
రేపటి వరకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్టేట్ కోటా కింద బీడీఎస్ కోర్సులో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ మొదలైంది. కనీ్వనర్ (కాంపిటెంట్ అథారిటీ) కోటా కింద ప్రభుత్వ, ప్రైవేట్ డెంటల్ కళాశాలలు, ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌లో సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్) శనివారం వెబ్ ఆప్షన్ల నోటిఫికేషన్ విడుదల చేసింది. శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 22న మధ్యాహ్నం 1 గంట వరకు అభ్యర్థులు https:/ tsbdsadm. tsche. in/ లో ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈనెల 15న విడుదల చేసిన స్టేట్ కోటా ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో పేర్లు ఉన్న అభ్యర్థులకే ఈ అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ప్రభుత్వపరంగా ఉస్మానియా డెంటల్ కాలేజీతో పాటు ఆర్మీ డెంటల్ కాలేజీ ఉండగా, మరో 10 ప్రైవేటు డెంటల్ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీల్లోని సీట్ల కోసం ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది.
ఫీజులు ఇలా...
కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు యూనివర్సిటీ ఫీజు రూ. 12,000 (ఆన్‌లైన్ ద్వారా) చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ట్యూషన్ ఫీజుల కింద ప్రభుత్వ డెంటల్ కళాశాలలకు ఏటా రూ. 10,000, ప్రైవేట్ డెంటల్ కళాశాలలకు ఏటా రూ. 45,000 చెల్లించాల్సి ఉంటుంది.
రెండో రౌండ్‌లో నో చాన్స్..
బీడీఎస్ కౌన్సెలింగ్‌కు సంబంధించి మొదటి దశలో ఆప్షన్లు వినియోగించని అభ్యర్థులకు తరువాతి రౌండ్లలో అవకాశం ఉండదు. కౌన్సెలింగ్‌లో సీటు కేటాయించబడిన తర్వాత చేరకపోతే, తదుపరి కౌన్సెలింగ్‌కు అర్హత ఉండదు. ఎన్ని కావాలంటే అన్ని కళాశాలలపై ఆప్షన్లు ఇవ్వొచ్చు. సీటు కేటాయింపుని వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. కేటాయింపు ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా లభిస్తుంది. సీటు వచ్చిన వారు యూనివర్సిటీ ఫీజు చెల్లించి అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసి, సంబంధిత కళాశాల ప్రిన్సిపల్ వద్ద ఒరిజినల్ సర్టీఫికెట్లు, బాండ్లు సమరి్పంచి ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పీడబ్ల్యూడీ, ఆంగ్లో ఇండియన్, పీఎంసీ, క్యాప్ కేటగిరీల అభ్యర్థులకూ ఇదే విధానం వర్తిస్తుంది.
హెల్ప్‌లైన్ నంబర్లు
టెక్నికల్ హెల్ప్: 9392685856, 7842136688, 9059672216, అడ్మిషన్ నిబంధనలపై క్లారిటీ కోసం: 7901098840, 9490585796, పేమెంట్ సమస్యలు: 9618240276