నీట్‌ పేపర్‌ లీకేజీ కేసులో కింగ్‌పిన్‌ అరెస్ట్‌ | CBI arrests chemistry professor PV Kulkarni in NEET-UG 2026 paper leak case | Sakshi
Sakshi News home page

నీట్‌ పేపర్‌ లీకేజీ కేసులో కింగ్‌పిన్‌ అరెస్ట్‌

May 15 2026 7:10 PM | Updated on May 15 2026 8:44 PM

CBI arrests chemistry professor PV Kulkarni in NEET-UG 2026 paper leak case

న్యూఢిల్లీ: నీట్‌-యూజీ 2026 పేపర్‌ లీకేజీ వెనుక మాస్టర్‌ మైండ్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. నీట్‌ పేపర్‌ తయారీలో కీలక పాత్ర పోషించిన పూణేకి చెందిన  ప్రొఫెసర్‌ పీవీ కులకర్ణీని అదుపులోకి తీసుకున్నారు. 

తన ఇంట్లోనే ఇనిస్టిట్యూట్‌ నడుపుతున్న పీవీ కులకర్ణి .. ఎన్‌టీఏ ఏర్పాటు చేసిన క్వశ్చన్‌ పేపర్‌ కమిటీలో సబ్జెట్‌ ఎక్స్‌పర్ట్‌గా ఉన్నారు. నీట్‌ ఎగ్జామ్‌కు ముందే క్వశ్చన్‌ పేపర్‌ ఆయనకు అందింది. ఆ క్వశ్చన్‌ పేపర్‌ను తాను ఇంట్లో నడిపే ఇనిస్ట్యూట్‌ విద్యార్థికి లీక్‌ చేశాడు. లీకైన ప్రశ్నపత్రాలు, వాటి సమాధానాలను కాపీ చేసి గుర్తుంచుకునేలా తన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. ఈ భారీ పేపర్ లీక్ నెట్‌వర్క్‌కు సంబంధించి సీబీఐ ఇప్పటివరకు మొత్తం ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుంది.

మరోవైపు నీట్‌ యూజీ పరీక్ష పేపర్‌ లీకేజీతో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్‌ 21న నీట్ యూజీ రీ ఎగ్జామ్‌ నిర్వహిస్తుమని కేంద్రం ప్రకటించింది. పేపర్‌ లీకేజీ దుమారం తర్వాత ఈనెల 3వ తేదీనాటి పరీక్ష రద్దయింది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్‌ అయ్యారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement