ఆర్సీబీ, స‌న్‌రైజ‌ర్స్ కాదు.. ప్లే ఆఫ్స్‌కు చేరే జ‌ట్లు ఇవే! | Kevin Pietersen picks IPL 2026 top four teams | Sakshi
Sakshi News home page

IPL 2026: ఆర్సీబీ, స‌న్‌రైజ‌ర్స్ కాదు.. ప్లే ఆఫ్స్‌కు చేరే జ‌ట్లు ఇవే!

Apr 3 2026 2:08 PM | Updated on Apr 3 2026 3:36 PM

Kevin Pietersen picks IPL 2026 top four teams

PC: BCCI/IPL

ఐపీఎల్‌-2026 సీజన్ ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఈ టోర్నీలో మొద‌టి ఆరు మ్యాచ్‌లు ముగిశాయి. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ముంబై ఇండియ‌న్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌, పంజాబ్‌, ఎస్ఆర్‌హెచ్ వంటి జ‌ట్లు బోణీ కొట్ట‌గా.. మూడు సార్లు ఛాంపియ‌న్ అయిన కేకేఆర్ మాత్రం వరుస‌గా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 

అదేవిధంగా గుజ‌రాత్ టైటాన్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ల‌క్నో వంటి జ‌ట్లు త‌మ మొద‌టి మ్యాచ్‌ల‌లో ఓట‌మిని చ‌విచూశాయి. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ అగ్ర‌స్ధానంలో ఉండ‌గా.. ఆర్సీబీ, ఢిల్లీ, ముంబై త‌ర్వాతి స్ధానాల్లో ఉన్నాయి. రాబోయో మ్యాచ్‌ల త‌ర్వాత ఈ స్ధానాలు తారుమారయ్యే అవ‌కాశ‌ముంది.

ఈ నేప‌థ్యంలో ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించే జ‌ట్ల‌ను ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్ అంచ‌నా వేశాడు. ముంబై ఇండియ‌న్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, రాజ‌స్తాన్, పంజాబ్ టాప్-4లో నిలిచి ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అవుతాయని పీట‌ర్స‌న్ జోస్యం చెప్పాడు. 

అయితే డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీకి ఈ జాబితాలో చోటు ద‌క్క‌క‌పోవ‌డం గమ‌నార్హం. అంతేకాకుండా ఎస్ఆర్‌హెచ్‌, గుజ‌రాత్ టైటాన్స్, రాజ‌స్తాన్ వంటి జ‌ట్ల‌ను కూడా అత‌డు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. ఈ ఏడాది సీజ‌న్‌లో రాజ‌స్తాన్ బౌలింగ్‌, బ్యాటింగ్ ప‌రంగా ప‌టిష్టంగా క‌న్పిస్తోంది. అయిన‌ప్ప‌టికి పీట‌ర్స‌న్ త‌న టాప్‌-4లో చోటు ఇవ్వ‌లేదు.
చదవండి: IPL 2026: ‘ఎందుకంత ద్వేషం.. నేను ఆడడం ఇష్టం లేదా?’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement