మెన్‌స్ట్రువల్‌ లీవ్‌.. ఓ చర్చ! బలమా... బలహీనతా? | Women Pros And Cons Of The Menstrual Leave Policy | Sakshi
Sakshi News home page

మెన్‌స్ట్రువల్‌ లీవ్‌.. ఓ చర్చ! బలమా... బలహీనతా?

Jul 10 2026 8:19 AM | Updated on Jul 10 2026 8:19 AM

Women Pros And Cons Of The Menstrual Leave Policy

ద్యోగాలు చేసే మహిళలకు ఇచ్చే మెన్‌ స్ట్రువల్‌ లీవ్‌ పాలసీపై సానుకూల, ప్రతికూల కోణాల్లో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా అడుగులు వేస్తుండగా.. సుప్రీంకోర్టు, పలువురు మేధావులు మహిళలకు పీరియడ్స్‌ లీవ్స్‌ తప్పనిసరి చేయడం వల్ల వారు ఉపాధి రంగంలో వెనుకబడిపోయే ప్రమాదం ఉండటమే కాదు, ప్రాజెక్ట్‌ డెడ్‌లైన్లు, వ్యాపార ఉత్పాదకతను దృష్టిలో ఉంచుకుని కార్పొరేట్‌ సంస్థలు పురుషులకేప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి సెలవుల వల్ల పురుషులతో సమానంగా గుర్తింపు, వేతనం కోసం మహిళలు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటాలు నీరుగారిపోయి, మహిళలను శారీరకంగా బలహీనులుగా చూసే పాతకాలపు మూస పద్ధతులు మళ్లీ బలపడతాయని ప్రముఖంగా వినిపిస్తున్న వాదన.

కాబట్టి మహిళల కెరీర్‌ను దృష్టిలో ఉంచుకుని సమతుల్యమైన విధానాలను రూ΄÷ందించాలి. అంటే ‘ఆ రోజుల్లో’ ఇంటినుంచి పనిచేసే సౌలభ్యం ఇవ్వడం, మెడికల్‌ లీవ్స్‌ పెంచడం, పనిగంటల్లో వెసులుబాటు... వంటివి. దీనివల్ల యాజమాన్యాలకు నష్టం జరగకుండా.. పని ఉత్పాదకత లో మార్పు లేకుండా ఉంటుంది. మహిళలకూ ఉపశమనంగా ఉంటుంది. దీనివల్ల మెన్‌స్ట్రువల్‌ లీవ్‌ అనే ప్రత్యేక లేబుల్‌ లేకుండా.. మహిళల గోప్యతకు భంగం లేకుండా కూడా ఉంటుందని పలువురి అభిప్రాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement