స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ 9 నోటీసులు | FSSAI issues notices to Swiggy Instamart | Sakshi
Sakshi News home page

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ 9 నోటీసులు

Jul 12 2026 4:20 AM | Updated on Jul 12 2026 4:20 AM

FSSAI issues notices to Swiggy Instamart

సాక్షి, న్యూఢిల్లీ: వినియోగదారులకు కల్తీ, పాడై న ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నారన్న ఫిర్యాదులపై ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు భారత ఆహార భద్రత, ప్రమాణా ల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఏకంగా తొమ్మిది నోటీసులు జారీ చేసింది. ఆహార భద్ర త, ప్రమాణాల చట్టం–2006 కింద నమోదైన ఈ ఉల్లంఘనలపై సమగ్ర వివరణ ఇవ్వాలని ఫుడ్‌ బిజినెస్‌ ఆపరేటర్‌ను ఆదేశించింది. 

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ ద్వారా కాలం చెల్లిన, పాడైన ఉత్ప త్తులు సరఫరా అవుతున్నట్లు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ’నాయిస్‌’ బ్రాండ్‌ గుడ్లను లైసెన్స్‌ పరిధిలో లేని కేటగిరీ కింద విక్రÆ ‡ుుస్తున్నారని, అనుమతులు పొందే వరకు వాటి విక్రయాలు నిలిపివేయాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశించింది. ‘హెల్తీఫై 100% వే ప్రొటీన్‌ 1 కేజీ’, ‘నాయిస్‌ హోమ్‌స్టైల్‌ మద్రాస్‌ మిక్చర్‌ విత్‌ పీనట్స్‌’ ఉత్పత్తులను గడువు తీరిన తర్వాత సర ఫరా చేశారు. 

‘అక్షయకల్ప ఆర్గానిక్‌ ఎగ్‌’, ‘కక్కే దా పరాఠా’ ఉత్పత్తులు కుళ్లిపోయి, దుర్వాసన వస్తున్నా సంస్థ దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. పసిపిల్లల ఆహారం సైతం కలుషితమైందని, పాడైన ఉత్పత్తిని వెనక్కి ఇచ్చినా మళ్లీ అదే వస్తువును సరఫరా చేయడంపై నోటీసుల్లో ఆందోళన వ్యక్తం చేసింది. ప్యాకింగ్‌ సరిగాలేని ఆహారంతో పాలు, గుడ్లను డెలివరీ చేస్తున్నట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గుర్తించింది.

తప్పుడు లైసెన్సులు.. నివేదికకు ఆదేశం
కొన్ని ఫుడ్‌ బిజినెస్‌ సంస్థలు తప్పుడు, చెల్లని లేదా ఉనికిలోనే లేని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌ నంబర్లతో ఉత్పత్తులను విక్రయిస్తున్నాయని ప్రాధికార సంస్థ ఆక్షేపించింది. రిజిస్ట్రేషన్‌లో ఉన్న పేర్లకు, విక్రయిస్తున్న పేర్లకు పొంతన లేదని తెలిపింది. ఆహార భద్రతపై ఫిర్యాదులు అందితే కేవలం డబ్బులు వాపసు ఇస్తున్నారే తప్ప సమస్యను పరిష్కరించడం లేదని స్పష్టం చేసింది. విక్రయదారుల పర్యవేక్షణ, నాణ్యత పరిశీలనలో సంస్థ విఫలమైందని పేర్కొంది.

 ఈ ఉల్లంఘనలపై ఆధారాలతో సహా పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని, నాణ్యతా ప్రమాణాలు, స్టాక్‌ నిర్వహణ, పరిశుభ్రతపై తీసుకుంటున్న చర్యల వివరాలు సమర్పించాలని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ను ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తీసుకునే నివారణ చర్యలు తెలపాలని స్పష్టం చేసింది. నిర్ణీత గడువులోగా నివేదిక ఇవ్వకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ హెచ్చరించింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement