కమ్రాన్ ఆక్మల్‌, బాసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు.

"ఆడ‌మ్ జంపా ఒక అద్భుత‌మైన స్పిన్న‌ర్‌.  లైన్ అండ్ లెంగ్త్, గూగ్లీ, ఫ్లిప్పర్, అన్నీ బౌలింగ్ చేయగ‌ల‌డు. కానీ ఇప్ప‌టివ‌ర‌కు అత‌డు టెస్టు క్రికెట్ ఆడ‌క‌పోవ‌డం నాకు ఆశ్చ‌ర్యం కలిగిస్తోంది.  క్రికెట్ ఆస్ట్రేలియా కూడా అత‌డిని టెస్టుల కోసం ఎందుకు పరిగణించలేదో" అర్థం కావట్లేదు ఆక్మ‌ల్ అన్నాడు.

అయితే ఇందుకు బ‌సిత్ అలీ పొంత‌న లేని స‌మాధాన‌మిచ్చాడు. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ ఆపడం వల్లే జంపా టెస్ట్ క్రికెట్ ఆడలేదని అలీ పేర్కొన్నాడు.

కాగా జంపా, స్టోయినిష్ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ఉద్దేశించి బాసిత్ అలీ ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు అన్పిస్తోంది. వారిద్ద‌రూ ఆన్‌ది ఫీల్డ్‌, ఆఫ్‌ది ఫీల్డ్ చాలా క్లోజ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. గ‌తంలో మార్కస్ స్టాయినిస్ , ఆడమ్ జంపా ‘గే కపుల్స్’ అంటూ రూమర్స్ వినిపించాయి. 

అయితే రూమర్స్‌కు స్టోయినిస్‌, జంపా ఎప్పుడో చెక్ పెట్టేశారు. తాము మంచి ఫ్రెండ్స్ అని.. ఎక్కువగా గేమ్ గురించే మాట్లాడుకుంటూ ఉంటామని స్పష్టం చేశారు. 

2021లో ఆడమ్ జంపా తన గర్ల్‌ఫ్రెండ్ హాటెల్‌ని వివాహం చేసుకోగా.. స్టోయినిష్ గతేడాది ఆఖరిలో తన ప్రియురాలు సారా జార్నుచ్‌ని నిశ్చితార్దం చేసుకున్నాడు. అయితే లైవ్‌షోలో ఇద్దరు స్టార్ క్రికెటర్లను అవమానించిన బసిత్ అలీపై నెటిజన్లు ఫైరవవుతున్నారు.

కొంచెం అయినా సిగ్గు ఉందా అంటూ మండిపడుతున్నాడరు. కాగా జంపా ప్ర‌స్తుతం పీఎస్ఎల్ 2026లో కరాచీ కింగ్స్ తరపున ఆడుతుండ‌గా.. స్టోయినిష్ ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు.
చదవండి: IPL 2026: ఆర్సీబీ, స‌న్‌రైజ‌ర్స్ కాదు.. ప్లే ఆఫ్స్‌కు చేరే జ‌ట్లు ఇవే!
 

Advertisement
 
Advertisement
Advertisement