ఇద్దరు సంయుక్త కార్యదర్శులు, ఇద్దరు జాయింట్ డైరెక్టర్ల నియామకం
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ ఉదంతం నేపథ్యంలో కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)లో మార్పులు చేపట్టింది. తాజాగా ఇద్దరు సంయుక్త కార్యదర్శులు, ఇద్దరు జాయింట్ డైరెక్టర్లను నియమిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది. సంయుక్త కార్యదర్శులుగా 1998 బ్యాచ్ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ అధికారి అనూజా బాపట్‌తోపాటు 2004 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి రుచితా విజ్‌ను సిబ్బంది వ్యవహారాల శాఖ నియమించింది. అదేవిధంగా, జాయింట్ డైరెక్టర్లుగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి ఆకాశ్ జైన్‌ను, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ అధికారి ఆదిత్య రాజేంద్ర భోజ్‌గాధియాను నియమిస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది. వీరి పదవీ కాలం ఐదేళ్లని అందులో పేర్కొంది.


