ఐదు పదుల వయసులో నీట్‌ పరీక్ష..! ఐతే.. | 57 year old Lucknow man appears for NEET 2026 | Sakshi
Sakshi News home page

ఐదు పదుల వయసులో నీట్‌ పరీక్ష..! ఐతే..

May 5 2026 4:42 PM | Updated on May 5 2026 4:48 PM

57 year old Lucknow man appears for NEET 2026

జాతీయ  స్థాయిలో నిర్వహించే ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్ష నీట్‌NEET)కు  హాజరైన అభ్యర్థులలో ఒక అభ్యర్థి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఎందుకంటే ఐదుపదుల వయసులో ఈ పరీక్షకు పోటీపడటమే. లక్నోలోని చందర్‌నగర్‌ నివాసి అయిన అశోక్‌ బహార్‌ మాంటిస్సోరి పాఠశాలలో గత ఆదివారం ఈ పరీక్షక రాశారు. నీట్‌ యూజీ 2026 పరీక్ష మే 3, 2026న దేశ వ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో దిగ్విజయంగా నిర్వహించన సంగతి తెలిసిందే. 

ఇక బహార్‌ గతంలో ఒక ఎరువుల తయారీ సంస్థలో మార్కెటింగ్ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయన వైద్య రంగంపై ఉ​న్న మక్కువతో ఎంతో కాలంగా ఈ పరీక్ష రాయలని అనుకున్నారట. అయితే ఇన్నేళ్లకు ఆ కల నెరవేరిందని ఆనందంగా చెబుతున్నారు. ఆయన 2000వ సంవత్సరంలో వాలంటరీ రిటైర్మెంట్‌(స్వచ్ఛంద పదవీ విరమణ (VRS)) తీసుకున్నప్పటి నుంచి  నీట్‌ పరీక్ష రాయాలనే ఆలోచన ఉందట. 

తాను సమాజానికి అర్థవంతమైన రీతీలో సేవ చేయాలంటే ఇదే సరైన రంగం అని అనిపించదట. అందుకు తనకు సరైన గుర్తింపు, అర్హత ఉండాలని భావించే నీట్‌ పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. ఇందుకు ఒకరకంగా తన కుటుంబ ప్రభావం కూడా ఒక కారణమని చెప్పడం విశేషం. బహార్‌ భార్య డాక్టర్‌ మంజుల్‌ బహార్‌ ప్రస్తుతం అమెరికాలో వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. ఈ వృత్తితో దశాబ్దాల పాటు అనుబంధం ఉండటం వల్ల ఔషధాల గురించి కొంత అవగాహన ఉందని చెప్పుకొచ్చారు. 

కానీ వైద్యవృత్తిని చేపట్టేలా అధికారికంగా అర్హతలు లేవని చెప్పారు. నిజానికి నీట్‌ ప్రవేశ పరీక్ష అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సులలో ప్రవేశం కోసం నిర్వహించే ఏకైక ప్రవేశ పరీక్ష. దీనికి ఎక్కువగా 17 నుంచి 25 ఏళ్ల వయసు ఉన్నవారే హాజరవుతారు. కానీ దాన్ని సవాలు చేసే 57 ఏళ్ల వ్యక్తి ఈ పరీక్ష రాయడం విశేషం. ఆయన ఇతర అభ్యర్థులు మాదిరిగానే ఈ పరీక్ష రాశారు. చాలాకాలం తర్వాత చదవడం వల్ల.. కాస్త కష్టమైందని, అయితే ఏకాగ్రతతో దాన్ని సాధించగలిగానని అన్నారు. 

గతకొంతకాలంగా కొందరు పెద్దలు లేటు వయసులో తిరిగి ఉన్నత చదువుపై అడుగుల వేస్తున్న కేసులు పెరుగుతుండటం విశేషం. ఇక బహార్‌ లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు, కష్టపడగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు..ఏ దశలోనైనా ముందుకు సాగొచ్చని అన్నారు. ఏదీఏమైనా కఠినతరమైన ఆ నీట్‌ పరీక్షను రెస్ట్‌ తీసుకునే వయసులో పోటీపడటం అనేది అత్యంత ప్రశంసనీయమైన విషయం. కాగా, అతనికి వైద్య కళాశాలలో ప్రవేశం లభిస్తుందో లేదా అనేది నీట్‌ ఫలితాలే నిర్ణయిస్తాయి. మరి ఆ తాతగారికి ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా..!.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement