ఆరోగ్యప్రదాయిని ‘కోకో నిబ్స్‌’ | The best trending superfood is cocoa nibs | Sakshi
Sakshi News home page

ఆరోగ్యప్రదాయిని ‘కోకో నిబ్స్‌’

Jul 12 2026 4:30 AM | Updated on Jul 12 2026 4:30 AM

The best trending superfood is cocoa nibs

రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం

ఒత్తిడికి శత్రువు.. గుండెకు నేస్తం

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌: ఆరోగ్య ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘కోకో నిబ్స్‌’ గురించే చర్చ నడుస్తోంది! ట్రెండింగ్‌లో ఉన్న బెస్ట్‌ సూపర్‌ఫుడ్‌ ఇదేనంటూ సోషల్‌ మీడియా చెబుతోంది. ఇంతకీ ఇదేంటంటే.. కరకరలాడే డార్క్‌ చాక్లెట్‌ ముక్కలు. ఇందులో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్‌ బోలెడు ఉన్నాయని.. వాటిని రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలని న్యూట్రిషనిస్టులు సిఫారసు చేస్తున్నారు. నిజానికి ఇవి చాక్లెట్‌ తయారీకి వాడే కోకో గింజల ముక్కలు. వాటిలో ఎలాంటి చక్కెరలు కలపరు.. కాబట్టి ఇవి 100 శాతం ఆరోగ్యకరమైనవి. భావోద్వేగాలను మార్చడం నుంచి గుండెను పదిలంగా ఉంచే వరకు కాకో నిబ్స్‌ చేసే మేలు అంతా ఇంతా కాదు. 

పోషకాల గని 
మార్కెట్లో దొరికే ఖరీదైన సప్లిమెంట్ల కంటే కోకో నిబ్స్‌ వంద రెట్లు మేలైనవి. వాటిలో కండరాల పనితీరును మెరుగుపరిచే మెగ్నీషియం, ఎముకలను పటిష్టపరిచే ఐరన్, క్యాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే శరీర అలసటను తగ్గించి రోజంతా యాక్టివ్‌గా ఉంచడంలోనూ దోహదపడుతుంది. ముఖ్యంగా శరీరంలో మంట తగ్గించడంలో, ఫ్రీ రాడికల్స్‌ వల్ల కలిగే నష్టాన్ని నివారించి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కాపాడటంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. 

కోకో నిబ్స్‌లో ఫెనిలెథైలమైన్, అనండమైడ్‌ వంటి అద్భుతమైన సమ్మేళనాలు ఉన్నాయి. అందుకే వాటిని సరదాగా ‘లవ్‌ డ్రగ్‌’ అని కూడా పిలుస్తారు. ఈ ‘డ్రగ్‌’ మెదడులో సంతోషాన్ని, ఉత్సాహాన్ని కలిగించే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి మనసుకు ప్రశాంతతను ఇచ్చే ఒక సహజ న్యూరోట్రాన్స్మిటర్‌లా పనిచేస్తుంది. కోకో నిబ్స్‌లోని ఫ్లేవనాయిడ్స్‌ గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. తద్వారా రక్తపోటు అదుపులోకి వస్తుంది. శరీరంలోని మంచి కొవ్వు శాతం పెరిగి గుండెపోటు ముప్పు తగ్గుతుంది.

డైట్‌లో ఎలా చేర్చుకోవాలి?  
కోకో నిబ్స్‌ కాస్త చేదుగా, కాఫీ గింజల రుచితో కరకరలాడుతుంటాయి. వాటిని మీ మెనూలో రకరకాలుగా వాడుకోవచ్చు
» బ్రేక్‌ఫాస్ట్‌లో: ఓట్‌మీల్, కార్న్‌ఫ్లేక్స్‌ లేదా పెరుగుపై చల్లుకొని తినొచ్చు.
» స్మూతీస్‌లో: మిల్క్‌షేక్స్‌ లేదా స్మూతీస్‌లో వేస్తే అదనపు క్రంచ్‌ వస్తుంది.
» డెజర్ట్స్‌ టాపింగ్‌: ఐస్‌క్రీమ్‌లు, కేక్‌లు, బ్రౌనీస్‌ వంటి తీపి పదార్థాలపై వాటిని వేసుకుంటే ఆ చేదు, తీపి కాంబినేషన్‌ అదిరిపోతుంది.
» సలాడ్స్‌: హెల్తీ సలాడ్స్‌ లేదా గ్రెయిన్‌ బౌల్స్‌లో వేసుకుంటే కరకరలాడుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement