breaking news
expired material
-
యూజ్బై, ఎక్స్పైరీ డేట్, బెస్ట్ బిఫోర్ మధ్య తేడా ఇదే..
కిరాణా దుకాణం, రిటైల్‌స్టోర్ వంటి సూపర్మార్కెట్లకు వెళ్లి ఏదైనా వస్తువు కొనుగోలు చేసేప్పుడు ప్రధానంగా దాని ఎక్స్పైరీ తేదీ గమనిస్తాం కదా. ఒక్కో ప్రోడక్ట్‌పై ఒక్కో విధంగా ఈ ఎక్స్పైరీ వివరాలు ఉంటాయి. ఉదాహరణకు వివిధ కంపెనీలు తయారు చేసే ప్రతి ప్రోడక్ట్‌పై యూజ్బై, ఎక్స్పైరీ డేట్, బెస్ట్ బిఫోర్ వంటి లేబుళ్లతో తేదీని నిర్ణయించడం గమనిస్తుంటాం. అందులో ఒక్కోదానికి ఒక్కో అర్థం ఉంది. కంపెనీ లేబుల్‌పై ప్రచురించిన డేట్ ముగిసినా కొన్ని పదార్థాలను అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవచ్చని కొందరు చెబుతున్నారు. అయితే అలాంటి లేబుల్ ఉన్న ఉత్పత్తులను గుర్తించడం ఎలాగో తెలుసుకుందాం.ఇదీ చదవండి: ‘టాటా సుమో’.. ఆ పేరు ఎలా వచ్చిందంటే..ఎక్స్పైరీ డేట్: ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ లేబుల్‌పై ఎక్స్పైరీ డేట్ ఉంటే అందులోని వస్తువులు, పదార్థాలు కచ్చితంగా ఆతేదీ లోపే వినియోగించాల్సి ఉంటుంది. తేదీ ముగిసిన వాటిని అసలు ఉపయోగించకూడదు.యూజ్బై: కొన్ని వస్తువులు, పదార్థాల ప్యాకేజీ లేబుల్‌పై యూజ్బై తేదీ ఉంటుంది. ఎక్స్పైరీ తేదీలాగే ఆలోపే అందులోని పదార్థాలను ఉపయోగించుకోవాలి.బెస్ట్బిఫోర్: ఈ లేబుల్ ఉత్పత్తికి సంబంధించిన అత్యుత్తమ నాణ్యత తేదీని సూచిస్తుంది. ఈ తేదీ నాణ్యత, భద్రతకు సంబంధించిందని గమనించాలి. ‘బెస్ట్ బిఫోర్’ తేదీ తర్వాత ప్యాకేజీలోని పదార్థాలు తాజాగా, రుచిగా ఉండకపోవచ్చు. పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అయితే అత్యవసర సమయాల్లో వాటిని వినియోగించవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. బెస్ట్బిఫోర్ తేదీ ముగిసిన తర్వాత పదార్థాలు వాడకపోవడమే మంచిదని ఇంకొందరు చెబుతున్నారు. -
చంద్రన్న కానుకలో గడువుతీరిన సరుకులు
చిత్తూరు జిల్లా సత్యవేడులో సంక్రాంతికి చంద్రన్న కానుకగా ఇచ్చిన పదార్థాలు తిని అస్వస్థతకు గురైన ఘటనపై అధికారులు స్పందించారు. సంక్రాంతి కానుకగా అందించిన సరుకుల్లో గడువు తీరిన (ఎక్స్పైర్ అయిన) సరుకులు కూడా ఉన్నాయని, వాటినే వినియోగదారులకు సరఫరా చేశారని నిర్ధారించారు. అస్వస్థతకు గురైన బాధితులను తహసిల్దార్ సత్యనారాయణ నాయుడు, ఇతర సిబ్బంది పరామర్శించారు. ఈ సరుకులను సరఫరా చేసిన సంస్థపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.